surevey
-
5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఆవిర్భావం ఖాయం
న్యూఢిల్లీ: మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు, అదనపు సంస్కరణలు, మెరుగైన సాంకేతికతను అవలంభించడం వంటి చర్యలకు కేంద్రం సంపూర్ణ మద్దతును అందిస్తుందని భారత్ కార్పొరేట్ విశ్వసిస్తోంది. ఈ దన్నుతో భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించగలమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. డెలాయిట్ టచ్ తోహ్మత్సు ఇండియా ఎల్ఎల్పీ నిర్వహించిన సీఎక్స్‌వో సర్వేలో వెల్లడైన కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ►వచ్చే ఆర్థిక సంవత్సరంలో బలమైన ఆర్థిక వృద్ధిని భారత్ నమోదు చేస్తుందని వ్యాపార ప్రముఖులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే 2024–25 ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతంకన్నా ఎక్కువగా వృద్ధి రేటు నమోదవుతుందని 50 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. తద్వారా ఎకానమీపై పూర్తి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ►అధిక రేటును అంచనా వేస్తున్న పారిశ్రామిక రంగాలలో ఆటోమోటివ్ (50 శాతం), వినియోగం, రిటైల్ (66 శాతం), సాంకేతికత, మీడియా, టెలికమ్యూనికేషన్ (47 శాతం) శక్తి, సంబంధిత వనరులు (44 శాతం) ఉన్నాయి. ►ప్రభుత్వ కార్యక్రమాలు, పెరిగిన వాణిజ్య భాగస్వామ్యాలు, లాజిస్టిక్స్ వ్యయాల తగ్గింపు, పారిశ్రామిక ఉత్పత్తిని పెంచే విధానాలు (తయారీలో తెలివైన ఆటోమేషన్, స్థిరమైన సాంకేతిక పరిజ్ఞానాల వైపు పెట్టుబడిని పెంచడం వంటివి) వృద్ధి ఊపును మరింత పెంచుతాయి. వినియోగదారుల ప్రాధాన్యతలను మారడం, బలమైన డిమాండ్, పట్టణీకరణ వృద్ధికి దోహదపడే ఇతర అంశాలు. ►ఆవిష్కరణలు, పరిశోధనలకు గ్లోబల్ హబ్‌గా భారతదేశం తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఉత్పాదక రంగం, సెమీకండక్టర్ పరిశ్రమ అభివృద్ధి, పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ మద్దతు అవసరం. సెమీకండక్టర్ పరిశ్రమలో గణనీయమైన వృద్ధిని అంచనా వేస్తున్నందున పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం నుండి సమగ్రమైన, దీర్ఘకాలిక పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ను పారిశ్రామిక వర్గాలు ఆశిస్తున్నాయి. ►స్థానిక కంపెనీలకు పరిశోధనా, అభివృద్ధి రంగాల్లో మద్దతు అవసరమని సర్వేలో పాల్గొన్న 64 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. 57 శాతం మంది పరిశ్రమ వృద్ధిని ప్రోత్సహించడానికి సమర్థవంతమైన మేధో సంపత్తి హక్కుల ఫ్రేమ్‌వర్క్ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఇటువంటి వ్యూహాత్మక చర్యలు భారతదేశానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తాయని పేర్కొన్నారు. హై–టెక్నాలజీ తయారీ రంగాలలో పోటీతత్వాన్ని పెంచుతాయని అభిప్రాయపడ్డారు. ►ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ఆధునిక వ్యాపారానికి ఆధారం అయ్యిందని, వృద్ధికి అసాధారణ అవకాశాలను అందిస్తోందని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. దాదాపు 99 శాతం మంది ఏఐ మరింత పురోగతిని ఆకాంక్షిస్తున్నారు. కాగా, 70 శాతం వినియోగ, రిటైల్ వ్యాపారాలు ఏఐ వినియోగాన్ని నియంత్రించడానికి ప్రభుత్వ మద్దతును కోరుతున్నారు. డేటా అంశాల్లో నైతిక విధానాలను ఖచ్చితంగా పాటించాలని నొక్కి చెబుతున్నారు. ►4.0 సాంకేతికతలను (ఏఐ, ఎంఎల్, ఎన్ఎల్పీ, కంప్యూటర్ విజన్) అమలు చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని పరిశ్రమ పెద్దలు అంచనా వేస్తున్నారు, దానితో పాటు మరిన్ని నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలలో నిరంతర ప్రయత్నాలతో పాటు, ముఖ్యంగా టైర్–2, 3 నగరాల్లో మానవ, సాంకేతిక నైపుణ్యాన్ని పెంచడం అవసరమని అభిప్రాయపడుతున్నారు. ►భారతదేశ వృద్ధిని ప్రోత్సహించడానికి, స్థిరమైన వ్యాపార విస్తరణకు, దేశంలోకి మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి పన్ను ఖచ్చితత్వం అవసరమని 80 శాతం మంది పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. ►భౌగోళిక ఉద్రిక్తతల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ ప్రతికూల ప్రభావాలను తగ్గించడంలో భాగంగా, జీ 20 దేశాలు సమన్వయంతో పనిచేయాలని, సరఫరాల చైన్‌ను క్రమబద్దీకరించాలని పారిశ్రామికవేత్తలు ఉద్ఘాటించారు. ►పునరుత్పాదక శక్తి ప్రాముఖ్యతను 100 శాతం మంది ఉద్ఘాటించారు. సాంకేతిక ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నైపుణ్యం పెంపుదల, పర్యావరణ– సామాజిక–కార్పొరేట్ గవర్నెన్స్ (ఈఎస్జీ)వ్యూహాలు, కార్యక్రమాలలో పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని కార్పొరేట్ భావిస్తోంది. డిజిటలైజేషన్ సాధికారతకు ప్రాధాన్యత సవాళ్లు, అవకాశాలకు సంబంధించి సర్వేలో వ్యక్తమైన అభిప్రాయాలను మేము పరిశీలించినప్పుడు, దేశం డిజిటలైజన్ సాధికారతను సాధించాల్సిన అవశ్యత ఎంతో ఉందన్న విషయం స్పష్టమైంది. ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఆవిర్భవించే బాటలో ఆవిష్కరణలు, భాగస్వామ్యాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. దేశంలో వ్యాపారాన్ని సులభతరం చేయడానికి, తద్వారా ప్రపంచ వేదికపై భారత్ చెరగని ముద్ర వేయడానికి సంయుక్తగా, వ్యూహాత్మకంగా, సాంకేతికంగా తగిన చర్యలకు మేము సిద్ధంగా ఉన్నాము. – సంజయ్ కుమార్, డెలాయిట్ ఇండియా ప్రస్తుతం ఐదవ స్థానంలో.. 1980–81లో భారత్ ఎకానమీ పరిమాణం 189 బిలియన్ డాలర్లు. దశాబ్దకాలం గడిచే సరికి ఈ విలువ 326 బిలియన్ డాలర్లకు చేరింది. 2000–01 నాటికి 476 బిలియన్ డాలర్లకు ఎగసింది. 2010–11 నాటికి ఈ విలువ 1.71 ట్రిలియన్ డాలర్లకు చేరగా, 2020–21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 2.67 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారింది. 2022–23 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ఈ విలువ 3.75 ట్రిలియన్ డాలర్లు. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ ఐతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా (3.75 ట్రిలియన్ డాలర్లు) కొనసాగుతున్న భారత్ తలసరి ఆదాయం దాదాపు 1,183 డాలర్లుగా (రూ.98, 374) అంచనా. 2047 నాటికి ఈ పరిమాణం 18,000 డాలర్లకు పెరగాలన్నది లక్ష్యం. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకనామగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. కాగా, 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్‌లను అధిగమించగా, 2023 నాటికి జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక సూత్రాల ప్రకారం... తలసరి ఆదాయం 1,036 డాలర్ల నుంచి 4,045 డాలర్ల మధ్య ఉన్న దేశాన్ని దిగువ మధ్య తరగతి ఆదాయ దేశంగా పరిగణిస్తారు. 4046 డాలర్ల నుంచి 12,535 డాలర్ల మధ్య ఆదాయ దేశాలను ఎగువ మధ్య తరగతి ఆదాయ దేశాలుగా పేర్కొంటారు. 12,000 డాలర్ల తలసరి ఆదాయం దాటితే అది అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. భారత్ 2047 నాటికి (స్వాతంత్య్రం సాధించి 100 సంవత్సరాలు) 30 ట్రిలియన్ డాలర్ల అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారేందుకు నీతి ఆయోగ్ విజన్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేస్తోంది. ఈ విజన్ డాక్యుమెంట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది. విజన్ డాక్యుమెంట్– 2047 భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి అవసరమైన సంస్థాగత, నిర్మాణాత్మక మార్పులను సంస్కరణలను నిర్దేశించనుంది. దిగువ మధ్య ఆదాయ స్థితి నుంచి దేశ పురో గతి విజన్ 2047 ప్రధానంగా నిర్దేశించుకుంది. -
గుజరాత్లో పంజాబ్ ఫార్ములాను ఫాలో అవుతున్న కేజ్రీవాల్..
గాంధీనగర్: ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిగా ఎవరుండాలని ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్. ఈ సర్వేలో భగవంత్ మాన్‌కే అందరూ పట్టంగట్టారు. దీంతో ఆయన్నే తమ సీఎం అభ్యర్థిగా ప్రకటించారు కేజ్రీవాల్. అనంతరం ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. ఢిల్లీ తర్వాత పంజాబ్‌లో జెండా ఎగురవేసింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లోనూ పంజాబ్ ఫార్ములానే రిపీట్ చేస్తున్నారు కేజ్రీవాల్. సీఎం అభ్యర్థిని ఎన్నుకునే ఛాయిస్‌ను అక్కడి ప్రజలకే ఇచ్చారు. శనివారం మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. గుజరాత్లో ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరుంటే బాగుంటుందో నవంబర్ 3లోగా చెప్పాలని ఓ ఫోన్ నంబర్, ఈమెయిల్ ఇచ్చారు. అలాగే గుజరాత్లో అధికార బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. వచ్చే ఐదేళ్లకు ఆ పార్టీ వద్ద ఎలాంటి ప్రాణాళిక లేదన్నారు. రాష్ట్రంతో పాటు దేశంలో ధరల పెరుగుదల సమస్యగా మారిందని పేర్కొన్నారు. ఏడాది క్రితం సీఎం విజయ్ రూపానిని తప్పించి భూపేంద్ర పటేల్‌ను ముఖ్యమంత్రిగా బిజేపీ నియమించిందని గుర్తు చేశారు. కానీ ఒక్కరి అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా సీఎంను మార్చారని చెప్పారు. తాము బీజేపీలా కాదని, సీఎం అభ్యర్థిని ఎంపిక చేసుకునే విషయం పూర్తిగా ప్రజలకే వదిలేస్తామని వివరించారు. గుజరాత్లో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని ఆప్ పట్టుదలతో ఉంది. అందుకే అరవింద్ కేజ్రీవాల్ తరచూ గుజరాత్లో పర్యటిస్తున్నారు. బీజేపీకి బలంగా ఉన్న హిందూ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కరెన్సీ నోట్లపై గాంధీతో పాటు లక్షీదేవి, వినాయకుడి ఫోటోలను కూడా ముద్రించాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాశారు. చదవండి: కోర్టులో మహిళా లాయర్ల సిగపట్లు.. వీడియో వైరల్.. -
టాలీవుడ్ నెం.1 హీరో ప్రభాస్.. హీరోయిన్ సమంత!
బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు ప్రభాస్. ఆ తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమా చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తున్నాయి. అయితే బహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. కానీ వీటి ప్రభావం మాత్రం ప్రభాస్ క్రేజ్‌పై పడలేదు. అంతేకాదు రెమ్యునరేషన్ కూడా పెంచాడే తప్ప తగ్గించిందే లేదు. రాధేశ్యామ్ కంటే ముందు ప్రభాస్ రెమ్యునరేషన్ రూ.100 కోట్లు. ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలకు రూ.120 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నాడట. నిర్మాతలు కూడా ప్రభాస్ డిమాండ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే ప్రభాస్ సినిమాకు హిట్ టాక్స్ వస్తే చాలు.. రూ.1000 కోట్లు వచ్చేస్తాయనే ధీమాలో వాళ్లు ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ మరో రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యంత ప్రజాదరణ పొందిన టాలీవుడ్ నటుల్లో మొదటి స్థానంలో నిలిచాడు. Ormax Stars India Loves: Most popular male Telugu film stars (Aug 2022) #OrmaxSIL pic.twitter.com/FWFwb8f5z9 — Ormax Media (@OrmaxMedia) September 15, 2022 ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ప్రతి నెల దేశంలోని సెలబ్రిటీల గురించి సర్వే నిర్వహించి..టాప్ పొజిషన్లో ఉన్న లిస్ట్‌ని విడుదల చేస్తుంది. ఈ క్రమంలో ఆగస్ట్ నెలలో అత్యంత ప్రజాదరణ పొందిన టాలీవుడ్ నటీ నటుల సర్వే జాబితాను వెల్లడించింది. హీరోల్లో ప్రభాస్, హీరోయిన్లలో సమంత మొదటి స్థానంలో నిలిచారు. ప్రభాస్ తర్వాత ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్,మహేశ్ బాబు వరుస స్థానాల్లో ఉన్నారు. హీరోయిన్లలో కాజల్, అనుష్క తర్వాతి స్థానాల్లో ఉన్నారు. Ormax Stars India Loves: Most popular female Telugu film stars (Aug 2022) #OrmaxSIL pic.twitter.com/c4RjbB3A4Y — Ormax Media (@OrmaxMedia) September 15, 2022 -
కోడలే కూతురైన వేళ
కోడలు కాదు కొరివి దెయ్యం, కుటుంబంలో చిచ్చుపెట్టి తల్లీబిడ్డల్ని వేరు చేసే గయ్యాళి, ఆమె కాలు పెట్టిన వేళావిశేషం ఏమిటో కానీ అన్నీ కష్టాలే... ఇకపై ఇలాంటి సన్నాయి నొక్కులకు కాలం చెల్లిపోయింది. ఎందుకంటే వయసు మీద పడిన అత్తమామల్ని పసిపిల్లల మాదిరిగా చూసుకోవడంలో కోడళ్లే ముందుంటున్నారని తాజా అధ్యయనంలో తేలింది. ఒక తల్లికి కూతురు ఎంత ప్రేమగా అన్ని సేవలు చేస్తుందో కోడళ్లు కూడా అంతే ప్రేమగా అత్తమామల్ని చూసుకుంటున్నరని హెల్ప్ ఏజ్ ఇండియా అధ్యయనంలో వెల్లడైంది. మంచాన పడ్డ తల్లిదండ్రుల్ని చూసుకోవాలంటే కన్న కొడుకులే విసుక్కుంటూంటే కోడళ్లు మాత్రం కూతురిలా సేవలు చేస్తున్నారని తెలిపింది. భారత్‌లో 20 నగరాల్లో 3 వేల కుటుంబాలపై ఈ సర్వే నిర్వహించారు. ఇంట్లో పెద్దవాళ్లకి అవసరమైన వంట చేయడం, వేళకు మందులు ఇవ్వడం, వారిని వాకింగ్‌కి తీసుకువెళ్లడం, వీకెండ్లలో సరదాగా ఎక్కడికైనా తీసుకువెళ్లడం వంటి పనులన్నీ 68 శాతం మంది కోడళ్లే చేస్తున్నారు. కొడుకుల్లో 51 శాతం చూస్తున్నారు. పెద్దవాళ్లకి కావల్సిన ఆర్థిక అవసరాలు తీర్చడంలో కూడా ఫస్ట్ ప్లేస్ కోడళ్లదే. తమ సంపాదనలో అత్తమామలకు ఖర్చు పెడుతున్న కోడళ్లలో 26 శాతం ఉంటే, కూతుళ్లు 23 శాతం మంది ఉన్నారని వివరించింది. -
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కష్టమే!
న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే, ఢిల్లీ గద్దెనెక్కే పార్టీల భవితవ్యం తేల్చే ప్రధాన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఒకటి. మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో 80 ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. 2014లో ఈ ఒక్క రాష్ట్రం నుంచే బీజేపీ 71 సీట్లు గెలుచుకుంది. అయితే, 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీయేతర పక్షాలు మహా కూటమిగా ఏర్పడితే బీజేపీకి కష్టమేనని, గెలుచుకునే స్థానాల సంఖ్య భారీగా తగ్గుతుందని ‘టైమ్స్ నౌ– సీఎన్ఎక్స్’ల తాజా సర్వే తేల్చింది. విపక్షంలోని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన సమాజ్‌పార్టీ (బీఎస్పీ), రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ)లు వేర్వేరుగా పోటీ చేస్తే బీజేపీ 55 సీట్లు గెలుచుకోగలదు కానీ, ఆ పార్టీలు కలిసి మహా కూటమిగా ఏర్పడి పోటీ చేస్తే మాత్రం బీజేపీ 31 స్థానాలకే పరిమితమవుతుందని, విపక్ష కూటమి 49 సీట్లలో గెలుస్తుందని ఆ సర్వే తేల్చింది. అంటే, వేర్వేరుగా పోటీ చేసినా బీజేపీ గెలిచే స్థానాల సంఖ్య 2014 కన్నా 16 సీట్లు తక్కువే కావడం గమనార్హం. కాంగ్రెస్‌ను కాదని ఎస్పీ, బీఎస్పీలు మాత్రమే జట్టుకడితే ఆ కూటమి 33 స్థానాలు, కాంగ్రెస్ రెండు స్థానాలు గెలుచుకుంటాయని, 45 సీట్లలో బీజేపీ విజయం సాధిస్తుందని పేర్కొంది. -
భూసార పరీక్షలకనుగుణంగా పంటలు వేయాలి
2,700 మట్టి నమూనాల సేకరణ నాలుగు మండలాల్లో సర్వే యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ విద్యార్థి శిలేదార్ సంహిత జ్యోతినగర్: భూసార పరీక్షలకనుగుణంగా పంటలు వేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ విద్యార్థిని శిలేదార్ సంహిత అన్నారు. ఎన్టీపీసీ కష్ణానగర్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మిచిగాన్ యూనివర్సిటీకి చెందిన ఎనిమిదిమంది విద్యార్థుల బృందం ‘బిగ్ డేటా–స్మాల్ ఫార్మర్స్’ అనే అంశంపై పెద్దపల్లి, కమాన్‌పూర్, మంథని, రామగుండం మండలాలలో సర్వే చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 3,600 మంది రైతుల సమాచారంతోపాటు 2,700 మట్టి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎకరాకు పత్తి దిగుబడి 200 కిలోల దిగుబడి వస్తుందని, 98శాతం మంది రైతులు భూసార పరీక్షలు చేయకుండానే పంట సాగుచేయడంతో ఆశించిన దిగుబడి రాలేదని వివరించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువపంట దిగుబడి చేసేందుకు రైతులకు సాయం చేసేందుకు సర్వే చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో రీసెర్చ్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ దహగామ ఉమామహేశ్వర్ పాల్గొన్నారు.