light rain
-
తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు: ఐఎండీ
సాక్షి,హైదరాబాద్: జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతోంది. ఆవర్తనం కారణంగా తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.రాబోయే ఐదు రోజులపాటు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించింది.కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. -
రెండ్రోజులు తేలికపాటి వానలు!
సాక్షి, హైదరాబాద్: విదర్భ నుంచి అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో సోమ, మంగళ వారాల్లో పలు జిల్లాల్లో తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధానంగా అదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉన్నట్లు సూచించింది. పెరగనున్న పగటి ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో గత మూడు రోజులుగా వాతావరణం చల్లబడింది. గతవారం కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీ సెల్సియస్ మేర అధికంగా నమోదయ్యాయి. సీజన్లో నమోదు కావాల్సిన స్థాయి కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదై ముందస్తుగా వేసవి హెచ్చరిక మాదిరిగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం చట్టబడింది. దీంతో పగటి ఉష్ణోగ్రతలు, రాత్రి ఉష్ణోగ్రతలు తిరిగి సాధారణం కంటే కిందకు పడిపోయాయి. వేసవి సీజన్ చివరి దశలో ఇలాంటి వాతావరణ పరిస్థితులే నెలకొంటాయని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండ్రోజులు ఇదే తరహా వాతావరణం ఉన్నప్పటికీ... తర్వాత పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆదివారం రాష్ట్రంలో నమోదైన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 35.8 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత అదిలాబాద్‌లో 15.2 డిగ్రీ సెల్సియస్ చొప్పున నమోదయ్యాయి. -
రాష్ట్రంలో రెండ్రోజులు మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం ఉదయానికి నైరుతి బంగాళాఖాతంలో తుపాను ఏర్పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం శనివారం తీవ్ర వాయగుండంగా మారింది. ఇది గంటకు 18 కి.మీ వేగంతో పశ్చిమ–వాయవ్య దిశగా కదిలి నైరుతి బంగాళా ఖాతంలో కేంద్రీకృతమైంది. పుదుచ్చేరికి తూర్పు–ఆగ్నేయంగా 440 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు–ఆగ్నేయంగా 450 కిలోమీటర్లు, నెల్లూరుకు దక్షిణ–ఆగ్నేయంగా 580 కిలోమీటర్లు, బాపట్లకు దక్షిణ–ఆగ్నేయంగా 670 కిలోమీటర్లు, మచిలీపట్ననికి ఆగ్నేయంగా 670 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా పయనించి, నైరుతి బంగాళాఖాతం వద్ద తుపానుగా మారనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత వాయువ్య దిశగా కదులుతూ 4వ తేదీ తెల్లవారుజాము వరకు దక్షిణ ఆంధ్రప్రదేశ్, దానికి ఆనుకొని ఉన్న ఉత్తర తమిళనాడు సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖతం వరకు చేరుకుంటుందని వివరించింది. ఆ తర్వాత, ఉత్తరం వైపు కదులుతూ దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి దాదాపు సమాంతరంగా కదులుతూ డిసెంబర్ 5వ తేదీ ఉదయానికి నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటు తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తుపాను తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 80నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గంటకు ఈదు రు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వివరించింది. మరింతగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు రాష్ట్రంలోనూ రానున్న రెండ్రోజులు అక్కడక్కడా తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తా యని తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపు లతో కూడిన వానలు కూడా కురిసే అవకాశం ఉన్న ట్లు సూచించింది. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని, 2 డిగ్రీ సెల్సియస్ నుంచి 3 డిగ్రీ సెల్సియస్ మేర గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వివరించింది. శనివారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత హన్మకొండలో 33.5 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 16.0 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. -
ఈశాన్య వర్షాలకు వాయుగుండం బ్రేక్!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల చురుకుదనానికి వాయుగుండం బ్రేకులు వేసింది. మళ్లీ ఇవి చురుకుదనం సంతరించుకోవడానికి మరికొన్ని రోజుల సమయం పట్టనుంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని వాయుగుండం బలపడి మరో మూడు, నాలుగు రోజులు ఉత్తర ఈశాన్య దిశగా బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాల వైపు ప్రయాణించనుంది. ఈ వాయుగుండం గాలిలోని తేమను అటువైపు లాక్కుని పోతుండటంతో ఈశాన్య రుతుపవనాలు మన రాష్ట్రంపై ప్రభావం చూపలేకపోతున్నాయి. ఈ వాయుగుండం తీరాన్ని దాటే వరకు ఇదే పరిస్థితి కొనసాగనుంది. వాయుగుండం బెంగాల్ తీరాన్ని దాటడానికి ఇంకా నాలుగైదు రోజులు పడుతుంది. ఆ తర్వాత మరో రెండు మూడు రోజులకు గాని ఈశాన్య గాలుల్లో తేమ ఏర్పడే పరి స్థితి ఉండదు. అందువల్ల ఈశాన్య రుతుపవనాలు బలం పుంజుకోవడానికి కనీసం వారం రోజులైనా ప డుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నా రు. ఏపీలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవాలంటే అప్పటివరకు వేచి ఉండాల్సిందేనని చెబుతున్నారు. తీరానికి దూరంగా వాయుగుండం సాధారణంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం గాని, వాయుగుండం గాని ఏర్పడితే ఏపీలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. కానీ ప్రస్తుత వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే ఏర్పడినప్పటికీ అది తీరానికి దూరంగా ఉంది. పైగా ఈ వాయుగుండం ఆంధ్ర తీరం వైపు కాకుండా బెంగాల్ వైపు పయనిస్తూ పునరావృతం) చెందుతుంది. ఫలితంగా ఏపీలో వర్షాలు కురవడం లేదని వాతా వరణ నిపుణులు అంటున్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలకు వారమైనా పట్టవచ్చని చెబుతున్నారు. బలపడిన వాయుగుండం.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఆదివారం సాయంత్రానికి తీవ్రవా యుగుండంగా బలపడింది. ఇది ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణంగా 550, పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు దక్షిణంగా 710 కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తీవ్రవాయుగుండం సోమవారం వరకు ఉత్తర దిశగా కదులుతుంది. ఉత్తర ఈశాన్యంగా దిశ మార్చుకుంటూ రీకర్వ్ తీసుకుని బంగ్లాదేశ్ తీరం వైపు పయనిస్తుందని ఐఎండీ తెలిపింది -
తగ్గనున్న గరిష్ట ఉష్ణోగ్రతలు.. నేడు, రేపు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు కాస్త తగ్గనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పలుప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతాయని పేర్కొంది. విదర్భ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో శని, ఆదివారాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. శుక్రవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. గరిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 39.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 21.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. -
అక్కడక్కడ తేలికపాటి వర్షాలు
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కూడా అక్కడక్కడ మోస్తరుగా వర్షం పడింది. బెళుగుప్ప 21 మి.మీ, కళ్యాణదుర్గం 20.6 మి.మీ, ఓడీ చెరువు 17.7 మి.మీ, కనేకల్లు 16.9 మి.మీ, గాండ్లపెంట 14.1 మి.మీ, కంబదూరు 14 మి.మీ, బుక్కపట్నం 12.3 మి.మీ, శెట్టూరు 12.2 మి.మీ, ఎన్పీ కుంట 10.1 మి.మీ వర్షం కురిసింది. మరో 10 మండలాల్లో 5 నుంచి 10 మి.మీ లోపు వర్షపాతం నమోదైంది. మరికొన్ని మండలాల్లో తుంపర్లు పడ్డాయి. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 88.7 మి.మీ కాగా ప్రస్తుతానికి 50.4 మి.మీ నమోదైంది. -
అక్కడక్కడ తేలికపాటి వర్షం
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో బుధవారం అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసింది. బొమ్మనహాల్ 23.6 మి.మీ, ఉరవకొండ 21.6 మి.మీ, పరిగి 20.4 మి.మీ వర్షం పడింది. డి.హిరేహాల్, విడపనకల్, వజ్రకరూరు, గుంతకల్లు, గుత్తి, పెద్దవడుగూరు, శింగనమల, కూడేరు, బెళుగుప్ప, కనేకల్లు, రాయదుర్గం, అమడగూరు, సోమందేపల్లి, లేపాక్షి, హిందూపురం తదితర మండలాల్లో వర్షపాతం నమోదైంది. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 88.7 మి.మీ కాగా ప్రస్తుతానికి 46.1 మి.మీ నమోదైంది. -
ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అకాల వర్షం
సాక్షి న్యూస్‌నెట్‌వర్క్: ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో సోమవారం అకాల వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం సగటున 4 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని సిర్పూర్(యు)లో అత్యధికంగా 60 మిల్లీమీటర్లు, బజార్హత్నూర్లో అత్యల్పంగా 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బెల్లంపల్లి, తాండూరులో వర్షానికి మామిడి కాయలు రాలాయి. సుమారు 10 వేల ఎకరాల్లో నష్టం జరిగిందని అంచనా వేశారు. సిర్పూర్(టి) బెంగాలి క్యాంపులో సుమారు వంద ఎకరాల్లో ఉల్లి, కూరగాయల సాగు దెబ్బతింది. కౌటాలలో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంట తడిసింది. ఆసిఫాబాద్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో కురిసిన వర్షానికి జొన్న పంట తడిసింది. ఉదయం పూట వర్షం కురవడంతో పదో తరగతి పరీక్ష రాయడానికి వెళ్లే విద్యార్థులు ఇబ్బందులుపడ్డారు. కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. మెట్పల్లి మార్కెట్ యూర్డులో రైతులు, అడ్తిదారులు ఆరబోసిన పసుపు తడిసిపోయింది. మండలంలో సుమారు ఎనిమిది వందల ఎకరాల్లో మామిడి పిందెలు రాలిపోయాయి. మండలంలో 16.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, సారంగాపూర్, రాయికల్, కథలాపూర్ మండలాల్లో కురిసిన వర్షానికి ఉడకబెట్టి ఆరబోసిన పసుపు తడిసిపోగా, వరి, నువ్వు పంటలు దెబ్బతిన్నాయి. వందలాది ఎకరాల్లో మామిడి పిందెలు నేలరాలాయి. జగిత్యాల మండలంలో దాదాపు లక్ష క్వింటాళ్ల వరకు ఉడుకబెట్టిన పసుపు తడిసినట్లు సమాచారం. మార్కెట్‌కు తీసుకువచ్చిన మొక్కజొన్న తడవడంతో వ్యాపారులు కొనుగోలు చేయలేదు. -
హస్తినలో రేపు స్వల్ప వర్షపాతం ?
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో శనివారం భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పోలింగ్ ఉండటంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనికి తోడు పలు రాకపోకలకు అంతరాయం కలిగింది. శనివారం రోజున 25.6 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు కనిపించాయి. మామూలు ఉష్ణోగ్రతల కంటే మూడు డిగ్రీల ఎక్కువగా నమోదైంది. ఆదివారం కూడా ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ విభాగం అధికారులు అంటున్నారు. ఉదయం మంచు కురిసే అవకాశాలున్నాయని, మధ్యాహ్నం సమయంలో అక్కడక్కడా చిరుజల్లులు పడతాయని వారు తెలిపారు. శనివారం ఉదయం కూడా మంచు కురిసి 8.30 వరకు సూర్యోదయం కాలేదు. దాదాపు 9 రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. మంచు ప్రభావానికి 600 మీటర్ల దాకా దారి కనిపించని పరిస్థితి.