రూ.100 కోట్ల డ్రగ్స్ పట్టివేత
పింప్రి: మహారాష్ట్ర పోలీసులు భారీ మొత్తంలో మత్తు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. పుణే జిల్లా దౌండ్ తాలూకాలోని కుర్కుంభ్ ఎంఐడీసీలో సుజలాం కెమికల్స్ కంపెనీపై ముంబై క్రైం బ్రాంచ్, మత్తు పదార్థాల నిరోధక సిబ్బంది సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు రూ. వంద కోట్ల విలువజేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇందులో మెఫెడ్రన్ అధిక మొత్తంలో ఉందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కంపెనీ యజమాని హరిచంద్ర డోరగే ను గురువారం ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. కంపెనీలో తయారైన మత్తు పదార్థాలను పుణేలో గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తుండటంపై పోలీసులు సైతం నోరెళ్లబెట్టారు.