27న విజయవాడ డీడీ కేంద్రం ప్రారంభం
తొలిరోజు నుంచే 24 గంటల ప్రసారాలు
విజయవాడ బ్యూరో: విజయవాడలో దూరదర్శన్(డీడీ) కేంద్రాన్ని ఈ నెల 27న ప్రారంభించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న కేంద్రంనుంచే రెండు రాష్ట్రాలకు ప్రసారాలు సాగుతున్నాయి. విభజన అనంతరం ఏపీకి ప్రత్యేకంగా డీడీ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో విజయవాడలో ఏర్పాటు చేస్తున్న కేంద్రాన్ని 27న సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, ప్రకాశ్ జవదేకర్ ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని వెంకయ్య స్వయంగా వెల్లడించారు. విజయవాడ డీడీ కేంద్రానికి డిప్యూటీ డెరైక్టర్‌గా మల్లాది శైలజా సుమన్‌ను నియమించారు.
ఆమె సోమవారమే బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం నగరంలోని టీటీడీ కళ్యాణ మండపం సమీపంలో ఉన్న డీడీ స్టూడియోను పూర్తిస్థాయి కేంద్రంగా మార్చనున్నారు. విజయవాడ డీడీని ప్రారంభించిన తొలిరోజు నుంచే 24 గంటలపాటు ప్రసారాలు సాగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.