నేడు ఐజీ సౌమ్య మిశ్రా రాక
ఏర్పాట్లను పర్యవేక్షించిన డీఎస్పీ, ఎమ్మెల్యే
సుల్తానాబాద్: మండలంలోని ఐతరాజుపల్లి మైసమ్మగుట్ట వద్ద మంగళవారం జరిగే హరితహారం బహిరంగసభకు ఐజీ సౌమ్యమిశ్రా హాజరవుతున్నారు. ఈ సభ ఏర్పాట్లను సోమవారం పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, డీఎస్పీ మల్లారెడ్డి పరిశీలించారు. గుట్టను పోలీసులు దత్తత తీసుకుని 50 ఎకరాల విస్తీర్ణంలో పండ్ల మొక్కలను నాటేందుకు గుంతలు తవ్వారు. ఇప్పటికి గుట్ట వద్ద రెండు బోర్‌వెల్స్ ఏర్పాటు చేశారు. వాటర్ ట్యాంకు నిర్మించి, స్ప్రిక్లర్ల ద్వారా మొక్కలకు నీరందించే ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీఐజీ ప్రభాకర్‌రావు, ఎస్పీ జోయల్‌డేవిస్, ఏఎస్పీ అన్నపూర్ణ హాజరుకానున్నారని తెలిపారు. పదిరోజులుగా స్థానిక సీఐ తుల శ్రీనివాస్‌రావు, ఎస్సై ఇంద్రసేనారెడ్డి, సర్పంచ్ లావణ్య, ఎంపీటీసీ భూమేష్ పర్యవేక్షణలో పనులు నిర్వహిస్తున్నారు. సభకు తరలించే సుమారు 6వేల మందికి అవసరమైన ఏర్పాటు చేస్తున్నారు. వీరితో పాటు జూలపల్లి ఎస్ఐ రఫీక్‌ఖాన్, ట్రైనింగ్ ఎస్సై జగన్, వీపీవో వీరస్వామి ఉన్నారు.