Sunrises Hyderabad
-
RCB: ఇంకా రేసులోనే ఆర్సీబీ! అలా అయితే ప్లే ఆఫ్స్‌లో!
ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేలవ ప్రదర్శనతో అభిమానులను పూర్తిగా నిరాశపరిచింది. విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, మహ్మద్ సిరాజ్ వంటి టాప్ స్టార్లు జట్టులో ఉన్నా వరుస వైఫల్యాలతో చతికిలపడింది.ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచి రెండు పాయింట్లతో పట్టికలో అట్టడుగున పదో స్థానంలో ఉంది. ఒక రకంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఆర్సీబీ దాదాపుగా నిష్క్రమించినట్లే! అయితే, తిరిగి పుంజుకుంటే మాత్రం పోటీలో నిలిచే అవకాశం ఉంటుంది. అందుకు సాధ్యమయ్యే కొన్ని సమీకరణలు గమనిద్దాం!మరోమాట లేదు.. గెలవాల్సిందేమరోమాట లేకుండా ఆర్సీబీ ఇప్పటి నుంచి ఆడే అన్ని మ్యాచ్‌లలో తప్పనిసరిగా గెలవాలి. నెట్ రన్‌రేటు -1.046 మరీ దారుణంగా ఉంది కాబట్టి కచ్చితంగా భారీ విజయాలు సాధించాలి.అదే జరిగితే.. ఆర్సీబీ ఖాతాలో 12 పాయింట్లు చేరి మొత్తం 14 అవుతాయి. అదే విధంగా.. నెట్ రన్‌రేటు కూడా మెరుగుపరచుకుంటే ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. కాగా ఆర్సీబీకి తదుపరి సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్(రెండుసార్లు), పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇవన్నీ భారీ తేడాతో గెలిచినా ఇతర జట్ల ఫలితాలపై ఆర్సీబీ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.టాప్‌లో ఉన్న ఆ మూడు జట్లు..పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్తాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ తమకు మిగిలిన ఆరు మ్యాచ్‌లలో ఎన్ని గెలిస్తే(తమపై మినహా) ఆర్సీబీకి అంత మంచిది. లక్నో, చెన్నై, ఢిల్లీ, గుజరాత్, ముంబై, పంజాబ్ కింగ్స్ ఈ జట్లు భారీ తేడాతో విజయం సాధించడం ఆర్సీబీకి ముఖ్యం.ఇంకెలా అంటే..►తొమ్మిదో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ తమకు మిగిలిన ఆరు మ్యాచ్‌లలో నాలుగు కంటే ఎక్కువ విజయాలు సాధించకూడదు.►ఢిల్లీ క్యాపిటల్స్ మిగిలిన ఐదింటిలో రెండు కంటే.. ముంబై ఇండియన్స్ ఆరింటిలో మూడు కంటే ఎక్కువ గెలవకూడదు.►చెన్నై మిగిలిన ఆరు మ్యాచ్‌లలో రెండు కంటే.. గుజరాత్ ఐదింటిలో ఒకటి కంటే ఎక్కువ గెలవద్దు.►లక్నో మిగిలిన ఆరు మ్యాచ్‌లలో ఒకటి కంటే ఎక్కువ గెలవకూడదు.►కేకేఆర్, సన్‌రైజర్స్ మిగిలిని ఏడు మ్యాచ్‌లలో ఒకటి కంటే ఎక్కువ విజయాలు సాధిస్తే చాలు!►ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరేందుకు కొన్ని సమీకరణలు మాత్రమే ఇవి. ఇంతా జరిగినా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరుతుందా అంటే? ఏమో గుర్రం ఎగరావచ్చు! లేదంటే గురువారం నాటి సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ఓడి పూర్తిగా నిష్క్రమించనూవచ్చు!!చదవండి: నువ్వు చాలా మంచోడివి ప్యాట్: కోహ్లి కామెంట్స్ వైరల్ -
SRH: ‘బాధితులు’ మరింత అసూయ పడేలా..
(43 X 4) + (38 X 6).. మొత్తం 81.. ఇదేంటి లెక్క తప్పు చెప్తున్నారు అనుకుంటున్నారా? కాదండీ.. ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్‌లో నమోదైన ఫోర్లు, సిక్సర్లూనూ!! చిన్నస్వామి స్టేడియం బౌండరీ చిన్నదే కావొచ్చు.. అయినా.. ఇలా బ్యాట్ తాకించగానే అలా బంతి అవతల పడదు కదా.. ఫోర్స్‌గా కొడితేనే ఫోర్లు, సిక్సర్ల వర్షం కురుస్తుంది. అలా తమ పవర్ హిట్టింగ్తో ప్రేక్షకులకు కనువిందు చేశారు ఇరు జట్ల బ్యాటర్లు. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ జట్టులో అభిషేక్ శర్మ 2, ట్రావిస్ హెడ్ 8, హెన్రిచ్ క్లాసెన్ 7, ఐడెన్ మార్క్రమ్ 2, అబ్దుల్ సమద్ 3 సిక్స్‌లు బాదారు. The art 🎨 of nailing practice to execution for a record breaking total! 🧡 Travis Head 🤝 Heinrich Klaasen#TATAIPL | #RCBvSRH | @SunRisers pic.twitter.com/gA5HcYGwFM — IndianPremierLeague (@IPL) April 16, 2024 ఇలా ఓవరాల్‌గా ఎస్ఆర్హెచ్ ఖాతాలో 22 సిక్సర్లు నమోదు కాగా.. ఐపీఎల్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన జట్టుగా రికార్డులకెక్కింది. మరోవైపు.. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి రెండు, ఫాఫ్ డుప్లెసిస్ 4, దినేశ్ కార్తిక్ 7, మహిపాల్ లామ్రోర్ రెండు సిక్స్‌లు బాదారు. తడిసి ముద్దైన చిన్నస్వామి స్టేడియం మ్యాచ్ ఆద్యంతం ఇలా సిక్సర్ల వర్షంలో చిన్నస్వామి స్టేడియం తడిసి ముద్దవుతుంటే టీ20 ప్రేమికులంతా కేరింతలు కొట్టారు. న భూతో న భవిష్యతి అన్నట్లుగా బ్యాటర్లు హిట్టింగ్ చేస్తుంటే ఇది కదా పొట్టి ఫార్మాట్ మజా అనుకుంటూ మురిసిపోయారు. బ్యాటర్‌ను అయినా బాగుండు ఫలితం ఎలా ఉన్నా మంచినీళ్ల ప్రాయంలా సన్‌రైజర్స్- ఆర్సీబీ బ్యాటర్లు చితక్కొట్టిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. అంతేకాదు.. ఈ మ్యాచ్‌లో బాధితులుగా మిగిలిపోయిన బౌలర్లు కూడా తాము కూడా అప్పటికప్పుడు బ్యాటర్ అయి పోయి ఉంటే బాగుండు అనుకునేంతగా అసూయ పడేలా చేశారు. విజయానంతరం సన్‌రైజర్స్ కెప్టెన్, మూడు వికెట్లు తీసిన పేసర్ ప్యాట్ కమిన్స్ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ‘‘నేను బ్యాటర్‌ను అయినా బాగుండు. సూపర్ మ్యాచ్. అద్భుతమైన దృశ్యాలు. అంతకు మించిన వినోదం. చిన్నస్వామి స్టేడియం పిచ్ ఈరోజు పొడిగా ఉంది. దానిని మేము చక్కగా సద్వినియోగం చేసుకోగలిగాం’’ అని కమిన్స్ సంతోషం వ్యక్తం చేశాడు. ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా సన్‌రైజర్స్ సృష్టించిన అరుదైన రికార్డులు ►ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు- 22 ►టీ20 క్రికెట్లో నేపాల్(314) తర్వాత రెండో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టు(287). ►ఐపీఎల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టు- 287/3. సన్‌రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ స్కోర్లు: ►టాస్: ఆర్సీబీ.. బౌలింగ్ ►సన్‌రైజర్స్ స్కోరు: 287/3 (20) ►ఆర్సీబీ స్కోరు: 262/7 (20) ►ఫలితం: ఆర్సీబీపై 25 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ విజయం చదవండి: #RCBvsSRH: ఏంట్రా ఈ బ్యాటింగ్?.. ఆగ్రహం వెళ్లగక్కిన కోహ్లి.. వీడియో వైరల్ -
హెలికాప్టర్ షాట్ ఇరగదీశాడుగా..!
అఫ్గనిస్తాన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ గురించి క్రికెట్ అభిమానులకు పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. తన బౌలింగ్‌తో ఎంతటి బ్యాట్స్‌మన్‌ను అయినా తికమక పెట్టే రషీద్.. బ్యాటింగ్‌లో కూడా అప్పడప్పుడూ మెరుస్తూ ఉంటాడు. ఆల్ రౌండర్ రషీద్ ఎక్కువగా 6వ స్థానంలో బ్యాటింగ్‌లో దిగినప్పటికీ జట్టుకు విజయాన్ని అందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు రషీద్ ఖాన్‌కు సంబంధించిన అరుదైన వీడియోను ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తున్న రషీద్ ఖాన్ అఫ్గనిస్తాన్ సాంప్రదాయ దుస్తుల్లో కనిపించాడు. View this post on Instagram 🚁🤯 #OrangeArmy #SRH @rashid.khan19 A post shared by SunRisers Hyderabad (@sunrisershyd) on Jul 23, 2020 at 8:31pm PDT అయితే ఇందులో వింతేముంది అనుకుంటున్నారా..?ఇక్కడ స్పెషల్ ఏంటంటే భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఫేవరెట్ షాట్లలో ఒకటైన హెలికాప్టర్ షాట్‌ను రషీద్ ఇరగదీశాడు.. దీంతో ధోని ఫ్యాన్స్ తో పాటు క్రికెట్ అభిమానులు కూడా దీనికి మంత్ర ముగ్ధులయ్యారు. రషీద్‌లో సిన్నర్‌తో పాటు టాలెంటెడ్ బ్యాట్స్‌మన్ కూడా ఉన్నాడంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. రషీద్‌ను ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ పంపాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ 2017 ఐపీఎల్లో సన్ రైజర్స్ తరఫున రషీద్ అరంగేంట్రం చేశాడు. ప్రతీ సీజన్లోనూ తనదైన మార్కును చూపెడుతున్న రషీద్.. ఇప్పటి వరకూ 46 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 6.55 ఎకానమీతో 55 వికెట్లు పడగొట్టాడు. -
రసెల్ దెబ్బకు సన్ డౌన్
విజయానికి చివరి 3 ఓవర్లలో 53 పరుగులు చేయాలి. ఐపీఎల్లో గతంలో ఏ జట్టుకూ సాధ్యం కాని ఘనత ఇది. కానీ ఆండ్రీ రసెల్ పవర్ హిట్టింగ్తో కోల్‌కతా నైట్‌రైడర్స్ అలాంటి లక్ష్యాన్ని అందుకుంది. సిద్ధార్థ్ కౌల్ వేసిన 18వ ఓవర్లో 2 సిక్సర్లు, ఫోర్ బాదిన రసెల్... భువనేశ్వర్ వేసిన 19వ ఓవర్లో మరో 2 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టడంతో రెండు ఓవర్లలో కలిపి 40 పరుగులు వచ్చేశాయి. షకీబ్ వేసిన ఆఖరి ఓవర్లో విజయానికి 13 పరుగులు అవసరం కాగా... ఈ సారి నేనున్నానంటూ శుబ్‌మన్ గిల్ 2 సిక్సర్లతో చెలరేగి 2 బంతుల ముందే ఆట ముగించాడు. తొలి మ్యాచ్‌లో అనూహ్య పరాజయం సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను పలకరించగా ...సొంతగడ్డపై కేకేఆర్ సంబరాల్లో మునిగిపోయింది. కోల్‌కతా: ఐపీఎల్ తొలి రోజు ఆటతో తీవ్ర నిరాశకు గురైన అభిమానులకు రెండో రోజు అసలైన వినోదం లభించింది. కోల్‌కతా, హైదరాబాద్ జట్లు పోటీ పడి పరుగుల వరద పారించాయి. చివరకు ఆండ్రీ రసెల్ మెరుపులు లీగ్‌లో జోష్ తెచ్చాయి. ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (53 బంతుల్లో 85; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) ఐపీఎల్లో 37వ అర్ధసెంచరీతో ఘనంగా పునరాగమనం చేయగా, విజయ్ శంకర్ (24 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), జానీ బెయిర్‌స్టో (35 బంతుల్లో 39; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం కోల్‌కతా 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 183 పరుగులు చేసింది. నితీశ్ రాణా (47 బంతుల్లో 68; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఆండ్రీ రసెల్ (19 బంతుల్లో 49 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగగా, ఉతప్ప (27 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వార్నర్ జోరు... బాల్ ట్యాంపరింగ్‌తో గత ఏడాది లీగ్‌కు దూరమైన వార్నర్ మళ్లీ తన సత్తాను ప్రదర్శించాడు. చావ్లా వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి అతను తన రాకను తెలియజేశాడు. అదే ఓవర్ ఐదో బంతికి కోల్‌కతా ఎల్బీ కోసం అప్పీల్ చేయగా అంపైర్ తిరస్కరించాడు. అయితే రీప్లేలో నాటౌట్ అని స్పష్టంగా తేలడంతో కోల్‌కతా రివ్యూ కోల్పోయింది. ఆ తర్వాత నరైన్ తొలి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన వార్నర్... రసెల్ మొదటి ఓవర్లో వరుస బంతుల్లో 4, 6 బాదాడు. ఈ సిక్సర్‌తో 31 బంతుల్లోనే వార్నర్ అర్ధ సెంచరీ పూర్తయింది. అనంతరం 68 పరుగుల వద్ద వార్నర్ ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ కార్తీక్ వదిలేశాడు. సెంచరీ ఖాయమనుకున్న దశలో ఎట్టకేలకు వార్నర్ ఆటను రసెల్ ముగించాడు. అతని ఓవర్లో భారీ సిక్సర్ కొట్టిన తర్వాత మరో బలమైన షాట్‌కు ప్రయత్నించగా కవర్స్‌లో ఉతప్ప అద్భుత క్యాచ్ పట్టడంతో వార్నర్ ఇన్నింగ్స్ ముగిసింది. బెయిర్‌స్టో మొదటి మ్యాచ్... ఇంగ్లండ్ తరఫున గత కొంత కాలంగా అద్భుత ఫామ్‌లో ఉన్న జానీ బెయిర్‌స్టోకు తొలిసారి ఐపీఎల్లో ఆడే అవకాశం దక్కింది. తొమ్మిదేళ్లలో వేర్వేరు జట్ల తరఫున 99 టి20లు ఆడిన అతనికి ఆదివారం మ్యాచ్ 100వ టి20 కావడం విశేషం. చావ్లా బౌలింగ్‌లో చక్కటి సిక్సర్‌తో తొలి బౌండరీ రాబట్టిన అతను ఆ తర్వాత మరో మూడు ఫోర్లు కొట్టాడు. వార్నర్, బెయిర్‌స్టో కలిసి 77 బంతుల్లో 118 పరుగులు జోడించారు. మరోవైపు భారత జట్టులో వరుస అవకాశాలు లభించిన తర్వాత ఆత్మవిశ్వాసం పెరిగిన విజయ్ శంకర్ ఐపీఎల్లో కూడా దానిని చూపించాడు. నరైన్, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లలో అతను ఒక్కో సిక్సర్ బాదాడు. 27 పరుగుల వద్ద అంపైర్ ఎల్బీగా ప్రకటించినా... రివ్యూలో బతికిపోయిన అతను అదనంగా మరో 13 పరుగులు జోడించగలిగాడు. కీలక భాగస్వామ్యం... భారీ లక్ష్య ఛేదనలో కోల్‌కతా ఆరంభంలోనే క్రిస్ లిన్ (7) వికెట్ కోల్పోయింది. అయితే నితీశ్ రాణా, ఉతప్ప భాగస్వామ్యం ఆ జట్టును రేసులో నిలిపింది. సందీప్ శర్మ ఓవర్లో 2 ఫోర్లు, సిక్సర్ కొట్టి రాణా దూకుడు ప్రదర్శించగా, ఉతప్ప కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 58 బంతుల్లో 80 పరుగులు జోడించారు. కెప్టెన్ దినేశ్ కార్తీక్ (2) విఫలం కాగా, 35 బంతుల్లో రాణా అర్ధ సెంచరీ చేశాడు. లైట్స్ ఆఫ్! ఈడెన్ గార్డెన్స్‌లో ఒక ఫ్లడ్ లైట్ టవర్ పని చేయకపోవడంతో 16వ ఓవర్లో ఆట ఆగిపోయింది. దాదాపు 13 నిమిషాల తర్వాత మళ్లీ మ్యాచ్ మొదలైంది. భువనేశ్వర్ రెండోసారి... సన్‌రైజర్స్ కెప్టెన్ విలియమ్సన్ గాయం నుంచి కోలుకోకపోవడంతో తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. పేసర్ భువనేశ్వర్ కుమార్ అతని స్థానంలో నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. తన కెరీర్లో భువీ కెప్టెన్‌గా వ్యవహరించడం ఇది రెండోసారి మాత్రమే. 2016–17 రంజీ ట్రోఫీలో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో అతను యూపీకి కెప్టెన్‌గా పని చేశాడు. -
తొలి మ్యాచ్‌కు విలియమ్సన్ దూరం!
కోల్‌కతా: సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) కెప్టెన్ కేన్ విలియమ్సన్ తమ జట్టు తొలి మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి. నేడు కోల్‌కతాలో నైట్‌రైడర్స్ జట్టుతో జరుగనున్న మ్యాచ్‌లో విలియమ్సన్ అందుబాటులో ఉండకపోవచ్చని టీమ్ కోచ్ టామ్ మూడీ సందేహం వ్యక్తం చేశారు. భుజం గాయం నుంచి కేన్ పూర్తిగా కోలుకోకపోవడమే దీనికి కారణమన్నారు. మ్యాచ్ సమయం వరకు ఈ అంశంపై స్పష్టత వస్తుందని చెప్పారు. ‘భుజం గాయం నుంచి విలియమ్సన్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అదేం సుదీర్ఘ కాలం పాటు వేధించే గాయం కాదు. ఒకవేళ విలియమ్సన్ ఆడగలిగే స్థితిలో ఉంటే మ్యాచ్ సమయం వరకు తెలుస్తుంది. కొద్దిరోజుల్లోనే సొంత మైదానంలో సన్‌రైజర్స్ ఆడాల్సి ఉంటుంది. విలియమ్సన్ ఆడలేని పక్షంలో జట్టుకు ప్రస్తుతం జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న భువనేశ్వర్ సారథిగా వ్యవహరిస్తాడు’ అని టామ్ మూడీ పేర్కొన్నాడు. బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు ఆడుతోన్న సమయంలో విలియమ్సన్ భుజానికి గాయమైంది. ఈనెల 29న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉప్పల్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో తలపడనుంది. -
హైదరాబాద్‌కు మరో విజయం
-
వార్నర్ విశ్వరూపం
► మెరుపు సెంచరీతో చెలరేగిన సన్‌రైజర్స్ కెప్టెన్ ► హైదరాబాద్‌కు మరో విజయం ► 48 పరుగులతో చిత్తుగా ఓడిన కోల్‌కతా ► రాణించిన సిరాజ్, కౌల్, భువనేశ్వర్ డేవిడ్ వార్నర్ బ్యాట్ మరోసారి గర్జించింది. పవర్ షాట్లు, రివర్స్ స్వీప్‌లు, పుల్ షాట్లు, పంచింగ్ డ్రైవ్‌లు... ఒకటేమిటి ఇలా ప్రతీ అస్త్రాన్ని వాడుతూ అతను వీర విధ్వంసమే సృష్టించాడు. కేవలం 43 బంతుల్లోనే శతకం బాది తన సత్తా ప్రదర్శించడంతో సన్‌రైజర్స్‌కు మరో భారీ విజయం దక్కింది. వార్నర్ సిక్సర్ల సునామీలో కొట్టుకుపోయిన కోల్‌కతా నైట్‌రైడర్స్ సునాయాసంగా తలవంచింది. భారీ స్కోరును ఛేదించలేక ఆ జట్టు బ్యాట్స్‌మెన్ పూర్తిగా చతికిల పడ్డారు. హైదరాబాద్: సొంత మైదానంలో సన్‌రైజర్స్ మరోసారి రెచ్చిపోయింది. ప్రత్యర్థికి ఏ దశలోనూ ఎలాంటి అవకాశం కూడా ఇవ్వకుండా చిత్తు చేసింది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 48 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఘన విజయం సాధించింది. ఈ మైదానంలో ‘సన్’ జట్టుకిది వరుసగా ఐదో విజయం కావడం విశేషం. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (59 బంతుల్లో 126; 10 ఫోర్లు, 8 సిక్సర్లు) సెంచరీ సాధించాడు. ఐపీఎల్లో ఇది ఐదో వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. విలియమ్సన్ (25 బంతుల్లో 40; 5 ఫోర్లు) కూడా రాణించాడు. అనంతరం కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 161 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాబిన్ ఉతప్ప (28 బంతుల్లో 53; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), మనీశ్ పాండే (29 బంతుల్లో 39; 3 ఫోర్లు) మాత్రమే కొద్దిగా పోరాడారు. వార్నర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఆ 43 బంతులు... అద్భుత బ్యాటింగ్‌తో సీజన్ ఆరంభం నుంచి రైజర్స్‌ను ముందుండి నడిపిస్తున్న కెప్టెన్ వార్నర్ ఈసారి మరింతగా రెచ్చిపోయాడు. ఒక్క బౌలర్‌ను కూడా వదిలి పెట్టకుండా విధ్వంసం సృష్టించాడు. మైదానంలో అన్ని వైపులా అతను బాదిన సిక్సర్లు ఆకాశంలో తారాజువ్వల్లా దూసుకుపోయాయి. ఎదుర్కొన్న నాలుగో బంతిని ఫోర్ కొట్టిన వార్నర్ ఆ తర్వాత ఆగలేదు. కొన్ని సార్లు అతడికి అదృష్టం కూడా కలిసొచ్చింది. 13 పరుగుల వద్ద మిడాన్‌లో వోక్స్‌కు క్యాచ్ పట్టే అవకాశం వచ్చినా... తప్పుడు అంచనాతో అతను ఆ అవకాశం చేజార్చాడు. వోక్స్ వేసిన తర్వాతి ఓవర్లో వరుస బంతుల్లో 4, 6 బాదిన వార్నర్, పఠాన్ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా 4, 4, 6 కొట్టాడు. మరో సిక్స్‌తో 25 బంతుల్లోనే అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. కుల్దీప్ వేసిన మరో ఓవర్లో రైజర్స్ కెప్టెన్ పండగ చేసుకుంటూ వరుసగా 4, 6, 6 పరుగులు రాబట్టాడు. 86 పరుగుల వద్ద అతను ఇచ్చిన మరో సునాయాస క్యాచ్‌ను వోక్స్ వదిలేశాడు.ఉమేశ్ బౌలింగ్‌లో డీప్ మిడ్ వికెట్ దిశగా రెండు పరుగులు చేసి సెంచరీ మార్క్‌ను అందుకున్న వార్నర్, నరైన్ బౌలింగ్‌లో మూడు వరుస బౌండరీలతో జోరు కొనసాగించాడు. వార్నర్ ఆరుగురు కోల్‌కతా బౌలర్ల బౌలింగ్‌లో కనీసం ఒక సిక్సర్ అయినా కొట్టడం అతని ఆధిపత్యాన్ని చూపిస్తోంది. విలియమ్సన్ కూడా... మరో ఎండ్‌లో ఎక్కువగా బంతులు ఆడే అవకాశం రాని శిఖర్ ధావన్ (30 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్) వార్నర్‌కు తగిన సహకారం అందించాడు. 13 పరుగుల వద్ద అతడిని స్టంపౌట్ చేసే అవకాశాన్ని ఉతప్ప చేజార్చాడు. చివర్లో మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడిన విలియమ్సన్, వోక్స్ ఓవర్లో మూడు బౌండరీలతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా స్కోరు 200 పరుగులు దాటింది. ఉతప్ప మినహా...: భారీ ఛేదన చేసే క్రమంలో గంభీర్ (11) తొలి ఓవర్లో రెండు ఫోర్లతో శుభారంభం చేశాడు. అయితే రెండో ఓవర్లో సిరాజ్ 144 కిలోమీటర్ల వేగంతో వేసిన బంతిని ఆడలేక నరైన్ (1) వెనుదిరిగాడు. కౌల్ కూడా తన ఓవర్లోనే గంభీర్‌ను అవుట్ చేయడంతో కోల్‌కతా కష్టాలు పెరిగాయి. ఈ దశలో ఉతప్ప, పాండే కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. దూకుడుగా ఆడిన వీరిద్దరు మూడో వికెట్‌కు 51 బంతుల్లో 78 పరుగులు జోడించారు. ఉతప్ప కొన్ని భారీ షాట్లతో అలరించాడు. అయితే భువీ చక్కటి బంతితో పాండేను అవుట్ చేసి ఈ జోడీని విడదీయగా, సిరాజ్ వేసిన బంతికి ఉతప్ప వెనుదిరిగాడు. ఉతప్ప అవుటయ్యే సమయానికి విజయానికి 45 బంతుల్లో 110 పరుగులు చేయాల్సిన కోల్‌కతా ఆ తర్వాత చేతులెత్తేసింది. వర్షం వచ్చినా...: కోల్‌కతా ఇన్నింగ్స్‌లో 7 ఓవర్లు ముగిసిన తర్వాత వచ్చిన వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. అయితే వానతో 46 నిమిషాల సమయం నష్టపోయినా... మొత్తం ఓవర్లలో ఎలాంటి కోత పడలేదు. -
బెంగళూరు ఆశలపై నీళ్లు!
⇒చిన్నస్వామి స్టేడియంను ముంచెత్తిన వర్షం ⇒సన్‌రైజర్స్, ఆర్సీబీ మ్యాచ్ రద్దు ⇒కోహ్లి సేన అవకాశాలకు దెబ్బ బెంగళూరు: గత మ్యాచ్‌లో ఘోర పరాజయం తర్వాత సొంతగడ్డపై కోలుకొని మళ్లీ ఐపీఎల్ రేసులోకి దూసుకు రావాలనుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆశలకు వర్షం అడ్డుకట్ట వేసింది. భారీ వర్షం కారణంగా మంగళవారం ఇక్కడ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. మ్యాచ్ నిర్ణీత సమయానికి చాలా ముందు నుంచే కురిసిన వర్షం ఏ దశలో కూడా తెరిపినివ్వలేదు. వాన ఆగితే అందుబాటులో ఉన్న అత్యాధునిక వ్యవస్థ ద్వారా వేగంగా గ్రౌండ్‌ను మ్యాచ్ సిద్ధం చేయవచ్చని సిబ్బంది ఆశించినా అలాంటి అవకాశమే లభించలేదు. దాంతో కనీసం టాస్ కూడా వేయకుండానే ఈ మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేయాల్సి వచ్చింది. దాంతో ఇరు జట్లకు చెరో పాయింట్‌ను కేటాయించారు. ఐపీఎల్–2017లో వర్షం కారణంగా రద్దయిన తొలి మ్యాచ్ ఇదే. సొంత మైదానంలో ఈ మ్యాచ్‌తో పాటు గురువారం గుజరాత్ లయన్స్‌తో బెంగళూరు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌లలో కూడా గెలిస్తే ఆ జట్టు ముందంజ వేసే అవకాశం ఉండేది. అయితే తాజా ఫలితంతో ఆర్సీబీ అవకాశాలకు గట్టి దెబ్బ పడింది. ప్రస్తుతం ఆడిన 8 మ్యాచ్‌లలో 2 మాత్రమే గెలిచిన కోహ్లి సేన లీగ్‌లో ముందంజ వేయాలంటే అద్భుతాలు జరగాల్సి ఉంటుంది. మరోవైపు హైదరాబాద్‌లోనే నాలుగు మ్యాచ్‌లు గెలిచిన సన్‌రైజర్స్ జట్టు, ప్రత్యర్థి వేదికపై తొలి విజయం అందుకోవాలని ఆశించినా మ్యాచ్ రద్దుతో అది సాధ్యం కాలేదు. శుక్రవారం మొహాలీలో జరిగే తమ తర్వాతి మ్యాచ్‌లో హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో తలపడుతుంది. సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇలాగే... ఐపీఎల్–5లో భాగంగా 2012 ఇదే ఏప్రిల్ 25న కూడా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో సరిగ్గా ఇదే ఫలితం వచ్చింది. అప్పుడు కూడా భారీ వర్షం కారణంగా బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దయింది. ఐపీఎల్లో నేడు రైజింగ్ పుణే & కోల్‌కతా వేదిక: పుణే, రా. గం. 8.00 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం