
అమ్మా నీళ్లల్లో మునిగిపోతున్నా..
తిరుపతిక్రైం: అమ్మా... నీళ్లల్లో మునిగిపోతున్నాను... ఊపిరి ఆడడం లేదు... ఎక్కడున్నావమ్మా... త్వరగా వచ్చి కాపాడు అంటూ ఆర్తనాదాలు చేస్తూ నీటిలో మునిగి తల్లికి శవమై కన్పించాడో కొడుకు. దీంతో ఆ తల్లి వేదనకు అంతే లేకుండా పోయింది. ఆమె రోదనలు చుట్టపక్కల వారి హృదయాలను కలచి వేసింది. కొర్లగుంటలోని నవోదయ కాలనీలో భాను తన కుమారుడు సురేష్(6)తో కలసి నివాసం ఉం టోంది. భర్తకు దూరంగా ఉండడంతో కుమారుడిని తానే పెంచుకుంటోంది. బుధవారం కురిసిన భారీ వర్షానికి వారి ఇంటి వెనకాలే ఉన్న కపిలతీర్థం నుంచి వచ్చే 10 అడుగుల పెద్ద కాలువ నిండిపోయింది. వేగంతో వస్తున్న నీటిలో నుంచి కొన్ని బంతులు కాలువలో కొట్టుకొని వస్తున్నాయి. దీన్ని గమనించిన బాలుడు సురేష్ బంతి కోసం కాలువులోకి దిగాడు.
నీటి ప్రవాహం అధికంగా రావడంతో బంతి కోసం వంగిన వెంటనే బాలుడు కొట్టుకెళ్లిపోయాడు. దీంతో అ క్కడున్న వారు చుట్టుపక్కలవారికి సమాచారం ఇచ్చారు. బాలుడి కో సం సుమారు 2 గంటల పాటు వెతికారు. కొర్లగుంట లోపల ఉన్న వెంకటరవి కాలనీ చెరువులో బాలుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి, బయటకు తీశారు. దీన్ని చూసిన తల్లి బోరున విలపించింది.