మైనారిటీల సంక్షేమానికి ప్రాధాన్యత
► మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి
► సబ్సిడీ గొర్రెల పంపిణీ
► మొక్కలు నాటాలని పిలుపు
తమ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రుద్రూర్లో మంగళవారం టీఆర్ఎస్ మైనారిటీ సెల్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. కోటగిరి మండలం పోతంగల్ గ్రామంలో మంగళవారం 15 మంది లబ్ధిదారులకు సబ్సిడీ గొర్రెలను పంపిణీ చేశారు.ఈ ఏడాది జిల్లాలో 9,600 యూనిట్లను పంపిణి చేస్తామని పేర్కొన్నారు.
వర్ని(బాన్సువాడ): మైనారిటీల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రుద్రూర్లో మంగళవారం టీఆర్ఎస్ మైనారిటీ సెల్ మండల కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మైనారిటీ సంక్షేమానికి, అభివృద్ధి కోసం బడ్జెట్లో ప్రభుత్వం రూ. 1250 కోట్లు కేటాయించిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మైనారిటీ బాల బాలికల కోసం 206 మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించామని తెలిపారు.
షాదీముబారక్ పథకం ద్వారా మూడేళ్లలో 70 వేల మంది లబ్ధిపొందారని పేర్కొన్నారు. రుద్రూర్లో త్వరలోనే వ్యవసాయ, ట్రాన్స్‌కో ఏడీఏ కార్యాలయాలను ఏర్పాటవుతాయని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, మైనారిటీ సెల్ మండల కన్వీనర్ సయ్యద్ ముల్తానీ, ఏఎంసీ చైర్మన్ నరోజి గంగారాం, వైస్ ఎంపీపీ సంజీవరెడ్డి, విండో చైర్మన్ పత్తిరాము, ఎంపీటీసీ సభ్యురాలు తోట విజయలక్ష్మి, ఏఎంసీ డైరెక్టర్ అహ్మద్ హుస్సేన్, నాయకులు కోడె శంకర్, బొట్టె గజేందర్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి
రుద్రూర్ చెరువు కట్టపై మంగళవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో మంత్రి పోచారం ఈత మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్, ఉపాధిహామీ, అటవీశాఖ సిబ్బంది, గౌడ సంఘం అధ్యక్షుడు సత్యాగౌడ్, సభ్యులు పాల్గొన్నారు.
గొల్ల, కుర్మలు అ«ర్థికంగా బలపడాలి టీఆర్ఎస్ ప్రభుత్వం అ«ందిస్తున్న గొర్రెల పంపిణీ పథకాన్ని సద్వినియోగం చేసుకుని గొల్ల, కుర్మ, యాదవులు అర్థికంగా అభివృద్ధి చెందాలని మంత్రి పోచారం సూచించారు. కోటగిరి మండలం పోతంగల్ గ్రామంలో మంగళవారం 15 మంది లబ్ధిదారులకు సబ్సిడీ గొర్రెలను పంపిణీ చేశారు.
పోతంగల్ గ్రామంలో రూ.38లక్షలతో నిర్మించే సీసీ రోడ్డుకు, రూ.15లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ డ్ర యిన్స్‌కు శంకుస్థాపన చేశారు. 67 మందికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి మా ట్లాడుతూ రాష్ట్రంలో 7లక్షల 17వేల మంది గొల్ల, కు ర్మలు గొర్రెలు కోసం నమోదు చేసుకున్నారని, వీరి లో ఈ ఏడాది సగం మందికి, వచ్చే ఏడాది మరో స గం మందికి 75 శాతం సబ్సిడీపై గొర్రెలను అందజేస్తామన్నారు. ఈ ఏడాది జిల్లాలో 9,600 యూని ట్లను పంపిణి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం కోటగిరి మండలం పోతంగల్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో జిల్లా పశసంవర్థక శాఖ అధికారి ఎల్లన్న, ఎంపీపీ సులోచన, జెడ్పీటీసీ శంకర్, సర్పంచ్ గంగామణి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎజాజ్ ఖాన్, మండల వెటర్నరి వైద్యాధికారి కిరణ్ దేశ్‌పాండే పాల్గొన్నారు.