70 ప్లస్... తగ్గేదేల్యా!.. ఫొటో వైరల్
గోవాలో గ్రామీణ బామ్మలు సర్ఫ్బోర్డులతో సర్ఫింగ్కు వెళితే? అనే ఊహను ఏఐ సాంకేతికతతో నిజం చేసిన ఫొటో వైరల్ అవుతోంది. ఆశిష్ జోస్ అనే యూజర్ ఈ ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ‘నానీస్ ఎట్ ది బీచ్’ అని క్యాప్షన్ ఇచ్చిన ఈ ఫోటోపై యూజర్స్ నుంచి రకరకాల కామెంట్స్ వచ్చాయి.
‘ఫొటో కాదు. బామ్మలు నిజంగానే సర్ఫింగ్ చేస్తే ఎంత బాగుండేదో’ అని ఒకరు కామెంట్ రాస్తే, మరొకరు ‘వెండి వొరెల్ వీడియో చూడండి చాలు’ అని సలహా ఇచ్చారు. టెక్సాస్కు చెందిన వెండి వొరెల్ వయసు 70 సంవత్సరాల పైమాటే. ఈ వయసులోనూ సర్ఫింగ్ చేస్తూ ‘ఉమెన్ ఆఫ్ ది వేవ్’గా పేరు తెచ్చుకొని ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతోంది.
చదవండి: ఈమె దెయ్యమా.. మనిషా..? అనుమానం వస్తే తప్పులేదు.. ఎందుకంటే?