Sulthan bazar Maternity hospital
-
ఐదు గంటల్లోనే ఆ మహిళను గుర్తించాం!
హైదరాబాద్ : సుల్తాన్ బజార్ ప్రభుత్వాసుపత్రిలో ఈ నెల 2వ తేదీన 12 గంటల సమయంలో శిశువును కిడ్నాప్ చేశారని, ఐదు గంటల్లోనే కిడ్నాప్ చేసిన మహిళను గుర్తించామని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. శిశువు కిడ్నాప్‌నకు సంబంధించి బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. గతంలో ఈ మహిళ రెండు సార్లు ఇలానే చేసిందని తెలిపారు. కిడ్నాప్ జరిగిన విషయం తెలిసిన వెంటనే ఈస్ట్ జోన్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారని వివరించారు. ఈ కిడ్నాప్ కేసును సీసీ కెమెరాల ద్వారా తేలికగా చేధించగలిగామని చెప్పారు. కిడ్నాప్ చేసిన మహిళ శిశువును బీదర్ తీసుకువెళ్లడంతో బీదర్ పోలీసుల సహకారం తీసుకోవాల్సి వచ్చిందని, అలాగే మీడియా సహకారంతో కూడా ఒక రకంగా ఈ కేసును చేధించగలిగామని తెలిపారు. ఐదు గంటల్లో బీదర్‌కి టీం వెళ్లిందని, అక్కడ ఫోటోగ్రఫీ ద్వారా కిడ్నాప్ చేసిన మహిళను గుర్తించామని వివరించారు. అక్కడ ద్విచక్రవాహనంలో కిడ్నాపర్ వెళ్లినట్లు గుర్తించామని చెప్పారు. ఈ సంచలన కేసులో పని చేసిన మా పోలీసు టీంలకు అభినందనలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆసుపత్రి సూపరిండెంట్‌ను కోరామన్నారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఏసీపీ చేతనను అభినందిస్తున్నట్లు చెప్పారు. పాప పేరు చేతనగా నామకరణం చేస్తున్నట్లు శిశువు తల్లి చెప్పిందని వెల్లడించారు. కూతుర్ని తన చెంతకు చేర్చిన పోలీసులందరికీ కూడా ఆమె ధన్యవాదాలు తెలియజేసినట్లు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి బీదర్‌లో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామన్నారు. -
బీదర్‌లో ప్రత్యక్షమైన నవజాత శిశువు!
సాక్షి, హైదరాబాద్: కోఠిలోని సుల్తాన్ బజార్ ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాప్ చేసిన మహిళ, బీదర్‌లోని ప్రభుత్వాసుపత్రిలో శిశువును వదిలి పారిపోయింది. విషయం తెలియడంతో సుల్తాన్ బజార్ ఏసీపీ చేతన పోలీసులతో బీదర్ చేరుకుని పాపను స్వాధీనం చేసుకున్నారు. సుల్తాన్ బజార్ ప్రభుత్వాసుపత్రిలో ఆరు రోజుల పసికందు సోమవారం మధ్యాహ్నం అదృశ్యమైన సంగతి తెలిసిందే. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఎల్లమ్మ తండాకు చెందిన విజయ, ప్రసూతి కోసం గతవారం ఆసుపత్రికి వచ్చారు. ఆమె ఓ ఆడశిశువుకు జన్మనిచ్చారు. ఆమె కదల్లేని స్థితిలో ఆస్పత్రిలో ఉండటంతో.. పక్కనే ఉన్న ఓ గుర్తుతెలియని ఓ మహిళ ఈ విషయం గమనించి.. శిశువుకు టీకా ఇప్పిస్తానంటూ తీసుకెళ్లింది. ఎంతసేపటికీ ఆమె తన బిడ్డను తీసుకురాకపోవడంతో విజయ తల్లిడిల్లిపోయారు. వెంటనే ఆసుపత్రి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది స్థానిక సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా శిశువును అపహరించిన మహిళను గుర్తించేందుకు ప్రయత్నించారు. రెండు రోజులుగా మహిళా కిడ్నాపర్ కోసం మూడు బృందాలు తీవ్రంగా గాలించాయి. ఈ విషయం తెలిసి భయపడిపోయిన మహిళా కిడ్నాపర్, శిశువును బీదర్‌లోని ఆసుపత్రిలో వదిలి వెళ్లడంతో కథ సుఖాంతం అయింది. మహిళా కిడ్నాపర్ కోసం పోలీసులు తీవ్రంగా గాలింపులు చేపడుతున్నారు. సీసీ పుటేజీ ఆధారంగా మహిళను కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.శిశువు దొరకడంతో తల్లి విజయ సంతోషం వ్యక్తం చేసింది. పోలీసులకు ధన్యవాదాలు తెలిపింది. పోలీసులు ఆమెకు శిశువును వీడియో చాట్ ద్వారా చూయించడంతో ఆనందం వ్యక్తం చేసింది. -
ఒకే కాన్పులో ముగ్గురి జననం
సాక్షి, సుల్తాన్‌బజార్: ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మంచిన సంఘటన శనివారం సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శైలజ తెలిపిన వివరాల ప్రకారం... ఇబ్రహీంపట్నం ఉప్పరిపల్లి గ్రామానికి చెందిన శ్రీశైలం భార్య మల్లీశ్వరి నెలలు నిండటంతో శనివారం రెండవ కాన్పు కోసం ప్రసూతీ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ చేయడంతో ఆమెకు ఇద్దరు మగశిశువులు, ఆడశిశువు ఒకే కాన్పులో జన్మించారు. వారు చిన్నపిల్లల విభాగంలోని అసోలేషన్ వార్డులో వైద్యుల పర్యావేక్షణలో ఉన్నారు. -
కాలు విరిగిన శిశువుకు ప్రత్యేక చికిత్స
హైదరాబాద్: ‘కళ్లు తెరవకముందే కాలు విరిచారు’ అనే సాక్షి కథనంపై సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆసుపత్రి ఉన్నతాధికారులు స్పందించారు. లింగస్వామి, లక్ష్మిలకు పుట్టిన శిశువుకు నాణ్యమైన వైద్యం అందించాలని శనివారం సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు. ఉస్మానియా ఆసుపత్రి నుంచి సైతం ఆర్థోపెడిక్ విభాగం వైద్యులు ఆ శిశువుకు చికిత్సలు అందించారు. ఉమ్మనీరు హెచ్చుతగ్గుల వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని సుల్తాన్‌బజార్ ప్రభు త్వ ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ రత్నకుమారి వివరించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దని వైద్యులకు సూచించామని తెలిపారు.