Sunny day
-
తెలంగాణలో మండుతున్న ఎండలు
-
మండే ఎండలు..సూర్యుడు బాగా బాగా
-
మండే ఎండలకు బండి పైలం.. నిర్లక్ష్యం అస్సలు వద్దు! ఈ జాగ్రత్తలు మీకోసమే..
విశాఖపట్నం: భానుడు నిప్పులు కక్కుతున్నాడు. సూర్యుడి ప్రతాపానికి జనం బెంబేలెత్తుతున్నారు. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఇక మిట్ట మధ్యాహ్నం వేళయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఎండలో కాలు పెడితే చాలు ఒంట్లోని సత్తువంతా ఆవిరైపోతోంది. ఎండల తీవ్రత నుంచి ఉపశమనం కోసం మనం ఎలా జాగ్రత్తలు పాటిస్తామో.. వాహనాలను కూడా అలానే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వాహనాలు ఎండలో గంటల సమయం ఉంచడం వల్ల రంగు వెలిసిపోతాయని, పెట్రోల్ ఆవిరయ్యే అవకాశం ఉంటుందని రవాణా రంగ నిపుణులు చెబుతున్నారు. వాహనాలకు ట్యాంక్ నిండా పెట్రోల్ పట్టిస్తే ఒక్కో సారి పేలే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. చదవండి👉🏾బుజ్జి పిట్ట.. బుల్లి పిట్ట.. పక్షి ప్రేమికుల విలక్షణ ఆలోచన పెద్ద వాహనాలకు ఇలా.. ► కార్లు, లారీలు ఇతర భారీ వాహనాల విషయంలో రేడియేటర్లలో నీళ్లను తరచూ తనిఖీ చేసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే ఇంజిన్ ఫ్రీజ్ అయ్యే ప్రమాదం ఉంది. ► రేడియేటర్లలో నీళ్లకంటే కూలెంట్ ఆయిల్ వాడడం మంచిది. ► వేడికి ఇంజిన్ ఆయిల్ తగ్గే అవకాశాలు ఉంటాయి. తప్పనిసరిగా ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి. ► పెట్రోల్, డీజిల్‌తో పాటు ఎల్పీజీ గ్యాస్ ద్వారా వాహనాలు నడిపేవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అటువంటి వాహనదారులు వేసవిలో గ్యాస్ కిట్‌ను ఉపయోగించకుండా ఉంటే ఉత్తమం. ► ఏసీ నిలబడాలంటే కారు అద్దాలకు క్లాత్ మ్యాట్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ► ఎండాకాలం పూర్తయ్యే వరకు భారీ వాహనాలకు నూతన టైర్లు వాడితే మేలు. లేదంటే దూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో పాత టైర్లలో గాలి తగ్గిపోయి పేలిపోయే ప్రమాదం ఉంది. చదవండి👉🏻 వారి జీవితాల్లో వెలుగు రేఖలు.. బతుకు చూపిన ‘భారతి’ ద్విచక్ర వాహనాలకు రక్షణ ఇలా.. ► వాహనాలను ఎక్కువ సేపు పార్కింగ్ చేయాల్సి వస్తే.. చెట్టు నీడన గానీ, షెడ్లలో గానీ లేదా కవర్లు కప్పి ఉంచాలి. ► అధిక ఉష్ణోగ్రతల వల్ల టైర్లలో గాలి తగ్గిపోతుంది. తరచూ గాలి తనిఖీ చేయించుకోవడం మంచిది. ► బైక్‌లు ఎక్కువ సమయం ఎండలో ఉంచితే పెట్రోల్ ఆవిరి అయిపోయే అవకాశం ఉంటుంది. ► పెట్రోల్ ట్యాంకుపై మందపాటి కవర్ ఉండేటట్లు చూసుకోవడం వల్ల కొంత మేర పెట్రోల్ ఆవిరి కాకుండా చూడవచ్చు. ► ఎండల వేడికి ఇంజిన్ ఆయిల్ త్వరగా పల్చబడిపోతుంది. నిర్ణీత సమయానికి ఇంజిన్ ఆయిల్ మార్చుకోవడం మంచిది. ► వేసవి కాలంలో పెట్రోల్ ట్యాంకులో గ్యాస్ ఏర్పడే అవకాశం ఉంటుంది. రాత్రి సమయంలో బైక్‌ను పార్క్ చేసేటప్పుడు ఒకసారి ట్యాంక్ మూతను తెరచి మూయాలి. ► గాలి పట్టే విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే టైర్ల మన్నిక తగ్గిపోతుంది. తద్వారా పెట్రోల్ ఎక్కువ ఖర్చయ్యే ప్రమాదం ఉంది. ► వేసవి కాలంలో ద్విచక్ర వాహనాలపై దూర ప్రయాణం చేయడం తగ్గించుకుంటే మేలు. ► దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు వాహనాల వేగానికి, ఉష్ణోగ్రతల వేడికి ఇంజిన్ రెండింతలు వేడెక్కే అవకాశం ఉంటుంది. అందుకోసం కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఇంజిన్ కాసేపు ఆపుకుంటే వాహనం మన్నిక కాలం పెరుగుతుంది. నిర్ణీత గడువులోపు ఇంజిన్ ఆయిల్ చెక్ చేసుకోవాలి. ఫుల్ ట్యాంక్ చేయించకూడదు ఈ ఏడాది ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. బైక్‌లకు ఫుల్ ట్యాంక్ చేయించడం వల్ల పేలిపోయే ప్రమాదం ఉంది. రెండు లీటర్లు పెట్రోల్ వరకు వేయించుకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉండదు. ఒక వేళ బైక్ ఎండలో పెట్టాల్సిన అవసరం ఏర్పడితే ఏదైనా పొడవాటి క్లాత్‌ను ట్యాంక్‌పై కప్పి ఉంచితే సరిపోతుంది. లేదంటే ఎండలకు ఆయిల్ ట్యాంకర్ హీటెక్కి పేలిపోయే ప్రమాదం ఉంది. –అక్బర్, బైక్ మెకానిక్ ఎక్కువ దూరం ప్రయాణించొద్దు ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల బైక్ ఆయిల్ ట్యాంకులు పేలిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పెట్రోల్ వేయించేటప్పుడు సెల్‌ఫోన్ మాట్లాడడం, బైక్‌ను ఎండలో ఉంచడం కారణంగా ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బైక్‌ను మధ్యాహ్నం సమయంలో నీడలో పార్కు చేయాలి. ఎండలో ఎక్కువ దూరం కూడా ప్రయాణించకపోవడం మంచిది. – త్రినాథరావు, మెకానిక్ -
పగలు ఎండ.. రాత్రి చలి
అనంతపురం అగ్రికల్చర్ : విస్తారంగా వర్షాలు కురవాల్సిన సమయంలో నెలకొన్న విపరీత వాతావరణ పరిస్థితులు ఖరీఫ్, రబీ పంటలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం పొంచి ఉంది. అక్టోబర్‌లో సాధారణ వర్షపాతం 110.4 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా 17 రోజుల తర్వాత కూడా కేవలం 7 మిల్లిమీటర్లే నమోదైంది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతోపాటు అల్పపీడనం, వాయుగుండం లాంటి వాటి వల్ల వర్షాలు కురవాల్సిన సమయంలో ఎండలు మండుతున్నాయి. ఈ క్రమంలో వరుణుడు మొహం చాటేయడం వల్ల రబీ సాగు పడకేసింది. పప్పుశనగ, వేరుశనగ, ఇతర రబీ పంటలు సాగు చేసే రైతుల్లో ఆందోళన నెలకొంది. 1.50 లక్షల హెక్టార్లకుగానూ ప్రస్తుతానికి కేవలం 30 వేల హెక్టార్లలో రబీ పంటలు సాగులోకి వచ్చాయి. అలాగే ఖరీఫ్‌లో వేసిన కంది, ఆముదం, పత్తి, పెసర లాంటి పంటల దిగుబడులు అక్టోబర్‌లో కురిసే వానలపై ఆధారపడి ఉంటాయి. పూత దశలో ఉన్న 60 వేల హెక్టార్ల కందికి ఇపుడు వర్షం చాలా అవసరం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి కీలకమైన అక్టోబర్‌లో విచిత్రమైన వాతావరణం నెలకొనడంతో ఖరీఫ్, రబీ పంటలు దారుణంగా దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది. మారిన వాతావరణ గణాంకాలు గత 15 రోజులుగా జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి. ఈ సమయంలో 32 నుంచి 35 డిగ్రీలు నమోదు కావాల్సి ఉండగా ఇపుడు 34 నుంచి 38 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది పగటి ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగాయి. పగలు ఇలా ఉంటే నాలుగైదు రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు చలి పెడుతుండటం విశేషం. గతంలో ఇదే సమయంలో రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుంచి 24 డిగ్రీలు నమోదు కాగా ఇపుడు 18 నుంచి 22 డిగ్రీలు నమోదవుతున్నాయి. అంటే రాత్రిళ్లు కాస్త అటుఇటుగా రెండు డిగ్రీల వరకు తగ్గుదల కనిపిస్తోంది. గాలిలో తేమశాతం కూడా ఇపుడు గణనీయంగా పడిపోయింది. గతంలో ఉదయం పూట 80 నుంచి 88 శాతం ఉండగా ఇపుడు 72 నుంచి 80 శాతం మధ్య నమోదవుతోంది. ఉదయం పూట పెద్దగా తేడా లేకున్నా మండే ఎండల ప్రభావంతో మధ్యాహ్న సమయంలో తేమ శాతం బాగా తగ్గుదల కనిపిస్తోంది. గతంలో మధ్యాహ్నం సమయంలో 48 నుంచి 56 శాతం మధ్య ఉండగా ఇపుడు 25 నుంచి 45 శాతానికి పడిపోయింది. గతేడాది అక్టోబర్‌లో 17వ తేదీ నాటికి 88 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కురవాల్సినదాని కన్నా 80 శాతం ఎక్కువ పడింది. ఈ సారి మాత్రం ఇప్పటివరకు కేవలం 7 మిల్లీమీటర్లతో ఏకంగా 90 శాతం తక్కువ వర్షపాతం నమోదు కావడం విషాదకరం. -
పగలు ఎండ రాత్రి చలి
పోచమ్మమైదాన్ : పగలు ఎండ.. రాత్రి చలిగాలులు జిల్లావాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారుు. ఉదయం ఏడు గంటలకే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఇక.. సాయంత్రం ఏడు గంటలకే చలిగాలులు వీస్తున్నారుు. మొత్తానికి క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నారుు. బుధవారం 37 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ప్రతి సంవత్సరం మార్చి మొదటి వారంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరి చివరి వారంలోనే మా ర్పు కన్పిస్తోంది. ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే ముందుముందు ఎలా ఉంటాయోనని నగర వా సులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో వాహనదారులు మధ్యాహ్నం సమయంలో బయట కు రాకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. మ ద్యాహ్నం రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నారుు. అత్యవసర పని ఉన్న వారు ఫేస్‌కు మాస్క్ లు, తలకు క్యాప్‌లు ధరిస్తున్నారు. ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోం ది. రాత్రి పూట మళ్లీ చలిగాలు తప్పడం లేదు. ఎండలను తట్టుకోలేక శీతలపానీయాలపై ప్రజలు దృష్టి సారించారు. తేదీ కనిష్టం గరిష్టం 24 15.0 36.8 23 16.0 36.5 22 20.0 36.2 21 20.3 36.0 20 20.2 35.8 19 19.5 34.9 -
హస్తినలో రేపు స్వల్ప వర్షపాతం ?
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో శనివారం భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పోలింగ్ ఉండటంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనికి తోడు పలు రాకపోకలకు అంతరాయం కలిగింది. శనివారం రోజున 25.6 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు కనిపించాయి. మామూలు ఉష్ణోగ్రతల కంటే మూడు డిగ్రీల ఎక్కువగా నమోదైంది. ఆదివారం కూడా ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ విభాగం అధికారులు అంటున్నారు. ఉదయం మంచు కురిసే అవకాశాలున్నాయని, మధ్యాహ్నం సమయంలో అక్కడక్కడా చిరుజల్లులు పడతాయని వారు తెలిపారు. శనివారం ఉదయం కూడా మంచు కురిసి 8.30 వరకు సూర్యోదయం కాలేదు. దాదాపు 9 రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. మంచు ప్రభావానికి 600 మీటర్ల దాకా దారి కనిపించని పరిస్థితి.