బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
సిద్దిపేట జోన్: మెదక్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం సాధిస్తే కేంద్ర నిధులతో మెదక్ ఎంతో అభివృద్ధి చెందుతుందని రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి స్పష్టం చేశారు. గురువారం స్థానిక శక్తి గార్డెన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి జగ్గారెడ్డిని చూసి టీఆర్ఎస్లో ఓటమి భయం పట్టుకుందన్నారు.
జపాన్ నుంచి ప్రధాని నరేంద్రమోడీ పెద్ద ఎత్తున నిధులు తెచ్చే అవకాశముందన్నారు. దీంతో దేశ జీడీపీ శాతం ఘననీయంగా పెరగనుందన్నారు. వంద రోజుల కేసీఆర్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. రుణ మాఫీపై ప్రభుత్వంలో స్పష్టత లేదన్నారు. పట్టణ రైతులకు, బంగారు రుణాలకు రుణ మాఫీ పథకంలో ప్రభుత్వం కొర్రీలు పెడుతుందోని ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రుణ మాఫీ విషయంలో కేసీఆర్ మాట మార్చాడని ఆరోపించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు రామకృష్ణరెడ్డి, దయాకర్, జైపాల్‌రెడ్డి, భూపాల్‌రెడ్డితో పాటు నాయకులు విద్యాసాగర్, గుండు భూపేష్, సత్యం, దూది శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.