'బాబు హామీలు నమ్మే వాళ్లంతా ఓటేశారు'
నెల్లూరు: టీడీపీ అధ్యక్షుడు నారాచంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నమ్మి బీసీలంతా ఓట్లేశారని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కే. శంకరావు అన్నారు. నెల్లూరులోని ఓ కల్యాణమండపంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..టీడీపీ ప్రభుత్వం బీసీలపై చిన్న చూపు చూస్తోందని విమర్శించారు.
గత ఎన్నికల సమయంలో టీడీపీ మేనిఫెస్టోలో బీసీలకు సంబంధించి పొందుపరిచిన హామీలు నెరవేర్చటంలేదని మండిపడ్డారు. బీసీలంతా కలిసి టీడీపీకి ఓట్లేసినా ఇంత అన్యాయం చేశారని మండిపడ్డారు. బీసీలు కలిసికట్టుగా ఉండి సమస్యలు పరిష్కరించుకుందామని అన్నారు. త్వరలో విజయవాడలో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు శంక ర్రావు తెలిపారు.