దేవాదాయ శాఖ ఏసీగా సులోచన బాధ్యతలు స్వీకరణ
నల్లగొండ కల్చరల్ : దేవాదాయ శాఖ నల్లగొండ అసిస్టెంట్ కమిషనర్‌గా అన్నెపర్తి సులోచన గురువారం బాధ్యతలు స్వీకరించారు. కనగల్లు మండలం దర్వేశిపురం శ్రీ రేణుకా యల్లమ్మ దేవాలయంలో ఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న సులోచన అసిస్టెంట్ కమిషనర్‌గా పదోన్నతి పొందారు. ఇప్పటివరకు ఇన్చార్జి అసిస్టెంట్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రామచందర్‌రావు కార్యాలయ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టారు.