30న కార్మికులకు సెలవు
శివాజీనగర్ న్యూస్‌లైన్ : ఈనెల 30న జరగనున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దృష్ట్యా జిల్లాలోని దుకాణ సముదాయాలకు, ఫ్యాక్టరీల్లో పనిచ్తేన్న కార్మికులందరికీ ప్రభుత్వం సెలవుదినం ప్రకటిస్తూ జీఓ జారీ చేసిందని కార్మికశాఖ ఉపకమిషనర్ చతుర్వేది గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
వివిధ సంస్థల యజమానులు తమ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ వేతనంలో కూడిన సెలవు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో ఇప్పటికే కార్మికశాఖ అధికారులు దుకాణాలు, సంస్థలు, ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న కార్మికుల చేత ఎన్నికల సంఘం నిర్దేశించిన ఓటర్ల ప్రతిజ్ఞను చదివించారు.
గురువారం నగర శివారులోని సుఖ్జిత్ ఫ్యాక్టరీలో కార్మికుల చేత ఆయన ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సుఖిజిత్ ఫ్యాక్టరీ మేనేజర్ రాజీవ్దువా కార్మికులు నర్సయ్య, కార్మికులు పాల్గొన్నారు.