sunk
-
ముంబైని వీడని వర్షాలు
ముంబై సెంట్రల్: ముంబైలో సోమవారం కూడా భారీ వర్షాలు కురిశాయి. దీంతో మరోసారి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిరంతరం కురుస్తున్న వర్షాల కారణంగా పలు చోట్ల నీరు నిలిచిపోవడమే కాకుండా, రోడ్డు రవాణతోపాటు రైళ్ల రాకపోకలపై ప్రభావం పడింది. నగరంలోని లోత ట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరు చొరబడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. హింద్మాతా, పరేల్, బైకుల్లా ప్రాంతాలు పూర్తిగా జలమయం కాగా, పలు ప్రాంతాల్లో నీరు నిలిచి ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. బాండూప్ వాటర్ ఫిల్టర్ ప్లాంట్‌లో వాన నీరు చొచ్చుకు రావడంతో ముంబై లో పలు ప్రాంతాల్లో సోమవారం నీటి సరఫరా నిలిచిపోయింది. యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తి చేసి రాత్రి వరకు నీటి సరఫరా మళ్లీ పునరుద్దరించినప్పటికీ నల్లాల్లో మురికినీరు రావడంతో, తాగు నీటిని బాగా మరిగించి తాగాలని ఆరోగ్య శాఖ సూచనలు జారీ చేసింది. మరో రెండు రోజుల పాటు మురికినీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. భీవండీలో కుంభవృష్టి.. : నిరంతరం కురుస్తున్న కుంభవృష్టి వల్ల భీవండీ నగరం లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈద్గాహ్, ఖాడీపార్, కారీవలి, ప్రధాన మార్కెట్ ప్రాంతం, తీన్ బత్తీ, బాజీ మార్కెట్ ప్రాంతాలలో మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తున నీరు నిలిచిపోయింది. షాపులు, నివాస స్థలాల్లోకి వరద నీ రు దూసుకొని వచ్చింది. పలు ప్రాంతాల్లో అధికారులు జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో 5 రోజుల పాటు భారీవర్ష సూచన.. ముంబైలో రాబోయే మరో 5 రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముంబై, కొంకణ్ ప్రాంతంలో, మధ్య మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతోపాటు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మరాఠ్వాడా, విదర్భలోని పలు ప్రాంతాల్లో యెల్లో అలెర్ట్‌ను ప్రకటించింది. రానున్న 48 గంటల్లో ముంబై, పరిసర నగరాల్లో కుంభవృష్టి కురిసే ప్రమాదం ఉందని, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాందివలిలో భారీ వర్షాలతో ఘటన సాక్షి ముంబై: కాందివలిలోని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పార్కింగ్‌లో సుమారు 400కుపైగా వాహనాలు నీట మునిగాయి. కాందివలిలోని ఠాకూర్ కాంప్లెక్స్ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ముంబైలో శనివారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమైన సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఠాకూర్ కాంప్లెక్స్ ప్రాంతంలోని బీఎంసీ పార్కింగులో రోజు మాదిరిగానే అనేక మంది వాహనాలను పార్కింగ్ చేశారు. అయితే భారీ వర్షాల కారణంగా పార్కింగులో పెద్ద ఎత్తున నీరు చొరబడింది. దీంతో అక్కడ పార్కింగ్ చేసిన సుమారు 400కుపైగా వాహనాలు నీట మునిగాయి. -
లాభాల్లో మునిగిన స్టాక్ మార్కెట్లు
-
స్నేహితురాలిని కాపాడబోయి యువతి మృతి
పోలవరం: గోదావరిలో ప్రమాదవశాత్తు పడి మునిగిపోతున్న స్నేహితురాలిని కాపాడబోయి ఓ యువతి మరణించింది. కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామానికి చెందిన ర్యాలి సాయిరమ్య(18) గూటాల పంచాయతీ కొత్తపట్టిసీమ గ్రామం వద్ద ఆదివారం గోదావరిలో మునిగిపోయి మరణించింది. కొవ్వూరులోని ఏబీఎన్పీఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న రమ్య స్నేహితులతో కలసి కొత్తపట్టిసీమలోని మరో స్నేహితురాలైన వలవల శ్రీవల్లి ఇంటికి శనివారం సాయంత్రం వచ్చింది. పోలవరం ప్రాజెక్టు చూడాలని రాత్రి వారంతా అక్కడే ఉన్నారు. ఆదివారం ఉదయం స్నేహితులైన శ్రీవల్లి, ఊనగట్లకు చెందిన గూడపాటి సాయిభవాని, కొవ్వూరుకు చెందిన ప్రత్యూషలతో కలిసి గోదావరినదికి స్నానానికి వెళ్లింది. నది ఒడ్డున నిలబడి సెల్ఫీలు తీసుకుంటుండగా, సాయిభవాని తలపై నీళ్లు చల్లుకునేందుకు నదిలోకి వంగింది. ఆమె నిలబడిన రాళ్లు నాచుపట్టి ఉండటంతో నదిలోకి జారిపడింది. ఆమెను కాపాడేందుకు సాయిరమ్య ప్రయత్నించగా, ఇద్దరూ నదిలో మునిగిపోయారు. కేకలు వేయటంతో దగ్గరలో ఉన్న యువకులు వచ్చి సాయిభవానీని కాపాడారు. ఈమె పోలవరం వైద్యశాలలో చికిత్స పొందుతూ కోలుకుంది. సాయిరమ్య మృతి చెందింది. పోలవరం ఎస్సై కె.శ్రీహరిరావు స్బిబందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. దొమ్మేరులో విషాదఛాయలు కొవ్వూరులో విషాదఛాయలు సాయిరమ్య మృతితో ఆమె స్వగ్రామం దొమ్మేరులో విషాదఛాయలు అలముకున్నాయి. ర్యాలి శ్రీనివాసరావు ప్రథమ కుమార్తె ఆమె. అపురూపంగా చూసుకునే రమ్య మృతితో కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతంగా ఉంది. సర్పంచ్ ముదునూరి జ్ఞానేశ్వరి, వైఎస్సార్సీపీ నాయకుడు ముదునూరి నాగరాజు సాయిరమ్య కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎంతో భవిష్యత్తు ఉన్న సాయిరమ్య మృతి ఆ కుటుంబానికి తీరని లోటని నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రాణాలు...నీటిపాలు..
-
నాగార్జునసాగర్ పడవ ప్రమాదం: ప్రయాణికులు సురక్షితం
గుంటూరు: నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో జరిగిన పడవ ప్రమాద ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. వారంతా ఒడ్డుకు చేరుకునే క్రమంలో పడవ రాయిని ఢీకొట్టింది. దీంతో పడవ బోల్తా పడింది. దాంతో తోటి ప్రయాణికులు వెంటనే స్పందించి నదిలో పడ్డ ప్రయాణికులను కాపాడి ఒడ్డుకు చేర్చారు. అయితే అప్పటికే పలువురు ఆరు పడవల్లో ఒడ్డుకు చేరుకున్నారు. శుక్రవారం ఏకాదశి సందర్భంగా పాలం స్వామి ఆలయానికి భక్తులంతా పడవలో బయలుదేరారు. వెల్దుర్తి మండలం శిరిగిరిపాడు మెట్టమీద పల్లికి చెందిన సుమారు 40 మంది భక్తులు ఈ బోటుల్లో ఉన్నట్లు సమాచారం. -
నాగార్జునసాగర్‌లో బోటు మునక..భక్తుల గల్లంతు
-
మళ్లీ నీట మునిగిన చెన్నై
-
అమ్మా నీళ్లల్లో మునిగిపోతున్నా..
తిరుపతిక్రైం: అమ్మా... నీళ్లల్లో మునిగిపోతున్నాను... ఊపిరి ఆడడం లేదు... ఎక్కడున్నావమ్మా... త్వరగా వచ్చి కాపాడు అంటూ ఆర్తనాదాలు చేస్తూ నీటిలో మునిగి తల్లికి శవమై కన్పించాడో కొడుకు. దీంతో ఆ తల్లి వేదనకు అంతే లేకుండా పోయింది. ఆమె రోదనలు చుట్టపక్కల వారి హృదయాలను కలచి వేసింది. కొర్లగుంటలోని నవోదయ కాలనీలో భాను తన కుమారుడు సురేష్(6)తో కలసి నివాసం ఉం టోంది. భర్తకు దూరంగా ఉండడంతో కుమారుడిని తానే పెంచుకుంటోంది. బుధవారం కురిసిన భారీ వర్షానికి వారి ఇంటి వెనకాలే ఉన్న కపిలతీర్థం నుంచి వచ్చే 10 అడుగుల పెద్ద కాలువ నిండిపోయింది. వేగంతో వస్తున్న నీటిలో నుంచి కొన్ని బంతులు కాలువలో కొట్టుకొని వస్తున్నాయి. దీన్ని గమనించిన బాలుడు సురేష్ బంతి కోసం కాలువులోకి దిగాడు. నీటి ప్రవాహం అధికంగా రావడంతో బంతి కోసం వంగిన వెంటనే బాలుడు కొట్టుకెళ్లిపోయాడు. దీంతో అ క్కడున్న వారు చుట్టుపక్కలవారికి సమాచారం ఇచ్చారు. బాలుడి కో సం సుమారు 2 గంటల పాటు వెతికారు. కొర్లగుంట లోపల ఉన్న వెంకటరవి కాలనీ చెరువులో బాలుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి, బయటకు తీశారు. దీన్ని చూసిన తల్లి బోరున విలపించింది.