ఆగస్టు 21న అమెరికాలో సూర్యుడు మాయం
ఆగస్టు 21వ తేదీన అమెరికా అంతటా, మిట్ట మధ్యాహ్నం ఎవరో మింగేసినట్లుగా సూర్యుడు మాయం కానున్నాడు. పోర్ట్లాండ్ నుంచి ఓరెగాన్ మీదుగా, దక్షిణ కరోలినాలోని చార్లెస్టన్ వరకు లైట్లు స్విచాఫ్ చేసినట్లుగా సూర్యుడు మాయమవుతాడు. ఉత్తర అమెరికా నుంచి కూడా సూర్యుడు పాక్షికంగానే కనిపిస్తాడు. దీన్ని గ్రేట్ అమెరికన్ సోలార్ ఎక్లిప్స్ అని వ్యవహరిస్తారు.
99 సంవత్సరాల క్రితం, 1918, జూన్ 8వ తేదీన వాషింగ్టన్ నుంచి ఫ్లోరిడా వరకు సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది. దాదాపు గంటన్నర పాటు ఉండే ఈ సూర్యగ్రహణాన్ని చూడాలంటే.. నాష్విల్లీలోని కాన్సాస్ సిటీ, సెయింట్ లూయీ నగరాలైతే బెస్ట్ అట. అక్కడి నుంచి ఈ గ్రహణం బాగా కనిపించే అవకాశం ఉంది. అరుదుగా సంభవించే ఈ సూర్యగ్రహణాన్ని చూసి ఆనందించేందుకు ఈ నగరాల్లో హోటల్ గదులను అమెరికన్లు ఇప్పటినుంచే బుక్ చేసుకుంటున్నారు.