SUM hospital
-
ఒడిశా ప్రమాద ఘటనలో నలుగురి అరెస్ట్
భువనేశ్వర్: భువనేశ్వర్‌లోని ఎస్యూఎం ఆస్పత్రిలో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి సూపరింటెండెంట్ సహా నలుగురిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మరో నలుగురిని ఘటనకు బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేసినట్లు ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. బాధితుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం అందిస్తామని యాజమాన్యం తెలిపింది. ప్రమాదంలో ఇప్పటిదాకా 22మంది చనిపోయినట్లు తెలిసింది. పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఒడిశా ముఖ్యమంత్రి న వీన్ పట్నాయక్, కేంద్ర మంత్రి ధ ర్మేంద్ర ప్రధాన్ తదితరులు పరామర్శించారు. -
ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 22 మంది మృతి
భువనేశ్వర్: ఒడిశాలో సోమవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భువనేశ్వర్‌లోని ఎస్యూఎమ్ ఆసుపత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటనలో 22 మంది మృతి చెందారు. డయాలసిస్ వార్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలంటుకోవడంతో అక్కడ చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులతో పాటు పలువురు సిబ్బంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని స్థానికంగా గల క్యాపిటల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎస్యూఎమ్ ఆసుపత్రికి పట్టణంలో ప్రముఖ ఆసుపత్రిగా పేరుంది.