సర్ఫింగ్ క్రీడ పేరు పెట్టుకున్న కంటి జబ్బు ‘సర్ఫర్స్ ఐ’!
మెడిక్షనరీ
‘సర్ఫ్ బోర్డ్’ అనే చిన్న చెక్కపై తమను తాము బాలెన్స్ చేసుకుంటూ ఎత్తుగా లేచి తీరం వైపునకు వస్తున్న అలపై జర్రున జారుతుండే ఆట (స్పోర్ట్)ను సర్ఫింగ్ అంటారు. ఈ ఆట పేరుతోనే ఉన్న ఒక రకం కంటి జబ్బు ‘సర్ఫర్స్ ఐ’. దీన్ని వైద్య పరిభాషలో టెరీజియమ్ అని అంటారు.
కనుకొనల్లో ముక్కువైపున మనకు కనిపించే కండరం పెరుగుతూ పోయి, అది కంటి నల్లగుడ్డుకు అడ్డుగా వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో శస్త్రచికిత్స చేతి అలా అదనంగా పెరిగిన కండను కంటి వైద్యులు తొలగిస్తుంటారు.