
సాక్షి, హైదరాబాద్: రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు కాస్త తగ్గనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పలుప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతాయని పేర్కొంది. విదర్భ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.
ఇది సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో శని, ఆదివారాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. శుక్రవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. గరిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 39.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 21.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment