నాల్గవ పట్టణ ఎస్ఐగా సుధాకర్‌యాదవ్
అనంతపురం సెంట్రల్ : నాల్గవ పట్టణ ఎస్ఐగా సుధాకర్ యాదవ్ నియమితులయ్యారు. ఇటీవల జంటహత్యల నేపథ్యంలో విధుల్లో నిర్లక్ష్యం వహించారన్న కారణంతో ఓ సీఐని, ఓ ఎస్ఐని పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఎస్ఐ స్థానంలో వీఆర్‌లో ఉన్న సుధాకర్ యాదవ్‌ను నియమించారు.
శుక్రవారం ఆయన బాధ్యతలు తీసుకున్నారు. అయితే నాల్గవ పట్టణ సీఐగా మాత్రం ఇంతవరకూ ఎవరినీ నియమించలేదు. ప్రస్తుతం ఆత్మకూరు సీఐ శివ నారాయణ పర్యవేక్షిస్తున్నారు. దీంతోlశివ నారాయణకే నాల్గో పట్టణ సీఐగా పూర్తి బాధ్యతలు అప్పగిస్తారా..లేక ఇప్పటికే వీఆర్‌లో ఉన్న నలుగురిలో సీఐలలో ఎవరికో ఒకరికి కేటాయిస్తారో తేలాల్సి ఉంది.