కాలు విరిగిన శిశువుకు ప్రత్యేక చికిత్స | Special treatment for the baby to a broken leg | Sakshi
Sakshi News home page

కాలు విరిగిన శిశువుకు ప్రత్యేక చికిత్స

Feb 21 2016 4:08 AM | Updated on Aug 20 2018 8:20 PM

కాలు విరిగిన శిశువుకు ప్రత్యేక చికిత్స - Sakshi

కాలు విరిగిన శిశువుకు ప్రత్యేక చికిత్స

‘కళ్లు తెరవకముందే కాలు విరిచారు’ అనే సాక్షి కథనంపై సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆసుపత్రి ఉన్నతాధికారులు స్పందించారు.

 హైదరాబాద్: ‘కళ్లు తెరవకముందే కాలు విరిచారు’ అనే సాక్షి కథనంపై సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆసుపత్రి ఉన్నతాధికారులు స్పందించారు. లింగస్వామి, లక్ష్మిలకు పుట్టిన శిశువుకు నాణ్యమైన వైద్యం అందించాలని శనివారం సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు.

ఉస్మానియా ఆసుపత్రి నుంచి సైతం ఆర్థోపెడిక్ విభాగం వైద్యులు ఆ శిశువుకు చికిత్సలు అందించారు. ఉమ్మనీరు హెచ్చుతగ్గుల వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయని సుల్తాన్‌బజార్ ప్రభు త్వ ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ రత్నకుమారి వివరించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దని వైద్యులకు సూచించామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement