super innings
-
ఆ ‘అద్భుతం’ జరిగి రెండేళ్లు!
న్యూఢిల్లీ: ఒకే ఒక సిక్సర్‌తో హీరో అయిపోయాడు. సూపర్ ఇన్నింగ్స్‌తో దేశం పరువు కాపాడి అందరి మన్ననలు అందుకున్నాడు. ఇది జరిగి నేటికి రెండేళ్లు పూర్తయింది. ఆ హీరో ఎవరో కాదు ‘డీకే’గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే దినేశ్ కార్తీక్. దాదాపు 16 ఏళ్ల క్రీడా జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ‘డీకే’.. 2018, మార్చి 18న బంగ్లాదేశ్‌తో జరిగిన టి20 నిదహస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో ఆడి సూపర్ హిట్ ఇన్నింగ్స్‌తో హీరోగా నిలిచాడు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన తుది పోరులో చివరి బంతికి సిక్స్ బాది జట్టుకు విజయంతో పాటు సిరీస్‌ను అందించడంతో అతడి పేరు మార్మోగిపోయింది. (డీకే విధ్వంసం సాగిందిలా...) భారత్ గెలవాలంటే 12 బంతుల్లో 34 పరుగులు చేయాల్సిన దశలో క్రీజ్‌లోకి వచ్చిన డీకే వచ్చీరావడంతోనే విజృంభించాడు. రూబెల్ హొస్సేన్ వేసిన 19వ ఓవర్లో ఆకాశమే హద్దుగా చెలరేగి 6, 4, 6, 0, 2, 4 పరుగులు సాధించాడు. భారత్ గెలవాలంటే చివరి బంతికి 5 పరుగులు కావాలి. క్రీజులో దినేశ్ కార్తీక్ ఉన్నా టెన్షన్ తారాస్థాయిలో ఉంది. సౌమ్య సర్కార్ వేసిన బంతిని ఎక్స్ట్రా కవర్స్ మీదుగా ఫ్లాట్ షాట్ కొట్టగా అందరూ ఫోరు అనుకున్నారు. కానీ అది బౌండరీ అవతల పడింది. అంతే టీమిండియా ఆనందోత్సాహాల్లో మునిగిపోగా, బంగ్లా ఆటగాళ్లు మైదానంలో కుప్పకూలారు. టి20ల్లో టీమిండియాపై గెలిచే అవకాశాన్ని ‘డీకే’ దూరం చేయడంతో బంగ్లా ఆటగాళ్లు హతాశులయ్యారు. టీమిండియాకు ఘోర అవమానాన్ని తప్పించి పరువు కాపాడిన డీకేను సహచరులతో పాటు అభిమానులు ప్రశంసలతో ముంచెత్తారు. -
మిథాలీ ‘రాజ్యం’
సాక్షి క్రీడా విభాగం : ఎప్పుడో 1999లో కెరీర్లో తొలి వన్డేలోనే సెంచరీతో మెరుపులా దూసుకొచ్చింది మిథాలీ రాజ్... ఇప్పుడు ఆసియా కప్ టి20 టోర్నీ ఫైనల్లో తనదైన శైలిలో మరో సూపర్ ఇన్నింగ్స్ ఆడింది. ఈ 17 ఏళ్ల కాలంలో మహిళా క్రికెట్లో ఒక తరం మారింది. తరాల మధ్య అంతరం కూడా చాలా ఉంది. ఫార్మాట్లు మారాయి, ప్లేయర్లు మారారు... కానీ మారనిది మిథాలీరాజ్ ఆట ఒక్కటే. అద్భుతమైన బ్యాటింగ్‌తో, తనకే సాధ్యమైన రీతిలో కళాత్మకత, దూకుడు కలగలిపి భారత్ తరఫున ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాట్స్‌విమన్‌గా ఖ్యాతిని సొంతం చేసుకుంది. కనీసం రోజూవారీ ఖర్చులకు కూడా డబ్బులు లభించని సమయంలో ఆటపై ప్రేమతో అమెచ్యూర్ క్రికెటర్‌గానే తన ప్రతిభను ప్రదర్శించిన మిథాలీ... ఇప్పుడు టీవీ ప్రకటనల్లో కనిపించే స్థాయికి ఎదిగిన ప్రొఫెషనల్ క్రికెటర్‌గా కూడా తన ఆటను మరో స్థారుుకి తీసుకుపోయింది. ఈ రెండు తరాలకు వారధిగా నిలిచిన ఆమె అనేక ఘనతలను తన పేరిట లిఖించింది. అంకెలు, గణాంకాలపరంగా చూస్తూ ఆమెను కొందరు ‘మహిళా సచిన్’ అంటూ అభిమానంగా పిలుచుకున్నా... మిథాలీ రాజ్ మూలస్థంభంలా నిలబడి జట్టుకు అందించిన కొన్ని విజయాలు చూస్తే సచిన్‌తో పోలిక కూడా తక్కువే అనిపిస్తుంది. డబుల్ ధమాకా... హైదరాబాద్ నగరంలోనే క్రికెట్లో ఓనమాలు నేర్చుకున్న మిథాలీ రాజ్ ఆ తర్వాత వేర్వేరు వయోవిభాగాల్లో నిలకడగా రాణిస్తూ తనదైన ప్రత్యేకతను ప్రదర్శించింది. నాడు బీసీసీఐ గుర్తింపునకు నోచుకోకుండా, భవిష్యత్తు అసలు ఎలా ఉంటుందో తెలియని స్థితిలో ఎవరికీ పట్టని మహిళా క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవడం అంటే పెద్ద సాహసమే. కానీ తల్లిదండ్రులు దొరైరాజ్, లీలా రాజ్ ఇచ్చిన ప్రోత్సాహం ఆమెను తనకు ప్రియమైన భరతనాట్యాన్ని వదిలేసి పదేళ్ల వయసులో క్రికెట్ వైపు సాగేలా చేశారుు. అదే పట్టుదల ఆమెకు 15 ఏళ్ల వయసులో 1997 ప్రపంచకప్‌లో ఆడే భారత జట్టులో చోటు అందించింది. కానీ ‘మరీ చిన్న అమ్మాయి’గా భావించిన టీమ్ మేనేజ్మెంట్ ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం ఇవ్వలేదు. దాంతో కాస్త మనసు విరిగినా... పట్టుదలతో ఆడి చివరకు శతకంతో తన రాకను ప్రపంచానికి చూపించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు తన మూడో టెస్టులోనే పటిష్టమైన ఇంగ్లండ్‌పై చేసిన డబుల్ సెంచరీ (214) మిథాలీ స్థాయిని అమాంతం పెంచేసింది. అప్పట్లో మహిళల టెస్టుల్లో అదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఇక ఆమె వెనుదిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. కెప్టెన్‌గా సూపర్... 2003 వచ్చేసరికి మిథాలీ రాజ్ లేకుండా భారత జట్టు ఉండని పరిస్థితి వచ్చేసింది. చివరకు సీనియర్ల నుంచి నాయకత్వ పాఠాలు నేర్చుకున్న అనుభవంతో 2005లో ఆమె తొలిసారిగా కెప్టెన్సీని అంగీకరించింది. అదే ఏడాది ప్రపంచకప్‌లో జట్టును ఫైనల్ వరకు చేర్చిన మిథాలీ... సెమీస్‌లో న్యూజిలాండ్‌పై చేసిన 91 నాటౌట్ స్కోరు మహిళల క్రికెట్లోని అత్యుత్తమ ఇన్నింగ్సలలో ఒకటి. ఆ తర్వాత కూడా మిథాలీ నేతృత్వంలో టీమిండియా ఎన్నో మధుర విజయాలు సాధించింది. ఆసియా కప్‌లు, ముక్కోణపు టోర్నీలు, నాలుగు దేశాల టోర్నీ టైటిల్సే కాకుండా ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాపై వారి గడ్డపైనే గెలిచిన వన్డే సిరీస్ ఆమె కెరీర్లో మైలురాళ్లు. బీసీసీఐ మార్పు చేర్పుల్లో భాగంగా మధ్యలో కొంత కాలం మినహా గత దశాబ్ద కాలంలో మిథాలీనే భారత కెప్టెన్. రెండేళ్ల క్రితం ఇంగ్లండ్‌పై వామ్స్లేలో కెప్టెన్‌గా ముందుండి నడిపిస్తూ అందించిన చారిత్రక టెస్టు విజయం మిథాలీ కీర్తిని మెరో మెట్టు ఎక్కించింది. తిరుగులేని రికార్డు... వేర్వేరు కారణాలతో ఇన్నేళ్ల కెరీర్లో భారత్ చాలా తక్కువ టెస్టులు ఆడింది. దాంతో మిథాలీ కూడా 10 టెస్టులే ఆడినా, అందులోనూ ఆమె సగటు 51 కావడం విశేషం. టి20ల్లో కూడా మన బెస్ట్ బ్యాట్స్‌విమన్‌గా తనదైన ముద్ర చూపించిన మిథాలీ... వన్డేల్లో మాత్రం క్వీన్. 167 మ్యాచ్‌లలో 5,407 పరుగులతో టాప్ స్కోరర్ల జాబితాలో మిథాలీ ప్రపంచ క్రికెట్లో రెండో స్థానంలో ఉంది. అయితే ఈ జాబితాలో అత్యధిక సగటు (49.60) ఆమెదే కావడం విశేషం. 5 సెంచరీలు, 40 అర్ధసెంచరీలతో ఆమె రికార్డు అద్భుతం. శనివారమే 34వ పుట్టిన రోజు జరుపుకున్న మిథాలీ పరుగుల తృష్ణ ఇంకా తగ్గలేదు. ఇదే ఫామ్‌తో ఆమె మరిన్ని ఘనతలు సొంతం చేసుకోవాలని ఆశిద్దాం. -
సిగ్గు...సిగ్గు...
తొలి వన్డేలో చేజేతులా ఓడిన భారత్ ► 5 పరుగులతో నెగ్గిన దక్షిణాఫ్రికా ► రోహిత్ శర్మ సూపర్ ఇన్నింగ్స్ వృథా ► డివిలియర్స్ మెరుపు సెంచరీ ► రెండో వన్డే బుధవారం భారత్ ఎదురుగా 304 పరుగుల కొండంత లక్ష్యం.... అయినా రోహిత్‌శర్మ ఏ మాత్రం బెదరకుండా దాదాపు సగం పరుగులు ఒక్కడే చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లపై ఎదురుదాడితో ఏకంగా 150 పరుగులు చేసి విజయపు అంచుల్లోకి తీసుకొచ్చాడు. ఇక భారత్ 24 బంతుల్లో 35 పరుగులు చేస్తే చాలు. చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. ఇలాంటి స్థితిలో దక్షిణాఫ్రికా గెలుస్తుందనే ఆలోచన కూడా ఎవరికీ రాలేదు. కానీ అనిశ్చితికి మారుపేరైన భారత ‘హీరో’లు తోక ముడిచారు. అనుభవం లేని రబడా బంతుల్ని ఎదుర్కోలేక... క్రీజులో నిలబడటానికే తడబడి... చేజేతులా ఓడిపోయారు. ఆఖరి ఓవర్ వరకు పోరాట స్ఫూర్తితో ఆడిన దక్షిణాఫ్రికా జట్టు తొలి వన్డేలో గెలిచి సిరీస్‌లో శుభారంభం చేసింది. కాన్పూర్: జట్టులో ధోని ఎందుకంటూ ఓ వైపు ప్రశ్నల వర్షం కురుస్తున్నా... ప్రపంచంలో ఇప్పటికీ తనే బెస్ట్ ఫినిషర్ అనే నమ్మకం మాత్రం అందరిలోనూ ఉంది. చివరి ఓవర్లో మెరుపు షాట్లతో మ్యాచ్‌లను అలవోకగా ముగించే ధోని... ఈసారి మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. దక్షిణాఫ్రికాపై కచ్చితంగా గెలిచే స్థితిలో ఉన్న మ్యాచ్‌ను కాపాడలేకపోయాడు. కోహ్లి, రైనా, బిన్నీ కూడా పూర్తిగా బాధ్యతారాహిత్యం కనబరిచారు. ఫలితం... తొలి వన్డేలో భారత్‌కు ఓటమి. రోహిత్ శర్మ (133 బంతుల్లో 150; 13 ఫోర్లు, 6 సిక్సర్లు) చిరకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడినా ఉపయోగం లేకపోయింది. గ్రీన్‌పార్క్ మైదానంలో ఆదివారం జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా 5 పరుగుల స్వల్ప తేడాతో భారత్‌పై నెగ్గింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 5 వికెట్లకు 303 పరుగులు చేసింది. కెప్టెన్ డివిలియర్స్ (73 బంతుల్లో 104 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) వీరోచిత ఇన్నింగ్స్ ఆడగా.. డు ఫ్లెసిస్ (77 బంతుల్లో 62; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. తర్వాత భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 298 పరుగులకే పరిమితమైంది. రోహిత్‌కు తోడు రహానే (82 బంతుల్లో 60; 5 ఫోర్లు) రాణించాడు. ఐదు వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యం సాధించింది. రెండో వన్డే బుధవారం ఇండోర్‌లో జరుగుతుంది. కళ్లు చెదిరే షాట్లు దక్షిణాఫ్రికా ఓపెనర్లలో డికాక్ (29) తొందరగా అవుటైనా... ఆమ్లా (37) నిలకడగా ఆడాడు. పేసర్లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో తొమ్మిదో ఓవర్లోనే ధోని... అశ్విన్ చేతికి బంతి ఇచ్చి ఫలితాన్ని సాధించాడు. వన్‌డౌన్‌లో డు ఫ్లెసిస్ మెరుగ్గా ఆడినా... పార్ట్‌టైమర్ రైనా చక్కని బౌలింగ్‌తో పరుగులు నిరోధించాడు. రెండో వికెట్‌కు 59 పరుగులు జోడించాక ఆమ్లా వెనుదిరిగాడు. ఈ దశలో వచ్చిన డివియర్స్ కళ్లు చెదిరే షాట్లతో చెలరేగిపోయాడు. రెండో ఎండ్‌లో డు ఫ్లెసిస్, మిల్లర్ (13), డుమిని (15) వరుస విరామాల్లో అవుటైనా... 40వ ఓవర్ తర్వాత డివిలియర్స్ మాత్రం శివాలెత్తాడు. బిన్నీ వేసిన 45వ ఓవర్లో రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లతో 21 పరుగులు; భువీ (49వ ఓవర్) ఓవర్లో రెండు సిక్స్‌లు, ఓ ఫోర్‌తో 19 పరుగులు రాబట్టాడు. రెండో ఎండ్‌లో బెహర్డీన్ (35 నాటౌట్) కూడా చెలరేగడంతో సఫారీల స్కోరు 300లు ధాటింది. ఆఖరి బంతిని సిక్సర్‌గా మలిచి సెంచరీ పూర్తి చేసిన డివిలియర్స్... బెహర్డీన్తో కలిసి 4.5 ఓవర్లలో అజేయంగా 65 పరుగులు సమకూర్చాడు. ఉమేశ్, మిశ్రా చెరో రెండు వికెట్లు తీశారు. రోహిత్ ఒంటరిపోరాటం లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ధావన్ (23) విఫలమైనా.. రోహిత్ అద్భుతంగా ఆడాడు. సఫారీ బౌలర్లను ఏమాత్రం లెక్కచేయకుండా షాట్లు కొట్టాడు. రెండో ఎండ్‌లో రహానే కూడా సమయోచితంగా ఆడటంతో భారత్ ఇన్నింగ్స్ ఇబ్బంది లేకుండా సాగింది. అయితే అర్ధసెంచరీ పూర్తయిన తర్వాత రహానే భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో అవుటయ్యాడు. దీంతో రెండో వికెట్‌కు 149 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 34వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన కోహ్లి (11) స్ట్రయిక్ రొటేట్ చేయడంలో, పరుగులు తీయడంలో విఫలమయ్యాడు. 98 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్... ధోనితో కలిసి వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. ఎక్కువగా స్ట్రయిక్ తీసుకొని భారీ సిక్సర్లు కొట్టడంతో స్కోరు పరుగెత్తింది. నాలుగో వికెట్‌కు 55 పరుగులు జోడించాక 47వ ఓవర్లో రోహిత్, రైనాలు నాలుగు బంతుల వ్యవధిలో అవుట్‌కావడం భారత్‌ను దెబ్బతీసింది. చివరి ఓవర్లో భారత్ విజయానికి 11 పరుగులు అవసరం కాగా... రబడా వేసిన ఈ ఓవర్లో ధోని, బిన్నీ అవుటయ్యారు. దీంతో కేవలం ఐదు పరుగులు మాత్రమే వచ్చాయి. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (సి) రైనా (బి) అశ్విన్ 29; ఆమ్లా (బి) మిశ్రా 37; డు ఫ్లెసిస్ ఎల్బీడబ్ల్యు (బి) ఉమేశ్ 62; డివిలియర్స్ నాటౌట్ 104; మిల్లర్ (స్టంప్డ్) ధోని (బి) మిశ్రా 13; డుమిని (సి) ధోని (బి) ఉమేశ్ 15; బెహర్డీన్ నాటౌట్ 35; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: (50 ఓవర్లలో 5 వికెట్లకు) 303. వికెట్ల పతనం: 1-45; 2-104; 3-152; 4-197; 5-238. బౌలింగ్: భువనేశ్వర్ 10-0-67-0; ఉమేశ్ 10-0-71-2; అశ్విన్ 4.4-0-14-1; మిశ్రా 10-0-47-2; బిన్నీ 8-0-63-0; రైనా 7-0-37-0; కోహ్లి 0.2-0-1-0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి అండ్ బి) తాహిర్ 150; ధావన్ ఎల్బీడబ్ల్యు (బి) మోర్కెల్ 23; రహానే (సి) మిల్లర్ (బి) బెహర్డీన్ 60; కోహ్లి (సి) మోర్కెల్ (బి) స్టెయిన్ 11; ధోని (సి అండ్ బి) రబడా 31; రైనా (సి) డుమిని (బి) తాహిర్ 3; బిన్నీ (సి) ఆమ్లా (బి) రబడా 2; భువనేశ్వర్ నాటౌట్ 1; మిశ్రా నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 17; మొత్తం: (50 ఓవర్లలో 7 వికెట్లకు) 298. వికెట్ల పతనం: 1-42; 2-191; 3-214; 4-269; 5-273; 6-297; 7-297. బౌలింగ్: స్టెయిన్ 10-0-54-1; రబడా 10-0-58-2; బెహర్డీన్ 6-0-38-1; మోర్కెల్ 10-0-51-1; డుమిని 4-0-36-0; తాహిర్ 10-0-57-2. ‘అశ్విన్ గాయపడటం మమ్మల్ని బాగా దెబ్బతీసింది. అతను వేయని 5.2 ఓవర్లే చాలా కీలకమయ్యాయి. భారీ లక్ష్యం ఉన్నా గెలుపునకు చాలా దగ్గరగా వచ్చాం. కానీ ఫలితమే నిరాశపర్చింది. బిన్నీ, రైనాలకు మరిన్ని ఓవర్లు వేసే అవకాశం ఇవ్వాల్సింది. ఓవరాల్‌గా మా బౌలర్లు కాస్త మెరుగుపడ్డారనే చెప్పొచ్చు. రోహిత్, రహానే భాగస్వామ్యం అద్భుతం. మధ్యలో కొన్ని ఓవర్లు స్ట్రయిక్ రొటేట్ కాలేదు. ఇది మా విజయాన్ని దెబ్బతీసింది. చివర్లో బంతి అనుకున్నంత ఎత్తులో రాలేదు. దీంతో భారీ షాట్లు కొట్టడంలో విఫలమయ్యాం’. -ధోని ‘ఈ గెలుపు మొత్తం తాహిర్‌దే. ఒకే ఓవర్లో రోహిత్, రైనా వికెట్లు తీయడం మాకు కలిసొచ్చింది. ఇలాంటి మ్యాచ్‌లే అభిమానులను స్టేడియానికి తీసుకొస్తాయి. మ్యాచ్ మధ్యలో చాలాసార్లు విజయం ఇరు జట్లతో దోబూచులాడింది. అయితే తాహిర్ మా వైపు మొగ్గేలా చేశాడు. చివర్లో రబడా బాగా నిలువరించాడు. కొంత విశ్రాంతి తీసుకొని రెండో మ్యాచ్‌పై దృష్టిపెడతాం’. - డివిలియర్స్ -
వీళ్లపై ఓ లుక్కేద్దాం...
దూసుకొస్తున్న మెరుపు ఆటగాళ్లు సూపర్ ఇన్నింగ్స్‌తో ఇప్పటికే గుర్తింపు వరల్డ్‌కప్‌లో ముద్ర వేసేందుకు సిద్ధం టి20 క్రికెట్లో స్టార్ బ్యాట్స్‌మెన్, మెరుపు వీరులు అనగానే కొన్ని పేర్లు వినిపిస్తాయి. క్రిస్ గేల్, కోహ్లి, డివిలియర్స్, వార్నర్, వాట్సన్, ధోని, ఆఫ్రిది, మెకల్లమ్...ఈ జాబితా ఇలా సాగుతుంది. సందేహం లేదు... వీళ్లంతా స్టార్లే. ఒంటి చేత్తో తమ జట్లకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. ఈ క్రికెటర్ల జోరును మనం ఎంతో ఆస్వాదించాం. ఈ సారి టి20 ప్రపంచ కప్‌లో కూడా వీరు కీలకమే. అయితే వీళ్లతోపాటు ప్రపంచకప్‌లో మనకు పరుగుల వినోదాన్ని అందించేందుకు మరి కొంత మంది కొత్త ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. ఇటీవల వీరు తమ సంచలన ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. దాంతో వీరిపై ఆయా జట్లు ఎన్నో అంచనాలు పెట్టుకున్నాయి. ముఖ్యంగా గత వరల్డ్ కప్ సమయంలో పెద్దగా గుర్తింపులో లేకపోయినా...ఈ ప్రపంచ కప్ సమయానికి వీళ్లంతా బాగా ఎదిగారు. ఈ టి20 ప్రపంచకప్‌లో గమనించదగ్గ కొత్త ఆటగాళ్లపై ఫోకస్... ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా) గత ఏడాది ఇంగ్లండ్‌తో జరిగిన టి20 మ్యాచ్‌లో 63 బంతుల్లోనే 11 ఫోర్లు, 14 సిక్సర్లతో 156 పరుగులు చేసి (47 బంతుల్లోనే సెంచరీ) ఫించ్ ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. ఆ వెంటనే భారత్‌తో కూడా 52 బంతుల్లో 89 పరుగులు చేసి తన జోరు గాలివాటం కాదని నిరూపించాడు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్‌లో రెండు మెరుపు సెంచరీలు చేసి ఫించ్ తన ఫామ్ చాటాడు. అంతర్జాతీయ టి20ల్లో అతని స్ట్రైక్ రేట్ 170.89 కావడం విశేషం. కోరీ అండర్సన్ (న్యూజిలాండ్) వన్డేల్లో 36 బంతుల్లోనే సెంచరీ చేసి అండర్సన్ అనూహ్యంగా తెరపైకి వచ్చాడు. తొలి సెంచరీ తర్వాత భారత్‌పై 40 బంతుల్లోనే 68... 17 బంతుల్లోనే 44 పరుగులు చేసిన ఇన్నింగ్స్‌లు అతని విలువేంటో చూపించాయి. అంతర్జాతీయ టి20ల్లో ఇంకా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడకపోయినా... ధాటిగా ఆడే అతని శైలి ఫార్మాట్‌కు సరిగ్గా సరిపోతుంది. కివీస్ దేశవాళీలో అండర్సన్ భారీ సిక్సర్లకు పెట్టింది పేరు. డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా) గత ఐపీఎల్లో పంజాబ్ తరఫున ఆడుతూ బెంగళూరుపై 38 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 101 పరుగులు చేసి ‘కిల్లర్’గా గుర్తింపు తెచ్చుకున్నాడు. పవర్‌ప్లేలో బిగ్ ప్లేయర్‌గా మిల్లర్‌కు దక్షిణాఫ్రికా క్రికెట్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఏడాది అక్కడి దేశవాళీ టి20 టోర్నీ ర్యామ్స్లామ్ చాలెంజ్‌లో 153.20 స్ట్రైక్ రేట్‌తో టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచి తన ఫామ్‌ను చాటుకున్నాడు. ఇటీవల సెంచూరియన్ వన్డేలో 34 బంతుల్లో 56 పరుగులు చేసిన మిల్లర్ జోరు ఏమిటో ఇటీవల భారత్ కూడా రుచి చూసింది. శిఖర్ ధావన్ (భారత్) గత టి20 ప్రపంచ కప్‌లో భారత జట్టులో లేని ధావన్... ఈ రెండేళ్ల కాలంలో జట్టు ప్రధాన బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. ఫార్మాట్ ఏదైనా తనదైన ధాటిని ప్రదర్శించగల అతను టోర్నీలో టీమిండియాకు కీలకం కానున్నాడు. గత ఏడాది ఐపీఎల్లో సన్‌రైజర్స్ తరఫున 122.92 స్ట్రైక్‌రేట్‌తో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వన్డేల్లో చేసిన ఐదు మెరుపు సెంచరీలు ధావన్ పవర్ ప్లే ఏమిటో చూపించాయి. టి20ల్లో ఇదే తరహా మెరుపు ఆరంభాన్ని ఆశించవచ్చు.