susaidnot
-
విద్యాధరికి చేరలేక
నేలరాలిన విద్యాకుసుమం ఆరోగ్యం సహకరించక ఆత్మహత్య కన్నీటి పర్యంతమైన కుటుంబసభ్యులు ఘటనా స్థలంలో సూసైడ్‌నోట్ ఓ భగవంతుడా... ఈ రోజు చనిపోవాలనుకున్నా అందుకే నీ సమాధానం కోసం నీ ముందు చీటి వేశా.. నీ అనుమతి లభించింది. చదువంటే నాకు చాలా ఇష్టం. కానీ చదువుకునేందుకు ఆరోగ్యం సహకరించడంలేదు. కళ్ళు కనిపించడం లేదు. చేతులు పనిచేయడం లేదు. బాధతో తల పగిలిపోతోంది. ఉన్నత లక్ష్యాలను చేరాలన్న ఆశ నెరవేరడం లేదు. అందుకే శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతున్నా... ఇదీ ఓ బీఈడీ విద్యార్థిని నిర్ణయం. ఆ విషయాన్ని సూసైడ్‌నోట్‌లో రాసి క్షణంలోనే తనువు చాలించింది. - పీఎన్‌కాలనీ ఉపాధ్యాయురాలు కావాలని ఎన్నో కలలు కన్నది. తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలని తపనపడింది. కానీ ఆరోగ్యం సహకరించలేదు. విషయం కన్నవారికి చెప్పుకోలేకపోయింది. ఒత్తిడి ఎక్కువైంది. ఫలితాలు అనుకూలంగా రావని గ్రహించింది. ఇక ప్రాణం తీసుకోవడమే పరిష్కారమనుకుంది. ఉదయాన్నే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇదీ ఎచ్చెర్లలోని వేంకటేశ్వర బీఈడీ కళాశాలలో చదువున్న విద్యాధరి కథ. పొందూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న చింతమనేని గోవర్థనరావు, భార్య మంజుల, కుమారుడు సంతోష్, కుమార్తె విద్యాధరి(22)తో కలసి పట్టణంలోని ఎల్బీఎస్కాలనీలో నివాసం ఉంటున్నారు. కుమార్తె విద్యాధరి ఎచ్చెర్లలోని వేంకటేశ్వర బీఈడీ కళాశాలలో ఫైనల్ ఎగ్జామ్ రాస్తోంది. సోమవారం మొదటి పరీక్షకు హాజరైంది. సాయంత్రం ఇంటికి చేరిన ఆమె మరునాటి పరీక్షకు సన్నద్ధమవుతోంది. రాత్రి భోజనానంతరం తనగదిలోకి వెళ్లిపోయింది. మంగళవారం వేకువఝామున ఉదయం నాలుగు గంటలకే లేచి చదువుంది. ఆ సమయంలో తండ్రిని పలకరించింది. ఆమె చదువుకుంటోంది కదా అని ఆయన బయటకు వెళ్లారు. తిరిగి ఆరుగంటల సమయంలో ఎంత పిలిచినా ఆమె బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు, అన్న సంతోష్ కిటికీలోనుంచి గదిలోకి చూడగా విద్యాధరి ఉరివేసుకుని ఉండటం చూసి షాక్‌తిన్నారు. వెంటనే గదితలుపులు విరగ్గొట్టి చూడగా అప్పటికే ఆమె మృతిచెందిందని గ్రహించి గుండెలవిసేలా రోదించారు. చుదువుపై ఎంతో మక్కవగల తమ కుమార్తె ఈ విధంగా తనువు చాలించడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. కేసు నమోదు విషయం తెలుసుకున్న ఒకటవ పట్టన ఎస్సై ఇ.చిన్నంనాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని మృతిపై ఆరా తీశారు. ఆమె పెట్టిన సూసైడ్ నోట్‌ను రికార్డు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉన్న విద్యాధరి తన సూసైడ్ నోట్లో ఇష్టమైన స్నేహితులకు, ఉపాధ్యాయులకు తమ కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పడం అక్కడివారిని మరింత కలచివేసింది. తన మృతికి ఎవరూ కారణం కాదనీ స్పష్టం చేసింది. సహచర విద్యార్థినీ, విద్యార్థులు కన్నీరు పెట్టుకున్నారు. -
వేధింపులు భరించలేక..
రైలుకింద పడి యువకుడి మృతి చావుకు భార్య, అత్తింటివారే కారణమని సూసైడ్‌నోట్ మదనపల్లెక్రైం, న్యూస్‌లైన్: భార్య, అత్తామామలు వేధించడం, అమ్మనాన్నలను కలవనీయకుండా చేయడంతో తీవ్ర మనస్తాపాని కి గురైన యువకుడు రైలుకింద పడి తనువు చాలించా డు. తన చావుకు భార్య, అత్తామామలు, బావమర్ది, మరదలే కారణమని సూసైడ్ నోటు రాశాడు. అర్ధరాత్రి రైలుకిందపడి కన్నుమూశాడు. గురువారం స్థానికులు మృతదేహాన్ని చూడడంతో విషయం వెలుగులోకి వ చ్చింది. మృతుడి తండ్రి రైల్వేపోలీసులకిచ్చిన ఫిర్యాదు మేరకు.. పులిచర్ల మండలం మంగళంపేటకు చెందిన అహ్మద్‌బాషా, అస్రిఫిన్ కుమారుడు ఎస్.అక్బర్(30). ఎలక్రికల్ ఇంజినీరింగ్ చదివాడు. సీసీ కెమెరాల సర్వీసింగ్, సేల్స్ చేసేవాడు. ఐదేళ్లక్రితం పీలేరుకు చెందిన సయ్యద్ బాషా, ప్యారిజాన్ దంపతుల కుమార్తె హసీనాను వివాహం చేసుకున్నాడు. వీరికి సొహైల్ అనే మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. హసీనాకు అత్తామామలతో పడేదికాదు. వేరు కాపురం పెట్టాలని భర్తను టార్చర్ పెట్టేది. అక్బర్ అత్తామామలు సైతం అల్లుడిని పలుమార్లు తిట్టారు. ఇలా ఐదేళ్లలో పలుపర్యాయాలు గొడవపడి విడాకుల వరకు వెళ్లారు. ఆపై మూడు నెలలుగా మదనపల్లె ప్యారానగర్లో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. అయినా హసీనాలో మార్పు రాలేదు. భర్తను తరచూ వేధించడం, తల్లిదండ్రులతో మాట్లాడనీయకుండా చేయడం వంటిది చేసేది. దీంతో జీవితంపై విరక్తి చెందిన అక్బర్ బుధవారం రాత్రి భార్యతో గొడవపడి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. అర్ధరాత్రి సమయంలో సీటీఎం రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. తన భార్య టార్చర్చేస్తుండడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్‌నోట్ రాశాడు. కుమారుడు సొహైల్‌ను క్షమించమని, ఐలవ్యూ, ఐమిస్‌యూ రాఅని, తన మృతదేహాన్ని తల్లిదండ్రులకు మాత్రమే అప్పగించాలని సూచించాడు. రాత్రి 2గంటల ప్రాంతంలో సీటీఎం స్టేషన్‌కు కూతవేటు దూరంలో పట్టాలపై పడుకున్నాడు. రైలు అతనిమీద వెళ్లడంతో శరీరం రెండు ముక్కలైంది. ఉదయాన్నే స్థానికులు గమనించి రైల్వేసిబ్బందికి తెలియజేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదుచేశారు. మృతదేహం సమీపంలో పడిన సెల్‌ఫోన్ ఆధారంగా మొదట బంధువులకు సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న మృతుడి తల్లిదండ్రులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలిపించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.