sucide letter
-
సూసైడ్ నోట్‌తో లోకేశ్ కట్టుకథ బట్టబయలు
సాక్షి, కర్నూలు: టీడీపీ అసత్య ప్రచారాలు రోజురోజుకు అడ్డు అదుపులేకుండా పోతుంది. తాజాగా నారా లోకేశ్ తన తండ్రి చంద్రబాబును మించిపోయాడు. అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేయడంలో బాగా ముదిరిపోయాడు. లేనిది ఉన్నట్లు సృష్టించడంలో ఆరితేరిపోయాడు. ప్రభుత్వంపై బురుదజల్లేందుకు కుట్రలు, కుయూక్తులు పన్నుతున్నాడు. ఆఖరికి శవ రాజకీయాలు చేయడంలో కూడా వెనకాడంలేదు. ఎప్పుడో ఆరు నెలల క్రితం మరణించిన వ్యక్తి ఇప్పుడు మృతి చెందింనట్లు సృష్టించినట్లు కొత్త నాటకానికి తెరతీశాడు. అంతేకాదు ఏకంగా మృతిని తమ్ముడే తనకు లేఖరాశాడని డ్రామాను రక్తికంట్టించే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్ అయ్యాడు. ఇలా ఒకటా రెండా చెప్పుకుంటుపోతే చాలానే ఉన్నాయి. పోలీసులు రంగంలోకి దిగిడంతో అసలు విషయం బయటపడింది. తనకేమి తెలియదని టీడీపీ నేతలు వచ్చి సంతకం చేయమంటే చేశానని స్వయాన మృతుడి తమ్ముడే చెప్పడంతో పచ్చనేతల బండారం బట్టబయలైంది. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా గూడురు మండలం చునుగొండ్లలో గోపాల్ అనే యువకుడు ఆరు నెలల క్రితం ఆత్మ హత్య చేసుకున్నాడు. దానిని ఇప్పడు బయటకు తీసి టీడీపీ నేతలు యువకుడి మృతిపై కట్టుకథ అల్లారు. డ్రామా బాగా రక్తి కట్టించాలని ప్రయత్నించి బొక్కబోర్లపడ్డారు. చనిపోయిన వ్యక్తి పేరు మీద లేఖ రాయించి ఉద్యోగం లేకే చనిపోయాడని కట్టుకథ అల్లేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు పచ్చనేతలు. ఈ డ్రామాకు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం నారా లేకేశ్‌దే అని తెలుస్తోంది. ఇక్కడ నకిలీ సూసైడ్ లేటర్ తయారైందో లేదో.. అక్కడే ట్వీటర్లో లోకేశ్‌బాబు తప్పుడు కూతలు మొదలైనాయి. ఉద్యోగం రాక గోపాల్ చనిపోయాడంటూ పచ్చ కలర్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఈలోగా రంగంలోకి దిగిన పోలీసులు గోపాల్ అసలు సూసైడ్ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. తన చావుకు ఎవరు బాధ్యులు కాదని గోపాల్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. మృతుని తమ్ముడు శ్రీనివాసులు చదువుకోలేదు. కేవలం సంతకం మాత్రమే చేయగలడు. లోకేశ్ నుంచి డబ్బులు ఇప్పిస్తామని ఆశపెట్టిన స్థానిక టీడీపీ నేతలు శ్రీనివాసులతో ఓ లెటర్‌పై సంతకం తీసుకున్నారు. దాని అధారంగా డ్రామాకు తెరలేపారు. ఇంకేముంది ఉద్యోగం రాక గోపాల్ మరణించాడాని వరుస ట్వీట్లతో రెచ్చిపోయాడు లోకేశ్. పోలీసులు అసలు విషయం బటయపెట్టడంతో జరిగిన వ్యవహారం మొత్తం చెప్పేశాడు గోపాల్ సోదరుడు శ్రీనివాసులు. -
అదృశ్యమై.. హీరో ఫాంహౌస్‌లో అస్థిపంజరంలా తేలాడు
అన్నంటే అతడికి ప్రాణం.. ఒకరినొకరు విడిచి క్షణమైనా ఉండే వారు కాదు.. రక్తం పంచుకొని పుట్టిన అన్న అనారోగ్యానికి గురై మృతిచెందాడు.. అన్న లేని జీవితం వ్యర్థమని.. తాను కూడా ఇక తనువు చాలిస్తానంటూ లేఖ రాసి పెట్టిన ఓ యువకుడు.. నాలుగేళ్ల కిందట ఇంట్లో నుంచి వెళ్లిపోయి.. బుధవారం అస్థి పంజరమై కనిపించాడు. ఈ సంఘటన కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలో చోటుచేసుకుంది. సాక్షి, కేశంపేట (షాద్‌నగర్): నాలుగేళ్ల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయిన వ్యక్తి బుధవారం అస్థిపంజరమై కనిపించాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మండలంలోని పాపిరెడ్డిగూడలో వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్న అంజయ్య, అంజమ్మ దంపతులకు హన్మంత్, రాజు, కుమార్, పాండు నలుగురు కుమారులు. వీరిలో చిన్న కుమారుడు పాండు (32) నాలుగేళ్ల కిందట ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. వీరికి ఫరూఖ్‌నగర్ మండలం వెలిజర్ల గ్రామ శివారులో కొంత వ్యవసాయ పొలం ఉంది. కుమార్, పాండు మధ్య అనుబంధం విడదీయలేనిది. అయితే నాలున్నరేళ్ల కిందట కుమార్‌కు వివాహమైంది. పెళ్లయిన కొద్ది నెలలకే అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో కుటుంబం తట్టుకోలేకపోయింది. ముఖ్యంగా పాండు తన అన్న మృతితో కుంగిపోయాడు. కుమార్ వైద్యం కోసం కుటుంబసభ్యులు ఉన్న భూమిని అమ్మేశాడు. ఆ అప్పును చిన్న కుమారుడు పాండు తరచూ కుటుంబసభ్యులతో చెప్పేవాడు. అయితే అప్పులు ఎంతకీ తీరే మార్గం కనిపించకపోవడంతో తప్పని పరిస్థితుల్లో కుటుంబసభ్యులు తమ భూమిని అమ్మేశారు. ప్రాణంగా ఇష్టపడే అన్న మృతిచెందడం.. ఇటు తనకు ఇష్టమైన వ్యవసాయ భూమిని విక్రయించడాన్ని తట్టుకోలేకపోయిన పాండు తాను చనిపోతున్నానంటూ లేఖ రాసి అదృశ్యమయ్యాడు. అమ్మంటే తనకు చాలా ఇష్టమని.. ఆమెను బాగా చూసుకోవాలని లేఖలో పేర్కొన్నాడు. అన్న కుమార్ పెళ్లి సందర్భంగా తనకు తెచ్చిన దుస్తులు వేసి అంతిమసంస్కారాలు జరిపించాలని లేఖలో కోరాడు. నాలుగేళ్ల క్రితం పాండు రాసిన సూసైడ్ నోట్ నాగార్జున ఫాంహౌస్‌లో అస్థిపంజరం.. నాలుగేళ్ల క్రితం ఇంట్లో నుంచి అదృశ్యమైపోయిన పాండు హీరో నాగార్జున పాపిరెడ్డిగూడ గ్రామ శివారులో కొనుగోలు చేసిన ఫాంహౌస్‌లోని ఓ భవనంలో అస్థిపంజరమై కనిపించాడు. అయితే పాండుకు సంబంధించిన వ్యవసాయం పొలం పక్కనే నాగార్జున ఫాంహౌస్ ఉండడం, దీనికి చివరలో ఓ పాత భవనం ఉండడంతో అక్కడకు ఎవరూ వెళ్లేవారు కాదు. లేఖ రాసి పెట్టిన పాండు నేరుగా ఇక్కడకు వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, చేవెళ్ల ఏసీపీ వెంకట్‌రెడ్డి, సీఐలు రామకృష్ణ, చంద్రబాబు, కేశంపేట ఎస్ఐ వెంకటేశ్వర్లు గురువారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడికి సంబంధించిన వివరాల కోసం ఆరా తీశారు. సంఘటనా స్థలంలో లభించిన ఆధార్‌కార్డులు, ఐడీ కార్డులు, చెప్పులు, ఇయర్ఫోన్లు, ఒక జత దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడు పాపిరెడ్డిగూడకు చెందిన పాండుగా గుర్తించారు. ఇతను కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకొని తాగి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. వీఆర్వో మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
వేధింపులు భరించలేక చనిపోతున్నా
-
వేధింపులు భరించలేక చనిపోతున్నా
సూసైడ్ లేఖలో పేర్కొన్న ఎస్ఐ వీరాంజనేయులు టీడీపీ ఎమ్మెల్యే కళా వెంకటరావు, డీఎస్పీలు వేధించినట్టు వెల్లడి విశాఖపట్నం(గోపాలపట్నం): ఓ ఎస్ఐ చనిపోతూ.. రాసిన లేఖ సంచలనమైంది. శ్రీకాకుళం జిల్లా వంగర పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐగా పనిచేసిన వీరాంజనేయులు విశాఖపట్నంలో మంగళవారం రైలు కింద పడి చనిపోయారు. మృతుని వద్ద ఓ లేఖ రైల్వే పోలీసులకు లభ్యమైంది. ఏసీబీ డీఎస్పీ రంగరాజు, టీడీపీ ఎమ్మెల్యే కళా వెంకటరావు, ఆయన పీఏ నాయుడు వేధింపులు తట్టుకోలేకే చనిపోవాలని నిర్ణయించుకున్నట్టు లేఖలో ఎస్ఐ పేర్కొన్నారు. ‘‘ఆరునెలలుగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాను. తలెత్తుకోలేని పరిస్థితి.. విధి నిర్వహణలో తప్పుచేయలేదు. కానీ అందరూ మోసగాడిలా చూశారు. అందుకే చనిపోవాలని నిర్ణయించుకున్నాను. మరణం వద్దకు వెళ్తున్నా..’’ అని ఆయన రాశారు. కాగా వీరాంజనేయులు మృతదేహాన్ని బుధవారం లక్ష్మీనగర్‌కు తీసుకొచ్చారు. కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. అనంతరం అశ్రునయనాలమధ్య అంతిమ వీడ్కోలు సాగింది. వేధింపుల వల్లే చనిపోయాడు: మృతుని సోదరుని ఆరోపణ ఎమ్మెల్యే కళావెంకటరావు, డీఎస్పీ రంగరాజు వేధింపుల వల్లే వీరాంజనేయులు చనిపోయాడని మృతుని సోదరుడు గంగరాజు ఆరోపించారు. గత ఎన్నికల్లో కళా వెంకటరావు అనుయాయులు పంచుతున్న మొత్తాన్ని వీరాంజనేయులు ఎన్నికల కమిషన్‌కు అందజేశారని, అప్పటినుంచి కక్ష మొదలైందన్నారు.