న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో శనివారం భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పోలింగ్ ఉండటంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనికి తోడు పలు రాకపోకలకు అంతరాయం కలిగింది. శనివారం రోజున 25.6 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు కనిపించాయి. మామూలు ఉష్ణోగ్రతల కంటే మూడు డిగ్రీల ఎక్కువగా నమోదైంది. ఆదివారం కూడా ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ విభాగం అధికారులు అంటున్నారు.
ఉదయం మంచు కురిసే అవకాశాలున్నాయని, మధ్యాహ్నం సమయంలో అక్కడక్కడా చిరుజల్లులు పడతాయని వారు తెలిపారు. శనివారం ఉదయం కూడా మంచు కురిసి 8.30 వరకు సూర్యోదయం కాలేదు. దాదాపు 9 రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. మంచు ప్రభావానికి 600 మీటర్ల దాకా దారి కనిపించని పరిస్థితి.