దోషులపై చర్యలు తీసుకోవాలి
– కండసారా రిజిస్ట్రేషన్ పత్రాలు మాయచేసే కుట్ర
– సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట వైఎస్సార్‌సీపీ ధర్నా
హిందూపురం అర్బన్ : కండసారా షుగర్ ఫ్యాక్టరీ భూముల రిజిస్ట్రేషన్ పత్రాలు మాయం చేయాలనే ఉద్దేశంతో కావాలనే సబ్ రిజిస్ట్రార్ కార్యాయానికి నిప్పు పెట్టినట్లు స్పష్టంగా తెలుస్తోందని వైఎస్సార్‌సీపీ నాయకులు అన్నారు. మంగళవారం స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు.
పార్టీ యువజన రాష్ట్ర కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్, ఏ బ్లాక్ కన్వీనర్ మల్లికార్జున, కౌన్సిల్ ఫ్లోర్‌లీడర్ శివ, కౌన్సిలర్లు ఆసీఫ్‌వుల్లా, నాగభూషణరెడ్డి మాట్లాడుతూ పథకం ప్రకారం కిరోసిన్ పోసి నిప్పు పెట్టి షార్ట్‌సర్యూ్యట్‌గా చిత్రీకరించడానికి ప్రయత్నించినట్లు కనిపిస్తోందని ఆరోపించారు. కార్యాలయానికి నిప్పుపెట్టిన దోషులను వెంటనే శిక్షించాలని నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్ మైనుద్దీన్‌కు వినతిపత్రం సమర్పించారు. వైఎస్సార్‌సీపీ పట్టణ మహిళ కన్వీనర్ నాగమణి, మండల కన్వీనర్ షామింతాజ్, కౌన్సిలర్లు జబీవుల్లా, షాజియా, షాహతాజ్, జరీనా, అంజినప్ప, నాయకులు నరసింహారెడ్డి, సమద్, రమేష్, నర్సిరెడ్డి, విద్యార్థి సంఘ నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, అజుబా తదితరులు పాల్గొన్నారు.
సబ్ రిజిస్ట్రార్ హస్తం ఉంది
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కాలిపోవడంపై స్థానిక స»Œ æరిజిస్ట్రార్ హస్తం ఉన్నట్లు కనిపిస్తోందని వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ అన్నారు. మంగళవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రూ.కోట్లు విలువ చేసే కండసారా ఫ్యాక్టరీ భూములు రిజిస్ట్రేషన్ జరగడాన్ని జీర్ణించుకోలేని కొందరు నాయకులు చేసిన నాటకమన్నారు. సంఘటన ప్రాంతంలో కిరోసిన్ బాటిల్ దొరికినా.. కేసును వీగించేందుకు ఓ పోలీసు అధికారి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
2013లో స్థానిక లారీ వర్కర్స్ యూనియన్‌కు చెందిన రూ.5 కోట్లు విలువ చేసే ఆస్తిని చైర్‌పర్సన్ భర్త నాగరాజు రిజిష్టర్ చేసుకున్నారని.. దానిపై యూనియన్ నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే ఆ సర్వే నంబరులో రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరుపరాదని ప్రొసీడింగ్ ఇచ్చారని తెలిపారు. కానీ టీడీపీ జిల్లా నాయకుడి భార్య పేరుతో ఆ భూమిని స»Œ æరిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేశారు. అయినా ఈ అధికారిపై ఎలాంటి చర్యలు లేకపోవడం దారుణమన్నారు.