ఆదాల నామినేషన్ మద్దతు లొల్లి
నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి ముందు మద్దతు తెలిపిన ఎమ్మెల్యేలు తర్వాత వాటిని ఉపసంహరించుకోవడం వివాదానికి దారితీసింది. ముందు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉపసంహరణ లేఖలు ఇస్తే ఎలాగని అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాంను ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఉపసంహరణ లేఖలను అంగీకరిస్తే.. తనకు మద్దతుగా మరో పది లేఖలను ఇప్పటికిప్పుడు తెస్తానని, మరి వాటిని కూడా అంగీకరిస్తారా అని అడిగినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో ఏం చేయాలన్న దానిపై ఇంకా అసెంబ్లీ వర్గాలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నాయి. ప్రస్తుతానికి కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి, అక్కడే పరిష్కరించుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం.