'మహిళల భద్రత కోసమే సురక్ష బీమా'
సుందరయ్య విజ్ఞాన కేంద్రం (హైదరాబాద్): మహిళలకు సామాజిక భద్రత కల్పించేందుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాఖీ పౌర్ణమి సందర్భంగా సురక్ష బీమా పథకాన్ని ప్రవేశపెట్టారని బీజేపీ శాసనసభా పక్షనేత కె.లక్ష్మణ్ అన్నారు. ఆ పథకంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో 5 వేల మంది మహిళలకు బీమా కల్పిస్తున్నట్టు ఆయన చెప్పారు. మంగళవారం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య పార్కు వద్ద సురక్ష బీమా పథకాన్ని లక్ష్మణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలతో రాఖీలు కట్టించుకొని వారికి పథకాన్ని అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ.. మోదీ ప్రధాని అయ్యాక అనేక సామాజిక భద్రత పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు.