కేసీఆర్ దీక్షతో తెలంగాణ రాలేదు
చెరుకు సుధాకర్
హైదరాబాద్: నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు పిడికిలి బిగించబట్టే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని, కేవలం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దీక్షతో తెలంగాణ రాలేదని తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్ అన్నారు. 2009 డిసెంబర్ 9న ప్రకటన రాకుంటే 10న తన దీక్షను భగ్నం చేసి ఉండేవారన్నారు. ‘యూ టర్న్ నుంచి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దాక’ అంశంపై శుక్రవారం ఇక్కడ జరిగిన ‘పునశ్ఛరణ’ సభలో సుధాకర్ మాట్లాడారు. వేలాది మంది విద్యార్థులతో జేఏసీని ఏర్పా టు చేసి, ఉద్యమం చేసి సాధించిన రాష్ట్రంలో వారికి హక్కులు లేవని, అట్టడుగు వర్గాలకు గౌరవం లేదని, ఉద్యమకారులకు గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రం వచ్చాక మొదటగా ఉద్యమకారులే నష్టపోయారని అన్నారు.ఇప్పుడు విద్యార్థులు నాయకత్వాన్ని తట్టి లేపాలని పిలుపు నిచ్చారు.అరుణోదయ విమలక్క మాట్లాడు తూ ఉద్యమ సమయం లో ఆత్మహత్యలను కూడా కొంతమంది నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారన్నారు. టీఆర్ఎస్ మేనిఫెస్టో ఓ అబద్థాల పుస్తకమన్నారు. రాష్ట్రంలో మీటింగ్ లు పెట్టుకునేందుకు హాల్ పర్మిషన్లు కూడా ఇవ్వడంలేదన్నారు.
మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ మాట్లాడుతూ ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన వాగ్ధానాలను నేటికీ అమలు చేయలే దన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని చూస్తే త్యాగా లు ఒకరివి, భోగాలు మరొకరివన్న చందం గా ఉందన్నారు. వేదిక ఉపాధ్యక్షులు రియా జ్, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి, గాయకు డు ఏపూరి సోమన్న, అరుణోదయ ప్రధాన కార్యదర్శి బి.మోహన్, టీపీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలమాస కృష్ణ పాల్గన్నారు.