sundhar pichai
-
10000 కోట్లతో సుందర్ పిచ్చాయి ఇల్లు.. దాని ప్రత్యేకతలు ఇవే
-
కొత్త డిజిటల్ నిబంధనలపై స్పందించిన సుందర్ పిచాయ్
న్యూఢిల్లీ: మే 25 నుంచి ప్రభుత్వ కొత్త డిజీటల్ నిబంధనలు అమల్లోకి రావడంతో కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ నిర్దేశించిన మార్గదర్శకాలపై టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పందించారు. ‘‘మేం కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రతి దేశంలో అక్కడి స్థానిక చట్టాలను, ప్రభుత్వ అభ్యర్థనలను తమ సంస్థ గౌరవిస్తుందని. ఇది మా సంస్థ పారదర్శకత నివేదికలలో కూడా హైలైట్ చేయబడింది. స్వేచ్ఛాయుత ఇంటర్నెట్ భారత్‌లో సుదీర్ఘంగా ఉన్న సంప్రదాయం. ఒక కంపెనీగా ఆ స్వేచ్ఛాయుత ఇంటర్నెట్ విలువలు, వాటి ప్రయోజనాల గురించి మాకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఏ నియంత్రణ సంస్థలతోనైనా మేం కలిసి పనిచేయడానికి సిద్దం’’ అని సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. అన్నీ దేశాలలోని శాసన, న్యాయపరమైన ప్రక్రియల విధానాలపై మాకు గౌరవం ఉంది. ప్రభుత్వాలు కూడా రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌లను పరిశీలించి, అవలంబించాలని మేము ఆశిస్తున్నాము అని అంది. కాపీరైట్ ఆదేశాలకు, సమాచార నియంత్రణకు సంబందించి యూరప్ లేదా భారతదేశం తాము ఒకవిధంగా చూస్తాము అని పిచాయ్ అన్నారు. భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అనేక ప్రధాన సోషల్ మీడియా సంస్థలలో ఒకటైన ట్విట్టర్ కొత్త మార్గదర్శకాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో సుందర్ పిచాయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఫేస్ బుక్ యాజమాన్యంలోని వాట్సాప్ ఈ కొత్త నిబందనలను ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొత్త ఐటీ నిబంధనలు భావ ప్రకటనా స్వేచ్ఛ, గోప్యతా హక్కులను ఉల్లఘించినట్లు తన పిటిషన్ లో పేర్కొంది. ఫేస్బుక్ స్వయంగా ఈ హక్కులను పాటిస్తుందని తెలిపింది. అయితే కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ దాన్ని పరిష్కరించుకోవాలనుకుంటుంది అని పేర్కొంది. ఇదిలా ఉంటే, ట్విటర్ గురువారం మార్గదర్శకాలను పాటించటానికి ప్రయత్నిస్తుందని తెలిపింది. వాక్ స్వాతంత్య్రం, గోప్యతను పరిరక్షించడంలో నిబద్ధతను వ్యక్తం చేస్తూ ట్విట్టర్ ప్రతినిధి వెల్లడించారు. ఈ నిబంధనలలోని కొన్ని నిబంధనలను సవరించాలని కోరడానికి ట్విటర్ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని యోచిస్తోంది. చదవండి: గుడ్ న్యూస్: అలా అయితే టోల్ గేట్ చార్జీలు కట్టక్కర్లేదు! -
గూగుల్ సీఈఓపై యూపీలో కేసు
వారణాసి: గూగుల్ సీఈఓ సుందర్ పిచయ్‌పై యూపీలో కేసు నమోదు చేశారు. గతవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కించపరిచేలా ఉన్న ఒక వీడియోను యూట్యూబ్‌లో ఒకరు పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఐదు లక్షల మందికి పైగా వీక్షించారు. వాట్సాప్ గ్రూపులో విస్తృతంగా వైరల్ అవుతున్న ఈ వీడియోపై వారణాసికి చెందిన ఒక వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేయగా ఆయనకు 8,500కు పైగా బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. దీంతో ఆయన భెలుపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్లో సుందర్ పిచాయ్, ముగ్గురు గూగుల్ ఇండియా అధికారులతో పాటు మరో 17 మందిపై ఫిబ్రవరి 6న ఉత్తర ప్రదేశ్ లోని భెలూపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కానీ, తర్వాత టెక్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచయ్‌తో పాటు భారత్‌లోని ముగ్గురు గూగుల్ ఉద్యోగుల పేర్లను పోలీసు అధికారులు ఈ కేసు నుంచి తొలగించారు. ఈ వీడియోకు వారికి ఎలాంటి సంబంధం లేదని తెలియడంతో వారి పేర్లను తొలగించినట్లు పోలీసులు తెలిపారు. ఎఫ్ఐఆర్లో గాజీపూర్ జిల్లాకు చెందిన సంగీతకారులు, వీడియో సాంగ్ రూపొందించిన రికార్డింగ్ స్టూడియో, స్థానిక మ్యూజిక్ కంపెనీతో ఇతరుల పేర్లు ఉన్నాయి. చదవండి: "వికీలీక్స్" వీరుడి కోసం వేట మొదలైంది! ఆర్బీఐ లోపాలే.. లోన్ యాప్‌లకు లాభాలు! -
సుందర్ పిచాయ్ క్షమాపణలు
కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో ప్రఖ్యాతి గాంచిన గూగుల్ ఉద్యోగి టిమ్నిట్ గెబ్రూ నిష్క్రమణతో ఆ సంస్థలో పెద్ద దుమారమే రేగింది. తాజాగా గత వారం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు ఆకస్మికంగా కంపెనీ నుండి బయటికి వెళ్లడంతో కంపెనీలో అనేక "సందేహాలకు దారితీసింది" అని గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ చెప్పడంతో పాటు సంస్థకి క్షమాపణలు చెప్పారు. శాస్త్రవేత్త టిమ్నిట్ గెబ్రూ నిష్క్రమణకు దారితీసిన పరిస్థితుల గురించి టెక్ కంపెనీ గూగుల్ సమీక్షిస్తుందని పిచాయ్ చెప్పారు. కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో ప్రఖ్యాతి గాంచిన గెబ్రూ గత వారం ఆమెను తొలగించారని చెప్పారు. గూగుల్ దీనిని రాజీనామాగా పేర్కొంది. "కృత్రిత మేధ(ఏఐ) రంగంలో ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ నల్లజాతి మహిళా గెబ్రూ గూగుల్‌ను వదిలిపెట్టినందుకు తమ రాజీనామాని అంగీకరిస్తున్నాము" అని సుందర్ పిచాయ్ చెప్పారు. (చదవండి: ‘వ్యాక్సిన్ల’ పై బ్రెజిల్ గుణపాఠం) గూగుల్ కృత్రిమ మేధ(ఏఐ)తో సామాజిక ప్రమాదాలను పరిశీలిస్తున్న ఓ పరిశోధన పత్రం విషయంలో సంస్థ మేనేజ్మెంట్కు.. ఆమెకు మధ్య తీవ్ర విబేధాలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఏఐలో రూపుదిద్దుకొంటున్న ఓ కొత్త విభాగం సామాజిక సమస్యలకు దారితీసే అవకాశం ఉందని గెబ్రూ లేవనెత్తడమే వివాదానికి కారణమైనట్లు సమాచారం. ఈ విషయంలో తనను సంస్థ తొలగించిందని గెబ్రూ ప్రకటించగా. గూగుల్ మాత్రం ఆమె రాజీనామా చేసినట్లు పేర్కొంది. దింతో ఈ వివాదం బయటకి వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో గెబ్రూకు సంస్థ ఉద్యోగుల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. ఇప్పటికే దాదాపు 1200 మంది ఉద్యోగులు ఆమెకు మద్దతుగా బహిరంగ లేఖ రాశారు. గెబ్రూ తొలగింపు అనూహ్య నిర్ణయమని పేర్కొన్నారు. సంస్థ జాతివివక్ష, రక్షణాత్మక ధోరణితో వ్యవహరిస్తోందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. -
మీ స్మార్ట్ ఫోన్ కెమెరానే ఇక సెర్చ్ ఇంజిన్
-
మీ స్మార్ట్ ఫోన్ కెమెరానే ఇక సెర్చ్ ఇంజిన్
టెక్ దిగ్గజం గూగుల్ డెవలపర్ల వార్షిక ఐ/ఓ కాన్ఫరెన్స్... ఈ కాన్ఫరెన్స్ అంటేనే టెక్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ సారి ఎలాంటి కొత్తకొత్త ప్రొడక్ట్ లు గూగుల్ మార్కెట్లోకి తీసుకొస్తుంది అని ఆసక్తి చూపుతుంటారు. మౌంటెన్ వ్యూలో నిన్ననే అంటే మే 17వ తేదీన గూగుల్ తన ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించింది. టెక్ అభిమానుల ఆసక్తి మేరకు గూగుల్ నిజంగానే సరికొత్త ఫీచర్లను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. ఆండ్రాయిడ్ గో, కొత్త వీఆర్ హెడ్ సెట్, గూగుల్ లెన్స్ ఇలాంటి కొన్ని కీలకమైన వాటిని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ డెవలపర్ల సమావేశంలో ప్రకటించారు. వీటన్నంటిల్లో టెక్ అభిమానులను ఎక్కువగా ఆకట్టుకున్నది గూగుల్ లెన్స్. దీన్ని టెక్నాలజీలో మరో విప్లవంగా అభివర్ణించిన సుందర్ పిచాయ్, అసలు గూగుల్ లెన్స్ యూజర్లకు ఎలా ఉపయోగపడుతుందో వివరించారు. ఇన్ని రోజులు మనం రోడ్డుపై వెళ్లేటప్పుడు దేనినైనా చూస్తే, దాని గురించి తెలుసుకోవాలంటే, ఆ పేరును టైప్ చేసి సెర్చ్ చేసేవాళ్లం. కానీ ఇప్పుడు అలాంటి అవసరమే ఉండదు. మీకు సమాచారం కావాల్సిన వస్తువును ఫోటో తీసి ఇమేజ్ సెర్చ్ చేస్తే చాలు. దాన్ని గురించి పూర్తి సమాచారం మన ముందుంటుంది. దీనికల్లా మనం చేయాల్సింది మన స్మార్ట్ ఫోన్లో గూగుల్ లెన్స్ డౌన్ లోడ్ చేసుకోవడమే. ఉదాహరణకు మనకో ఫ్లవర్ కనిపించింది అనుకుంటే. ఆ ఫ్లవర్ ఏంటి? దాని వివరాలు కావాలంటే? ఆ పువ్వును లెన్స్ లో ఫోటో తీస్తే చాలు మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అలాగే మనకు తెలియని ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడి లాంగ్వేజ్ మనకు అర్థం కాకపోవచ్చు. ఏదైనా రెస్టారెంట్ కు వెళ్లి తిన్నాలన్నా, ఆర్డర్ చేయాలన్నా జంకుతాం. దీనికోసం జస్ట్ మీముందున్న డిష్ ను ఫోటో తీసి ఇమేజ్ సెర్చ్ చేస్తే చాలు దాని గురించి వివిధ రకాల సమాచారాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇలా ఇమేజ్ సెర్చ్ తోనే అన్నింటి వివరాలను యూజర్లు తెలుసుకునేలా గూగుల్ ఈ ఆప్షన్ ను ప్రవేశపెట్టింది. అయితే మనం స్కాన్ చేసే వస్తువు వివరాలు గూగుల్ లో ఉంటేనే, దాన్ని సమాచారం మనం పొందుతామట. గూగుల్ లెన్స్ పేరుతో తీసుకొచ్చిన ఈ వినూత్న ఫీచర్ త్వరలోనే స్మార్ట్ ఫోన్లలోకి అందుబాటులోకి వస్తుందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు.