జిల్లాలో బుధవారం అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసింది. బొమ్మనహాల్ 23.6 మి.మీ, ఉరవకొండ 21.6 మి.మీ, పరిగి 20.4 మి.మీ వర్షం పడింది.
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో బుధవారం అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసింది. బొమ్మనహాల్ 23.6 మి.మీ, ఉరవకొండ 21.6 మి.మీ, పరిగి 20.4 మి.మీ వర్షం పడింది. డి.హిరేహాల్, విడపనకల్, వజ్రకరూరు, గుంతకల్లు, గుత్తి, పెద్దవడుగూరు, శింగనమల, కూడేరు, బెళుగుప్ప, కనేకల్లు, రాయదుర్గం, అమడగూరు, సోమందేపల్లి, లేపాక్షి, హిందూపురం తదితర మండలాల్లో వర్షపాతం నమోదైంది. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 88.7 మి.మీ కాగా ప్రస్తుతానికి 46.1 మి.మీ నమోదైంది.