Sumba Islands
-
ఆ దీవిలో జరిగేవన్నీ దాదాపుగా రాక్షస వివాహాలే.. ఎందుకంటే!
రాక్షస వివాహం.. రుక్మిణిని కృష్ణుడు పెళ్లి చేసుకున్న తీరుకు ఉదాహరణగా చెప్తారు. ఈ కథలో రుక్మిణి కూడా కృష్ణుడిని ఇష్టపడింది.. ఆమె అనుమతితోనే ఆ పెళ్లి జరిగింది. ఇండోనేషియాలోని సుంబా దీవిలో జరిగేవన్నీ దాదాపుగా రాక్షస వివాహాలే. అమ్మాయిల ఇష్టంతో జరుగుతున్నవి కావు. అబ్బాయిలు బలవంతంగా మనువాడుతున్నవి. ఈ దురాచారం అక్కడ ‘కవిన్ టాంగాప్’ అనే పేరుతో కొనసాగుతున్నది. నచ్చిన అమ్మాయిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటాడు అబ్బాయి. అవసరమైతే తన బంధుగణంతో అమ్మాయి ఇంటి మీదకు దండయాత్రకూ వెళ్తాడు. కిడ్నాప్ తర్వాత పెళ్లి నుంచి తప్పించుకున్న అమ్మాయిలు చాలా అరుదు. ఒకవేళ తప్పించుకున్నా ఆ అమ్మాయికి సమాజంలో గౌరవం ఉండదు. పెళ్లి చేసుకోవడానికి, పిల్లలు కనడానికి వారు తగరని వెలివేస్తారు. అవమానకరంగా చూస్తారు. ఆ భయంతో అక్కడి ఆడపిల్లలు కిడ్నాప్ చేసినవారినే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతారు. అలాంటి యువతుల్లో 28 ఏళ్ల సిట్రా ఒకరు. కానీ ఆమె కిడ్నాప్ నుంచి తప్పించుకుంది. ఎలా? సుంబాలో ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతోంది సిట్రా. ఒకరోజు ఆమెను తన తండ్రి తరపు దూరపు బంధువులే కిడ్నాప్ చేశారు. ఏదో సమావేశం ఉంది హాజరు కావాలని నమ్మించి, బలవంతంగా కారు ఎక్కించారు. కారు వరుడు ఇంటి ముందు ఆగగానే పెద్దగా గంటలు మోగించి, మంత్రాలు చదువుతూ సిట్రాను ఇంట్లోకి లాక్కెళ్లారు. ఈ విషయాన్ని అతి కష్టం మీద తన తల్లిదండ్రులకు, సన్నిహితులకు మెసేజ్ చేసింది సిట్రా. ప్రేమతోనే కిడ్నాప్ చేశామని ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశారు. అయినా సిట్రా లొంగలేదు. 6 రోజులు బందీగానే ఉంది. ఆచారం ప్రకారం ఆ ఇంట్లో వాళ్లు పెట్టింది తింటే పెళ్లికి సిద్ధమైనట్లే. అందుకే సిట్రా 6 రోజుల పాటు వాళ్లు పెట్టింది ఏదీ తినలేదు. దొంగచాటుగా నీళ్లు, ఆహారం తీసుకుని తనని తాను రక్షించుకుంది. మొత్తానికి మహిళా సంఘాలు కలుగజేసుకుని.. పలు చర్చలు జరిపి ఆమెను విడిపించారు. తర్వాత తను ఇష్టపడిన అబ్బాయినే పెళ్లి చేసుకుంది సిట్రా. ఇలా ఇప్పటి వరకూ సిట్రా సహా ముగ్గురు మాత్రమే తప్పించుకోగలిగారు. సుంబా ప్రజల ఆచార వ్యవహారాలు కొన్నిసార్లు ఈ ‘కవిన్ టాంగాప్’ పెద్దలు కుదుర్చిన పెళ్లిగానూ మారిపోతుందట. గత జూన్లో కూడా ఇలాంటి కిడ్నాప్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. కఠిన చర్యలు లేకపోవడమే ఈ దురాచారానికి కారణమని.. మహిళా సంఘాలు దుమ్మెత్తిపోశాయి. దాంతో ఈ ఆచారాన్ని నిషేధించే పనిలో పడింది అక్కడి ప్రభుత్వం. వింత నమ్మకం సుంబా ప్రజల ఇతర ఆచారాలూ, నమ్మకాలూ చాలా విచిత్రంగా ఉంటాయి. వీరు ‘మరపు’ అనే ప్రాచీనమతాన్ని కూడా ఆచరిస్తారు. వస్తువులకు ప్రాణం ఉందని నమ్ముతారు. నీళ్లు నుదుటిని తాకితే ఇంట్లోంచి బయటికి వెళ్లకూడదనేది వీరి విశ్వాసం. అందుకే కిడ్నాప్ అయిన అమ్మాయిని ఇంట్లోకి లాక్కెళ్లి తలకు నీళ్లు తాకిస్తారు. చదవండి: Mystery: న్యోస్ సరస్సు.. రాత్రి రాత్రే ఆ ఊళ్లన్నీ శ్మశానాలైపోయాయి! -
ఇండోనేసియాను మరోసారి వణికించిన భూకంపం
జకర్తా: ఇండోనేసియాపై మరోసారి ప్రకృతి కన్నెర చేసింది. ఇటీవల సులవేసి ద్వీపంలో సంభవించిన భూకంపం, సునామీ ధాటికి మరభూమిని తలపిస్తున్న ఇండోనేసియాకు మరో షాక్ తగిలింది. మంగళవారం ఉదయం సుంబా దీవిలో 15 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించడంతో ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. తొలుత రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ తర్వాత 15 నిమిషాల్లోపే మరోసారి రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో భూమి కంపించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. సులవేసి దక్షిణాన 1600 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుంబా దీవిలో 7.5 లక్షల మంది జనాభా ఉన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు శుక్రవారం సులవేసి ద్వీపాన్ని అతలాకుతలం చేసిన సునామీ మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే అధికారంగా 832 మంది చనిపోయినట్టు ప్రకటించినప్పటికీ అనధికారిక సమాచారం ప్రకారం ఈ సంఖ్య దాదాపు 1200కు చెరినట్టుగా తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్న రెడ్ క్రాస్ సిబ్బంది సిగి జిల్లాలో ఓ కూలిన చర్చి భవనం కింద 34 మంది విద్యార్థుల మృతదేహాలను కనుగొన్నారు. ఆ చర్చి ట్రెనింగ్ సెంటర్లో విపత్తు సంభవించిన సమయంలో మొత్తం 86 మంది విద్యార్థులు బైబిల్ చదువుతున్నారని భావిస్తున్నారు. దీంతో గల్లంతైన 52 మంది విద్యార్థుల కోసం సిబ్బంది ముమ్మరంగా గాలింపు చేపట్టారు. -
వర్ణం: పంటకోసం యుద్ధం
ఇండోనేషియాలోని సూంబా దీవుల్లో వెయ్యేళ్లుగా జరుగుతున్న వేడుక ఇది! ఏటా జరిగే పసోలా పండగలో భాగంగా అక్కడి తెగప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి, గుర్రాల్ని పరుగెత్తిస్తూ, వెదురు కర్రల్ని పరస్పరం విసురుకుంటూ ఉత్తుత్తి పోరాటం చేస్తారు. చూసేవాళ్లు తమలపాకులు నములుతూ ఎర్రగా పండిన నోళ్లతో యుద్ధవీరుల్ని ఉత్సాహపరుస్తారు. ఇలా చేస్తే వరి బాగా పండుతుందని వారి విశ్వాసం! ఎవరు స్పార్టకస్? ఈ పోటీని ‘స్పార్టకస్ సర్వైవల్ రన్’ అని పిలుస్తారు. చిత్రమైన పదిరకాల హర్డిల్స్ దాటుకుంటూ, పది కిలోమీటర్ల దూరం పరుగెత్తుకుంటూ పోవాలి. ఇదికాదుగానీ, ఇదే స్పార్టకస్ పేరుతో ‘స్పార్టథ్లాన్’ పోటీలు కూడా జరుగుతుంటాయి. లక్ష్య దూరం 246 కిలోమీటర్లు! నమ్మశక్యంగా లేదా? క్రీ.పూ. 490 నాటి సంగతి! తమమీదకు పర్షియన్లు దండెత్తి వస్తున్నారని గ్రీకులకు తెలిసిందట. దాంతో సైన్య సహకారం కోరుతూ స్టార్టాకు ఫీడిప్పైడ్స్ అనే వార్తాహరుణ్ని పంపారు. అతడు ఒకటిన్నర రోజులో 246 కిలోమీటర్ల దూరం పరుగెత్తాడట! చరిత్రగా లిఖించివున్న ఈ సంఘటనలోని నిజానిజాల్ని పరిశీలించేందుకు 1983 లో ఒక బృందం ప్రయత్నించింది. అది దాదాపుగా సఫలం కావడంతో, అలాంటి పోటీలు ప్రారంభమైనాయి. గ్రీసుకే చెందిన యానిస్ కోరస్ అనే అల్ట్రామారథాన్ రన్నర్ ఈ దూరాన్ని 20 గంటల 25 నిమిషాల్లో పరుగెత్తడం ఇప్పటికీ వరల్డ్ రికార్డ్! ఓ మై డాగ్! రోజూ తినే ఇంటిభోజనానికి భిన్నంగా మనుషులు వారాంతాల్లో ఏ రెస్టారెంటుకో వెళ్తారు. మరి ఆధునిక జీవితంలో మనుషులతో సమానంగా ఆదరణను ఆశిస్తున్న శునకాల సంగతి! వాటికోసమే చెకొస్లొవేకియాలో ‘పెస్టారెస్’ మొదలైంది. పెస్టా అంటే అక్కడి భాషలో కుక్క! పెంపుడుకుక్కల్ని ఇలా సరదాగా బయటికి తెచ్చి, వాటికి నచ్చినవి తినబెట్టి, వాటితో మా మంచి యజమాని అనిపించుకోవచ్చు!