ఇక సబ్సిడీపై 5 కేజీల ఎల్పీజీ సిలిండర్లు
న్యూఢిల్లీ : వంటగ్యాస్ వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించడానికి చమురు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం చమురు కంపెనీలు గృహవినియోగదారులకు 14.2 కేజీల సిలిండర్లను ఏడాదికి 12 చొప్పున సబ్సిడీ రేటుకు అందిస్తుండడం తెలిసిందే. తాజాగా ఈ కంపెనీలు 5 కేజీల చిన్న సిలిండర్లనూ సబ్సిడీ ధరకు అందిస్తున్నాయి.
ఒక్కో సిలిండర్‌కు రూ.155 సబ్సిడీ(ఢిల్లీ రేటు) ధరపై ఏడాదికి 34 సిలిండర్లు సరఫరా చేసేందుకు కంపెనీలు కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చాయి. పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం రాజ్యసభలో ఈ విషయం తెలిపారు. . 5 కేజీల సిలిండర్లు 34 దాటితేమాత్రం ఒక్కో దానికి రూ.351 చెల్లించి(ఢిల్లీలో ధర) కొనుగోలు చేయాల్సి ఉంటుంది.