తాండాలకు కొత్త కళ!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: గిరిజన తండాలు త్వరలో కొత్త కళను సంతరించుకోనున్నాయి. ఇప్పటివరకు అనుబంధ గ్రామాలుగా ఉన్న తండాలు కొత్తగా గ్రామ పంచాయతీలుగా అవతరించనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేసే అంశంపై గతవా రం సీఎం కేసీఆర్ సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిం చారు. ఇందులో భాగంగా చర్చకు వచ్చిన అంశాలపై వివరాలు సేకరించేం దుకు ఆ శాఖ అధికారులు చర్యలు ముమ్మరం చే శారు. ఈ మేరకు జిల్లా పంచాయతీ శాఖ అధికారులకు సర్క్యులర్ జారీ చేశారు. దీంతో చర్యలకు ఉపక్రమించిన పంచాయతీ రాజ్‌శాఖ అధికారులు క్షేత్రస్థాయి లో వివరాలు సేకరించే పనిలో పడ్డారు.
మూడు రకాలుగా వివరాల సేకరణ
తండాలను గ్రామ పంచాయతీలుగా రూపొందించే అంశంపై మూడు రకాలు గా వివరాలు సమర్పించాలంటూ మం డల అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో గ్రామ పంచాయ తీ పేరు, జనాభాతో పాటు వాటి పరిధి లో 500, 750, 1000 జనాభా ఉన్న తం డాల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని సూ చించింది. ఈ వివరాలను నిర్ణీత ప్రొఫార్మాలో ఈ నెల 14లోగా సమర్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో.. అధికారులు వివరాల సేకరణ ప్రక్రియను వేగవంతం చేశారు.
జిల్లాలో 705 పంచాయతీలకుగాను 18 పంచాయతీలను ఐదు నగర పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. మరికొన్ని గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేసే క్రమంలో ఆటంకాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో వాటిని పం చాయతీలుగా ఉంచినప్పటికీ.. ఎన్నికలు నిర్వహించలేదు. ఇవికాకుండా మరో 350 వరకు తండాలున్నట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. తాజాగా సేకరిస్తున్న వివరాల ప్రకారం వీటిలో ఎన్ని తండాలు గ్రామపంచాతీయలుగా మారనున్నాయో త్వరలో స్పష్టత రానుంది.