Sudhirreddy
-
కేసీఆర్ మరోసారి సీఎం కావడం ఖాయం
సాక్షి, కీసర: రాష్ట్రంలో టీఆర్ఎస్ 100 పైగా ఎమ్మెల్యే సీట్లు గెలుపొంది సీఎం కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి అన్నారు. బుధవారం కీసరలోని కేబీఆర్‌గార్డెన్‌లో నిర్వహించిన మేడ్చల్ నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నాలుగున్నర ఏళ్ల కాలంగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ను మరో మారు గెలిపిస్తాయన్నారు. తెలంగాణ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ తాను 2012 నుంచి టీఆర్ఎస్లో చురుగ్గా పని చేశానన్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో మేడ్చల్ నుంచి 43 వేల మెజారిటీతో గెలుపొందారని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన కొంగర కలాన్ ప్లీనరీ తరువాత సీఎం కేసీఆర్ స్వయంగా తనకు మేడ్చల్ నుంచి మరో మారు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ మొదటి లిస్టులో తన పేరును కుడా చేర్చారని కొన్ని దుష్టశక్తులు తనకు టికెట్ రాకుండా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 70 రోజులుగా మేడ్చల్ టిక్కెట్ విషయంలో అధిష్టానం నిర్ణయం తీసుకోకపోవడంతో గత మూడు రోజుల క్రితం సీఎం కేసీఆర్ తనను పిఠి లిపించుకొని కొన్ని కారణాలతో ఈ సారి టిక్కెట్ ఇవ్వలేకపోతున్నామని చెప్పారని తెలిపారు. అభ్యర్థి ఎవరైనా గెలిపించుకుంటాం... మేడ్చల్ అభ్యర్థిగా ఎవరు ఎంపికైన వారిని గెలిపించాలని కార్యకర్తలకు సూచించారన్నారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు మేడ్చల్ టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయనున్నట్లు తెలిపారు. పల్లారాజేశ్వర్‌రెడ్డి రెండు రోజుల క్రితం తన ఇంటికి ఎంపీ చామకూరమల్లారెడ్డిని తీసుకొచ్చారని ఎమ్మెల్యే అభ్యర్థిగా మల్లారెడ్డిని అధిష్టానం ప్రకటిస్తే ఆయనను మంచి మెజారిటీతో గెలిపిస్తానని చెప్పానన్నారు. అందుకోసం ఇప్పటి వరకు తన వెంట ఉన్న నేతలు కార్యకర్తలంతా కృషి చేయాలన్నారు. మేడ్చల్ నియోజకవర్గం, మండల, గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో ప్రచారకార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. ఎంపీ చామకూరమల్లారెడ్డి మాట్లాడుతూ.... మలిపెద్దిసుధీర్‌రెడ్డి గొప్ప నాయకుడని ఎంతో త్యాగ గుణమున్న వ్యక్తి అని కొనియాడారు. మలిపెద్దిసుధీర్‌రెడ్డి రాజకీయ అనుభవం తనకూ పార్టీకి ఎంతో అవసరమన్నారు. ఆయన సూచనల మేరకే తాను మందుకెళ్తానని పేర్కొన్నారు. నేతలను, కార్యకర్తలందరిని కలుపుకొని ముందుకెళ్తానన్నారు. ఎమ్మెల్యేగా బరిలో నిలువనున్న తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలను కోరారు. మేడ్చల్ ఇన్చార్జ్ రాష్ట్ర కార్యదర్శి జహంగిర్ మాట్లాడుతూ... మేడ్చల్ అభ్యర్థి గెలుపు బాధ్యత కేసీఆర్ సుధీర్‌రెడ్డిపై ఉంచారని పేర్కొన్నారు. కేసీఆర్ మాట నిలబెట్టెందుకు సుధీర్‌రెడ్డి చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నారని చెప్పారు. సుధీర్‌రెడ్డికి భవిష్యత్‌లో ఎమ్మెల్సీతో పాటు రాష్ట్ర స్థాయి పదవులు ఇచ్చేందుకు కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. కాగా కార్యకర్తల సమావేశంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నందారెడ్డి మాట్లాడుతుండగా కార్యకర్తలు ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారు. సుధీర్‌రెడ్డి నాయకత్వం జిందాబాద్ అని నినాదాలు చేయడంతో సుధీర్‌రెడ్డి కల్పించుకొని కార్యకర్తలను శాంతపరచారు. అనంతరం వివిధ గ్రామాలకు చెందిన కొందరు నేతలు టీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో కీసర, శామీర్‌పేట, ఘట్కేసర్, మేడ్చల్ మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచ్‌లు, మండల పార్టీల అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
అంకితభావం ఆయన సొంతం
వైఎస్సార్ సీపీ యువజన నేతగా ప్రత్యేక గుర్తింపు ఇటీవలి ఎన్నికల్లో ‘పశ్చిమ’ ఎమ్మెల్యేగా పోటీ వరంగల్ : రోడ్డు ప్రమాదం యువ నాయకుడు భీంరెడ్డి సుధీర్‌రెడ్డి ప్రాణాలను బలిగొంది. వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా ప్రత్యేక గుర్తింపు పొందిన సుధీర్‌రెడ్డి ఆకస్మిక మృతి పార్టీ వర్గాలను కలవరపరిచింది. తొలి నుంచి వైఎస్సార్ సీపీకి అంకితభావం ఉన్న నాయకుడిగా ఆయన పేరొందారు. ధర్మసాగర్ మండలం మలక్‌పల్లిలో మధ్యతరగతి రైతు కుటుంబానికి చెందిన భీంరెడ్డి ఎల్లారెడ్డి, అరుణాదేవి దంపతులకు సుధీర్‌రెడ్డి మూడో సంతానం. 1979 ఫిబ్రవరి 9వ తేదీన జన్మించిన ఆయన హన్మకొండలో డిగ్రీ వరకు విద్యనభ్యసించారు. ప్రస్తుతం హన్మకొండలో తల్లితో కలిసి నివసిస్తున్నారు. సుధీర్‌రెడ్డి తండ్రి ఎల్లారెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమాస్తులపై హైకోర్టును ఆశ్రయించారు. ఈ సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. సుధీర్‌రెడ్డి చిన్నతనం నుంచి చురుకైన వాడిగా పేరొందిన ఈయన క్రమంగా వైఎస్.రాజశేఖరరెడ్డి వీరాభిమానిగా, కాంగ్రెస్ పార్టీపై మక్కువ పెంచుకున్నారు. యువజన కాంగ్రెస్ కార్యకర్తగా ఉంటూనే వైఎస్ మరణాంతరం జగన్ యువసేన ఏర్పాటు చేశారు. జగన్ యువసేన జిల్లా కన్వీనర్‌గా జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్‌ను స్థాపించిన మరుక్షణం ఆ పార్టీలో చేరారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జగన్ అందించిన మార్గమే తన మార్గమంటూ తరచూ చెప్పే వారు. రాష్ట్ర విభజన సమయంలో సైతం మొండితనంతో వైఎస్సార్ సీపీకి అండగా నిలిచారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా ఆయన ప్రాచుర్యం పొందారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌పై కేసులు పెట్టి జైలుకు పంపిన సందర్భంలో ఆయన విడుదలయ్యేవరకు ‘బ్లాక్‌షర్ట్’ ధరించి నిరసన తెలియజేస్తానంటూ అదే పద్ధతిని పాటించి తన అభిమానాన్ని చాటుకున్నారు. సీబీఐ అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తోందంటూ ప్రచారం నిర్వహించారు. తర్వాత క్రమంలో పలువురు నాయకులు పార్టీని వీడినప్పటికీ వెనుకంజ వేయకుండా వైఎస్సార్ సీపీలో కొనసాగుతున్నారు. కేసులు పెట్టినా, దాడులు జరిగినా... వెరవకుండా పార్టీకి అంకితభావం గల నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. మొన్నటి సాధారణ ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ పక్షాన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రచారంలో సైతం తనదైన ప్రత్యేకతను సుధీర్‌రెడ్డి కనబరిచేవారు. ఇటీవల మహబూబ్‌నగర్‌లో జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల నిర్వహించిన పరామర్శయాత్రలో జిల్లాలోని మరికొందరు యువకులతో కలిసి పాల్గొన్నారు. ఈ నెల 21వ తేదీన జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను ఆయన స్వయంగా నిర్వహించారు. అంతలోనే ప్రమాదంలో భీంరెడ్డి మృతిచెందడాన్ని పార్టీ శ్రేణులు జీర్నించుకోలేకపోతున్నారుు. పలువురి సంతాపం భీంరెడ్డి సుధీర్‌రెడ్డి ఆకస్మిక మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. చిన్న వయస్సులోనే మృతిచెందడంపట్ల ఆవేదన వ్యక్తం చేశా రు. పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు మునిగాల కళ్యాణ్‌రాజ్, యువజన కాంగ్రెస్ నాయకుడు రాజనాల శ్రీహరి, మిత్రుడు కూనూరు శేఖర్‌గౌడ్, వీసం సురేందర్‌రెడ్డి, వేరుుస్తంభాల ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తదితరులు సంతాపం తెలియజేశారు. సుధీర్ రెడ్డి మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి నేడు అంత్యక్రియలకు రానున్న పొంగులేటి హన్మకొండ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు భీంరెడ్డి సుధీర్‌రెడ్డి ఆకస్మిక మరణంపై వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుధీర్‌రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుధీర్ రెడ్డి మరణ వార్త తెలుసుకున్న వైఎస్సార్ సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బుధవారం అంత్యక్రియలకు వస్తున్నట్లు తెలిపారు. సుధీర్‌రెడ్డి పార్టీలో అంకితభావం గల నాయకుడని, క్రీయాశీల కంగా పనిచేసేవారని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకులు కొండా రాఘవరెడ్డి, శివకుమార్ తదితరులు సుధీర్‌రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బుధవారం వరంగల్‌కు వస్తున్నారు. -
తెలంగాణ అభివృద్ధి బాధ్యత అందరిది
ఘట్కేసర్: అందరూ కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని టీజేఏసీ రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ పేర్కొన్నారు. మండలంలోని కొర్రెములలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన తెలంగాణ విజయోత్సవ సభలో కోదండరామ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకోవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గుప్పెడు మంది ఆంధ్రనాయకులు తెలంగాణ ప్రాంతంలో నీళ్లను, ఉద్యోగాలను, విధులను మనకు కాకుండా చేశారన్నారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై నమోదైన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల కేసులను ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న చెరువులను బాగు చేసుకోవాలన్నారు. తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేసేటట్లు ప్రొత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వ్యవసాయంతోపాటు పాడి పరిశ్రమ, మత్స పరిశ్రమలు అభివృద్ధి చెందాలన్నారు. తెలంగాణలో పెద్ద సంఖ్యలో పరిశ్రమలను ఏర్పాటుచేయాలని, వాటిల్లో స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించాలని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు మెరుగుపడుతానే పేదలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. గతంలో నగరానికి అవసరమైన పాలు రంగారెడ్డి జిల్లా నుంచే వచ్చేవని, ప్రస్తుతం ఎక్కడ చూసినా పాల పాకెట్ల హవా నడుస్తోందన్నారు. ఈ పరిస్థితి మారాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ నిధులు ప్రజల అవసరాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా వినియోగించడానికే ‘మన ఊరు-మన ప్రణాళిక’ తీసుకువచ్చినట్లు చెప్పారు. అంతకుముందు ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమావేశంలో టీజేఏసీ కో కన్వీనర్ మల్లేపల్లి లక్ష్మయ్య, జేఏసీ జిల్లా తూర్పు విభాగపు కన్వీనర్ సంజీవరావు, జెడ్పీటీసీ మంద సంజీవరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ గొంగళ్లస్వామి, మండల ఉపాధ్యక్షుడు గ్యార లక్ష్మయ్య, మండల జేఏసీ కన్వీనర్ మారాం లకా్ష్మరెడ్డి, సర్పంచ్ బైరగాని నాగరాజ్, ఉపసర్పంచ్ నాగార్జున, మాజీ సర్పంచ్‌లు కృష్ణ, కవిత, కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు.