Suresh adimulapu
-
‘టిడ్కో ఇళ్లపై ఓ వర్గం మీడియా విషప్రచారం’
సాక్షి, కాకినాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఊళ్ల నిర్మాణం జరుగుతోందని మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి స్పష్టం చేశారు. పనిగట్టుకుని విష ప్రచారం చేస్తున్న ఒక వర్గం మీడియా, టీడీపీ నేతలు వాస్తవాలు తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. టీడీపీ నేతలు టీడ్కో గృహాలు తమవని సెల్ఫీ చాలెంజ్‌లు చేస్లున్నారని, టిడ్కో ఇళ్లను సీఎం జగన్ సమూలంగా సంస్కరించారన్నారు. ‘70 వేల టిడ్కో ఇళ్ళు లబ్ధిదారులకు అందజేశాం.ఆనాడు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో..ఇప్పుడు వారే ఉన్నారు.పేదలకు తమ సొంత ఇంటి కల వాస్తవానికి చాల దూరంగా ఉంటుంది.సొంత ఇళ్ళు ఉన్నప్పుడు సమాజంలో చాల గౌరవం ఉంటుంది.అన్ని సముదాయాలతో పేదల ఇంటి కలను సిఎం జగన్ సాకారం చేశారు.లబ్ధిదారుల చెలించాల్సిన సొమ్మును సగానికే తగ్గిండం తో పాటుగా ..రూపాయికే సొంతింటిన అప్పగించిన ఘనతవ సిఎం జగన్‌ది.గత పాలకులు ఓట్ల రాజకీయం చేశారు.30 లక్షల ఇళ్ళ పట్టాల ఇవ్వడం ప్రపంచ రికార్డ్’ అని పేర్కొన్నారు. -
ఆంధ్రప్రదేశ్ కు జాతీయ అవార్డులు
-
రైతులకు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలి: బాలినేని శ్రీనివాసరెడ్డి
సాక్షి,ఒంగోలు అర్బన్: రైతులు సంతోషంగా ఉంటే ప్రజలంతా సంతోషంగా ఉంటారని భావించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులను అన్నీ రకాలుగా ఆదుకునేందుకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర విద్యుత్, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రకాశం భవనంలో శుక్రవారం నిర్వహించిన వ్యవసాయ సలహామండలి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. చట్ట ప్రకారం రాష్ట్రానికి అందాల్సిన నీటి వాటా అందడంలేదని, అక్రమంగా తెలంగాణకు తీసుకుపోతుంటే ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు ఎందుకు సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించడని అన్నారు. ఓటుకు నోటు కేసు తిరగతోడతారని చంద్రబాబుకు భయం అన్నారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఆయన హయాంలో రైతులకు ఏం చేశారో, నీటి వాటాలపై తెలంగాణ వైఖరిపై మాట్లాడాలని సవాల్ విసిరారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలని చూడటం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు ప్రకాశం జిల్లా గురించి మాట్లాడితే రాయలసీమలో వ్యతిరేకత వస్తుందని, స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలతో జిల్లా ఎడారిగా మారుతుందని మాట్లాడించారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో జిల్లాలో ఒక్క ప్రాజెక్టు కట్టలేదని, రైతులకు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలన్నారు. జిల్లాలో రైతుల గురించి కాని, నీటి సరఫరా గురించి కాని మాట్లాడే నైతిక హక్కు టీడీపీ నేతలకు లేదన్నారు. టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ హైదరాబాదులో బాబుని కలిసి స్క్రిప్ట్ తీసుకొచ్చి మీడియా ముందు చదివారన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు ధైర్యం ఉంటే మీడియా సమావేశం పెట్టి మాట్లాడాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో అన్నీ జిల్లాలు సమానమేనని, అన్నీ జిల్లాలకు సమ న్యాయం జరుగుతుందని చెప్పారు. నీటి ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్లిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తండ్రి పాత్ర పోషించి నీటి పంపకాల్లో న్యాయం చేస్తే మంచిదన్నారు. నీటి పంపకాల్లో రాష్ట్రానికి న్యాయం జరగాలన్నారు. ప్రాంతీయ వాదం రెచ్చగొడుతున్న చంద్రబాబు: మంత్రి ఆదిమూలపు సురేష్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రాయలసీమ, ప్రకాశం ప్రాంతాలకు మధ్య చంద్రబాబు ప్రాంతీయ వాదం రెచ్చగొడుతున్నారని అన్నారు. చట్ట బద్ధంగా రాష్ట్రానికి అందాల్సిన నీటిలో ఒక్క చుక్క కూడా ఎక్కువ అవసరం లేదని, అదేవిధంగా ఒక్క చుక్క తగ్గినా ఊరుకునేది లేదన్నారు. రాయలసీమ ప్రజలకు నీరు ఇవ్వకూడదా... రాయలసీమ రైతులకు సంక్షేమ పథకాలు ఇవ్వకూడదా చంద్రబాబు చెప్పాలన్నారు. జిల్లా ఎడారి అవుతుందని మాట్లాడించడం అన్యాయమన్నారు. ఆయన హయాంలో జిల్లాకు ఏం చేశారో చంద్రబాబు చెప్పాలన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి ఈ ఏడాది చివరకు మొదటి టన్నెల్ ప్రారంభించి నీటి విడుదల చేస్తామన్నారు. రెండో టన్నెల్ పనులతో పాటు ఆర్అండ్ఆర్ ప్యాకేజి, పునరావాస కాలనీల పనులు అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. మంత్రులతో పాటు వ్యవసాయ సలహా మండలి జిల్లా చైర్మన్ ఆళ్ల రవీంద్రారెడ్డి ఉన్నారు. -
విద్యాభివృద్ధికి ప్రపంచ బ్యాంకు సహకరించాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యాభివృద్ధి కార్యక్రమాలకు, మౌలిక సదుపాయాల కల్పనకు వీలుగా ప్రపంచ బ్యాంకు సహకారాన్ని అందించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కోరారు. శుక్రవారం సమగ్ర శిక్షా కార్యాలయంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు షబ్నం సిన్హా, కార్తిక్ పెంటల్, నీల్ బూచర్లతో ‘ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య అభివృద్ధి పథకం’ గురించి వెబినార్ సమావేశం జరిగింది. ఈ వెబినార్‌లో విద్యాశాఖ మంత్రి, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ► రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సంస్కరణలు తీసుకువస్తోంది. బడ్జెట్లో 16 శాతం నిధులు విద్యారంగానికి కేటాయించడం చరిత్రలో ఇదే మొదటిసారి. ► మానవ వనరులు, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా నాణ్యమైన విద్యను అందించగలుగుతున్నాం. ► విద్యారంగంలో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలపడానికి ‘మన బడి నాడు నేడు’ కార్యక్రమం ద్వారా పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. ► మంత్రితో పాటు పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్య కమిషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు, ఆంగ్లమాధ్యమ ప్రత్యేక అధికారి కె.వెట్రిసెల్వి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి. సమగ్ర శిక్షా ఏఎస్పీడీ∙ఆర్.మధుసూదనరెడ్డి, పాఠశాల విద్య సలహాదారులు డాక్టర్ ఎ.మురళి తదితరులు పాల్గొన్నారు. -
డీఎస్సీ–2018 అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు
సాక్షి, అమరావతి : డీఎస్సీ–2018లో అర్హత సాధించి మెరిట్లో నిలిచిన అభ్యర్థులకు ఆయా జిల్లాల్లో కౌన్సెలింగ్ ద్వారా వారు కోరుకున్న స్కూళ్లలో నియమిస్తూ ఆదివారం పోస్టింగ్‌లు ఇచ్చారు. కడపలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌లు.. ఎంపికైన అభ్యర్థులకు ఈ నియామక పత్రాలు అందజేశారు. డీఎస్సీ–2018లో 7,902 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. వీటిలో ఎలాంటి న్యాయ వివాదాలు లేని వివిధ కేటగిరీల్లోని 2,654 పోస్టులకు ఆదివారం ఈ నియామక ఉత్తర్వులిచ్చారు. మిగిలిన పోస్టులకు సంబంధించిన వ్యాజ్యం త్వరలో హైకోర్టులో విచారణకు రానుంది. ఇది పరిష్కారమైతే ఆ పోస్టులకూ వెంటనే నియామక ఉత్తర్వులు ఇస్తామని అధికార వర్గాలు వివరించాయి. బీసీ గురుకులాల్లో 322 టీచర్ పోస్టులు భర్తీ మహాత్మా జ్యోతీరావు పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 322 టీచర్ పోస్టులు భర్తీ అయ్యాయి. గురుకుల సొసైటీ కార్యదర్శి ఎ కృష్ణమోహన్ ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించి నియామక పత్రాలు అందజేశారు. 2018 డీఎస్సీలో 404 ఖాళీల భర్తీకి సంబంధించి గురుకుల సొసైటీ ప్రభుత్వానికి వివరాలు ఇవ్వగా అందులో 322 పోస్టులు భర్తీ చేసేందుకు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇందులో పీజీటీ, టీజీటీ, డ్రాయింగ్, మ్యూజిక్ టీచర్ పోస్టులు ఉన్నాయి. జోన్–1 (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం) నుంచి 78 మంది, జోన్–2 (తూర్పు గోదావరి, పశి్చమ గోదావరి, కృష్ణా జిల్లాలు)నుంచి 26 మంది, జోన్–3 (గుంటూరు, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు) నుంచి 56 మంది, జోన్–4 (చిత్తూరు, అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ కడప) 162 మంది ఎంపికయ్యారు. మొత్తం పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు 132 మంది, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు 148 మంది, డ్రాయింగ్ టీచర్లు 18 మంది, క్రాఫ్ట్ టీచర్లు 12 మంది, మ్యూజిక్ టీచర్లు 12 మంది ఉన్నారు. బీసీ గురుకులాల్లో సుమారు 20 సంవత్సరాల నుంచి శాశ్వత టీచర్ పోస్టులు భర్తీ చేయలేదు. నూతనంగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం 2018 డీఎస్సీ అభ్యర్థుల విషయంలో ఉన్న కోర్టు అభ్యంతరాలను పరిష్కరించి అడుగులు ముందుకు వేసింది. -
రుణం చెల్లించిన వారికి అన్యాయమా...!
సాక్షి ప్రతినిధి: రుణమాఫీపై ప్రభుత్వం రైతులను మోసపుచ్చేవిధంగా వ్యవహరిస్తోందని ప్రకాశం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్ ప్రభుత్వాన్ని నిలదీశారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో వ్యవసాయ నిమిత్తం తీసుకున్న పంట, వ్యవసాయ, బంగారు రుణాల మాఫీకి ఎంత ఖర్చు అవుతుంది, జిల్లా వారీగా ఎంత చెల్లించాలి? డ్వాక్రా రుణాల మాఫీకి ఎంత ఖర్చు అవుతుంది, జిల్లాల వారీగా ఎంత? రాష్ట్రంలోని అన్ని మండలాల్లో రుణాలు రీషెడ్యూల్ చేస్తారా? దుర్భిక్షపీడిత ప్రాంతాల్లోనే రుణాల రీషెడ్యూల్ చేస్తారా? దీని వడ్డీ భారాన్ని ప్రభుత్వం భరిస్తుందా అని ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి కుమార్, ఆదిమూలపు సురేష్ అడిగిన ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో ఎమ్మెల్యేలు నిలదీశారు. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ అంశంపై మంత్రి ఇచ్చిన సమాధానంపై అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ 2013 డిసెంబర్ 31 ముందు రుణాలు పొంది, 2014 మార్చి 31 వరకూ చెల్లించని వారికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తోందని, 2014 జనవరి నుంచి మార్చి వరకు చెల్లించిన వారికి ఈ పథకం వర్తించడం లేదన్నారు. ఇటీవల కొన్ని పత్రికల్లో మంచి రైతుకు మాఫీ వర్తించదు అంటూ వచ్చిన కథనాలను ఆయన సభ దృష్టికి తీసుకువెళ్లారు. బుక్ అడ్జస్ట్మెంట్ విషయంలో కూడా ఇదే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. ఎన్నికల ముందు పాదయాత్ర సమయంలో పలువేదికలపై సకాలంలో రుణం చెల్లిం చిన వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు అశ్వత్థామ అతః కుంజరహా అన్నట్లు నిజాయితీ గల పేద రైతుకు రుణమాఫీ వర్తిస్తుంది.. షరతులతో అన్నట్లు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సహకార వ్యవస్థలో 80, 90 వేల మంది రైతులు రుణాలు తీసుకున్నారని, వారంతా జనవరి నుంచి మార్చి వరకూ రుణాలు చెల్లించారని చెప్పారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 300 కోట్లు చెల్లిస్తే అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా 550 కోట్ల రూపాయలు చెల్లించారన్నారు. రాష్ట్రం మొత్తంమీద 2500 కోట్ల రూపాయలు రైతులు రుణాలు చెల్లించారని, వారంతా 174 జీవో కారణంగా నష్టపోయారన్నారు. అద్దంకి, పరుచూరు నియోజకవర్గాల్లో రైతులు ఎక్కువ నష్టపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి కుటుంబానికి లక్షన్నర రుపాయలు రుణమాఫీ చెల్లిస్తామని ప్రకటించినా ఇప్పటి వరకూ ఒక్క రైతుకు కూడా రుణ మాఫీ చెల్లించలేదని, దీని కారణంగా రైతులు వడ్డీ రాయితీ కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. కాలపరిమితి దాటిపోతే 10.5 శాతం వడ్డీ చెల్లించాల్సిన పరిస్తితి వస్తుందన్నారు. ఈ బడ్జెట్లో వ్యవసాయ రుణాల మాఫీ కోసం ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారని, ఇదే పద్దతిలో చేస్తే ఏడెనిమిది సంవత్సరాలకు గాని రుణాలు మొత్తం మాఫీ కావని చెప్పారు. రీషెడ్యూల్ కూడా అన్ని మండలాలకు వర్తింప చేయాలని రవి డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప కోనసీమ రైతులతో కలిసి వ్యవసాయ మంత్రిని రుణమాఫీపై చర్చించిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అనంతరం మాట్లాడిన సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ప్రభుత్వ వైఖరిపై విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ఉద్దేశ్యం తెలుగుదేశం పార్టీకి లేదని ఆయన విమర్శించారు. ఆ ఉద్దేశ్యం ఉంటే కోటయ్య కమిటీని ఎందుకు వేస్తారని ఆయన నిలదీశారు. వ్యవసాయ బడ్జెట్లో రుణమాఫీ కోసం ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించడమే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని నిరూపిస్తోందని ఆయన అన్నారు. రుణాలను రీషెడ్యూల్ చేసి వాటిని కూడా రుణమాఫీగా ఎలా చూపిస్తారని ఆయన నిలదీశారు. రుణమాఫీ చేస్తామని ఒక పక్కన ప్రకటిస్తూనే అర్హత ఉన్న రైతులకు కూడా బ్యాంకులు ఏ విధంగా నోటీసులు పంపిస్తాయని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు రైతులను మోసపుచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని, ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయిన తర్వాత కూడా ఇప్పటి వరకూ ఒక్క రైతుకు కూడా రుణమాఫీ వర్తింప చేయకపోవడం వల్ల కొత్త రుణాలు తీసుకునే అవకాశం లేక రైతాంగం పడుతున్న ఇబ్బందులను, బ్యాంకులు ఇస్తున్న నోటీసులను ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై అనుబంధ ప్రశ్నలను వేసేందుకు స్పీకర్ అనుమతించకపోవడంతో సభలో వివాదం నెలకొంది. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.