suleiman
-
నన్ను వదిలేస్తే రూ.3 కోట్లు ఇస్తా!
సాక్షి, హైదరాబాద్: గోవా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అక్కడి ఓ ల్యాండ్ గ్రాబింగ్ కేసులో సులేమాన్ మహ్మద్ ఖాన్‌ను శుక్రవారం పట్టుకున్నారు..లాకప్‌లో ఉన్న అతగాడు సెంట్రీ విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌కు రూ.3 కోట్ల ఆఫర్ ఇచ్చాడు...అతడి వల్లోపడిన కానిస్టేబుల్ తన ఉద్యోగం పోగొట్టుకోవడంతో పాటు శనివారం అరెస్టు అయ్యాడు. పరారీలో ఉన్న సులేమాన్ కోసం గాలిస్తున్న ప్రత్యేక బృందం ఆదివారం నగరానికి చేరుకుంది. ఇతడికి నగరంతో సంబంధాలు ఉండటంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో మోసాల కేసులు ఉన్నాయి. దీంతో గోవా పోలీసులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గాలిస్తున్నారు. రియల్ ఎస్టేట్ మార్కెట్లో నష్టాలతో... గోవాలోని తివం ప్రాంతానికి చెందిన సులేమాన్ తండ్రి శాండ్ కాంట్రాక్టర్. పదో తరగతితోనే చదువుకు స్వస్థి చెప్పిన ఇతగాడు 1989లో నిర్మాణరంగ కార్మికుడిగా మారాడు. 1992లో మేస్త్రీగా, 1995 నాటికి కాంట్రాక్టర్ వరకు ఎదిగాడు. ఈ రంగంలో భారీగా ఆర్జించి రియల్టర్ అవతారం ఎత్తిన ఇతగాడు గోవా చుట్టు పక్కల ప్రాంతాల్లో భారీగా ప్లాట్లు కొన్నాడు. 2007–2009 వరకు ఏర్పడిన ఆర్థికమాంద్యంతో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలింది. దీని ప్రభానికి తీవ్రంగా నష్టపోయిన సులేమాన్ తన మకాంను పుణేకు మార్చాడు. జీపీఏ రద్దు చేసుకున్నందుకు మహిళ హత్య పుణేలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని భావించిన సులేమాన్ అందుకు అవసరమైన పెట్టుబడి లేకపోవడంతో మోసాలు ప్రారంభించాడు. ఈ నేపథ్యంలోనే ఇతడికి అక్కడి గ్యాంగ్‌స్టర్ గజానన్ మార్నేతో విభేదాలు ఏర్పడ్డాయి. దీనికితోడు ఓ ల్యాండ్ విషయంలో విమల్రావు దేశ్‌ముఖ్ అనే వ్యాపారిని మోసం చేయడంతో కేసు నమోదైంది. దీంతో ఓ పక్క మాఫియా, మరోపక్క పోలీసుల నుంచి సులేమాన్‌కు ఒత్తిడి పెరిగింది. అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నాల్లో పోలీసులకు చిక్కిన ఇతగాడు దాదాపు వంద రోజులు పుణేలోని ఎరవాడ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. జైలు నుంచి బయటకు వచ్చాక మళ్లీ గోవా వెళ్లిన సులేమాన్ రియల్ ఎస్టేట్ దందా మొదలెట్టాడు. 2014లో ఖరీదైన స్థలానికి సంబంధించి 75 ఏళ్ల వృద్ధురాలికి అడ్వాన్స్ ఇచ్చిన సులేమాన్ ఆమెతో జీపీఏ చేసుకున్నాడు. సరైన సమయానికి చెల్లింపులు చేయలేకపోవడంతో ఆమె దీన్ని రద్దు చేసుకుంది. కక్షకట్టిన అతగాడు ఆమెకు విషం ఇంజెక్షన్ ఇచ్చి చంపేశాడు. కందిలో షెల్టర్ ఏర్పాటు చేసుకుని కొన్నాళ్లు... అక్కడ నుంచి 2016లో సంగారెడ్డికి వలస వచ్చిన ఇతగాడు గచ్చిబౌలి, మహబూబ్‌నగర్, విజయవాడ, విశాఖపట్నంలో పలు మోసాలు చేశాడు. కరెన్సీ మార్పిడి, రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో దండుకున్నాడు. 2018 జూలైలో మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్లో బస చేశాడు. ఆన్లైన్ ద్వారా విదేశీ కరెన్సీ మారి్పడి చేసే ఏజెన్సీల వివరాలు తెలుసుకున్నాడు. ఒకరికి ఫోన్ చేసి 30 వేల అమెరికన్ డాలర్లు కావాలని చెప్పాడు. ఆ నెల 10న సదరు వ్యాపారికి గచ్చిబౌలి ఫ్లైఓవర్ వద్దకు రమ్మని చెప్పి, కారులో వెళ్లి ఎక్కించుకున్నాడు. ఓఆర్ఆర్ అప్పా జంక్షన్ వద్దకు తీసుకువెళ్లి, తుపాకీతో బెదిరించి డాలర్లు తీసుకుని పరారయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు ఆ ఏడాది ఆగస్టు 10న సులేమాన్‌ను అరెస్టు చేసి తుపాకీ, తూటాలు, డాలర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బెయిల్ పొందిన తర్వాత అతడు గోవాకే వెళ్లిపోయాడు. కాపలా ఉన్న కానిస్టేబుల్‌కే టోకరా... అక్కడ భూ కబ్జాలు ప్రారంభించిన సులేమాన్‌పై అనేక కేసులు నమోదయ్యాయి. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన అతడి కోసం క్రైమ్ బ్రాంచ్ పోలీసులతో ఓ సిట్ ఏర్పాటు చేశారు. ముమ్మరంగా గాలించి ఎట్టకేలకు గురువారం పట్టుకుని లాకప్‌లో ఉంచారు. అక్కడ కానిస్టేబుల్ అమిత్ నాయక్‌ను కాపలాగా ఉంచారు. అమిత్‌తో మాటలు కలిపిన సులేమాన్..ఈ ఉద్యోగంలో ఏం వస్తుందంటూ అతడిని నమ్మించాడు. తనను వదిలేసి, తనతో పాటు వస్తే బెంగళూరు వెళ్లిన వెంటనే రూ.3 కోట్లు ఇస్తానని నమ్మించాడు. ఇతడి మాటలను నమ్మిన అమిత్ అదే పని చేసి, అతడితో కలిసి హుబ్లీ వరకు వెళ్లాడు. అక్కడ అమిత్ కళ్లుగప్పిన సులేమాన్ పరారయ్యాడు. వీరిద్దరి కోసం గాలించడానికి ఏర్పాటైన ప్రత్యేక బృందాలు శనివారం అమిత్‌ను పట్టుకున్నాయి. సులేమాన్ కోసం వేటాడుతూ ఓ బృందం ఆదివారం హైదరాబాద్ చేరుకుంది. నగరంతో పాటు సంగారెడ్డి, మహబూబ్‌నగర్, విజయవాడ, విశాఖపటా్నల్లోనూ ముమ్మరంగా గాలిస్తోంది. -
Iran explosions: రక్తమోడిన ర్యాలీ
దుబాయ్: అమెరికా డ్రోన్ దాడిలో హతమైన ఇరాన్ అత్యున్నత సైనిక జనరల్ సులేమానీ సంస్మరణ సభలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 188కి పైగా క్షతగాత్రులయ్యారు. గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఇరాన్ ఖండిస్తున్న వేళ ఇరాన్‌పై దాడి ఖడ్గం ఝుళిపించింది ఎవరనేది ఇంకా తెలియరాలేదు. బుధవారం మధ్యాహ్నం మూడింటపుడు కెర్మాన్ నగరంలోని ఖాసిమ్ సులేమానీకి నివాళిగా ఆయన సమాధి దగ్గర నాలుగో సంస్మరణ ర్యాలీ జరుగుతుండగా సాహెబ్ అల్–జమాన్ మసీదు సమీపంలో రోడ్డుపై ఈ పేలుడు ఘటన జరిగింది. దారి పొడవునా వేలాది మంది సులేమానీ మద్దతుదారులతో ర్యాలీ కొనసాగుతుండగా సమాధికి 700 మీటర్లదూరంలో మొదటి పేలుడు సంభవించింది. గాయపడిన వారిని కాపాడేందుకు జనం, ఎమర్జెన్సీ విభాగ సభ్యులు భారీ సంఖ్యలో గుమికూడుతుండగా సమాధికి ఒక కిలోమీటర్ దూరంలో మరో భారీ పేలుడు సంభవించింది. దీంతో మృతుల సంఖ్య పెరిగింది. గాయపడి రక్తమోడుతున్న క్షతగాత్రులను వెంటనే హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారి ఆర్తనాదాలు, చెల్లాచెదురుగా పడిన మృతదేహాలతో ఘటనాస్థలి భీతావహంగా తయారైంది. ఇది ఉగ్రదాడేనని కెర్మాన్ నగర డెప్యూటీ గవర్నర్ రహ్మాన్ చెప్పారు. అయితే దాడికి పాల్పడింది తామేనని ఇంతవరకూ ఎవరూ ప్రకటించుకోలేదు. ఎవరీ సులేమానీ? ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్‌లోని కీలక ఖుర్డ్స్ ఫోర్స్‌కు మేజర్ జనరల్ సులేమానీ నేతృత్వం వహిస్తుండేవారు. ఖుర్డ్స్ఫోర్స్ అనేది విదేశీ సైనిక వ్యవహారాల విభాగం. సైన్యం కోసం ఆయుధాలు, నిధుల సేకరణ, నిఘా, సరకుల రవాణా బాధ్యతలను ఈ దళమే చూసుకుంటుంది. ఇరాన్‌కు మద్దతు పలికే గాజా స్ట్రిప్‌లోని హమాస్ మిలిటెంట్ గ్రూప్‌కు, లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్‌కు, యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులకూ సాయపడుతుంది. దీనిని విదేశీ ఉగ్రవాద సంస్థగా అమెరికా గతంలో ప్రకటించింది. ఎందుకు చంపారు? 2020 జనవరిలో ఇరాక్‌లోని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎంక్యూ9 రీపర్ డ్రోన్ సాయంతో అమెరికా సులేమానీని హతమార్చింది. ‘‘ 1998లో ఖుర్డ్స్ ఫోర్స్‌ను ఏర్పాటుచేసినప్పటి నుంచి ఇరాక్, సిరియాలో లక్షలాది మంది అమాయకుల మరణాలకు సులేమానీ కారకుడు. ప్రపంచ నంబర్‌వన్ ఉగ్రవాది అయినందుకే అతడిని అంతమొందించాం’ అని నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాడి రోజున ప్రకటించారు. దీంతో ఆగ్రహంతో ఇరాన్ అప్పట్లో ప్రతీకార దాడులకు దిగడం తెల్సిందే. ఇరాన్ సైన్యాన్ని పటిష్టవంతం చేయడంలో సులేమానీది కీలక పాత్ర. అందుకే ఇరాన్ వ్యాప్తంగా సులేమానీకి అప్పట్లో విపరీతమైన క్రేజ్ ఉండేది. నేషనల్ ఐకాన్‌గా కీర్తింపబడ్డారు. 2011లో అరబ్ ఉద్యమం తర్వాత సిరియాలో బషర్ అస్సాద్ ప్రభుత్వం కూలిపోకుండా కాపాడారు. కానీ ఈ ఘటనలో సిరియాలో అంతర్యుద్ధం రాజుకుని అది ఇప్పటికీ రగులుతూనే ఉంది. 2018లో ప్రపంచ ఆర్థిక శక్తులు కీలక ఇరాన్ అణు ఒప్పందం నుంచి వైదొలిగాక ఇరాన్ సైనిక నాయకత్వాన్ని బలహీనపరిచేందుకు ట్రంప్ సర్కార్ ఇచి్చన ఆదేశాలతో సులేమానీపై డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో అప్పట్లో సంచలనమైంది. సులేమానీ హత్యేకాదు అంత్యక్రియల ఘటనా వార్తపత్రికల పతాకశీర్షికలకెక్కింది. 2020లో వేలాదిమంది పాల్గొన్న అంత్యక్రియల్లో తొక్కిసలాట జరిగి 56 మంది ప్రాణాలు కోల్పోయారు. 200 మందికిపైగా గాయపడ్డారు. -
25 ఏళ్ల తర్వాత నిందితుడి అరెస్ట్
తిరువొత్తియూరు : 25 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్న నేరస్తుడిని చెన్నై విమానాశ్రయంలో శనివారం పోలీసులు అరెస్టు చేశారు. తంజావూరు జిల్లా అదిరామాపట్టణంకు చెందిన సులైమాన్ (56). ఇరువర్గాల మధ్య ఘర్షణ, దాడి చేసుకున్న సంఘటనకు సంబంధించి ఇతనిని పలు విభాగాల కింద అదిరామం పట్టినం పోలీసులు 1991వ సంవత్సరంలో కేసు నమోదు చేశారు. ఇతని కోసం గాలింపు చేపట్టిన సమయంలో ఇతను అజ్ఞాతంలోకి వెళ్లాడు. విదేశాలకు తప్పించుకుని వెళ్లకుండా అడ్డుకునేందుకు అన్ని విమానాశ్రయాలకు ఇతని ఫొటో ఇచ్చి గాలిస్తున్న నిందితుడిగా తెలిపారు. ఈ క్రమంలో శనివారం ఉదయం 4.30 గంటలకు చెన్నై నుంచి షార్జాకు వెళ్లు గతృ ఎయిర్వేస్ విమానం సిద్ధంగా ఉంది. ఈ విమానంలో ప్రయాణించేందుకు వచ్చిన వారిని తనిఖీ చేస్తుండగా సులేమాన్ వద్ద పాస్‌పోర్టు, వీసాను తనిఖీ చేయగా అతను 25 సంవత్సరాలుగా పోలీసులు వెతుకుతున్న వ్యక్తి అని తెలిసింది. దీంతో అతన్ని అరెస్టు చేసి దీని గురించి తంజావూరు పోలీసులకు సమాచారం అందించారు. తంజావూరు పోలీసులు చెన్నై వచ్చి సులేమాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.