- రైలుకింద పడి యువకుడి మృతి
- చావుకు భార్య, అత్తింటివారే కారణమని సూసైడ్‌నోట్
మదనపల్లెక్రైం, న్యూస్‌లైన్: భార్య, అత్తామామలు వేధించడం, అమ్మనాన్నలను కలవనీయకుండా చేయడంతో తీవ్ర మనస్తాపాని కి గురైన యువకుడు రైలుకింద పడి తనువు చాలించా డు. తన చావుకు భార్య, అత్తామామలు, బావమర్ది, మరదలే కారణమని సూసైడ్ నోటు రాశాడు. అర్ధరాత్రి రైలుకిందపడి కన్నుమూశాడు. గురువారం స్థానికులు మృతదేహాన్ని చూడడంతో విషయం వెలుగులోకి వ చ్చింది.
మృతుడి తండ్రి రైల్వేపోలీసులకిచ్చిన ఫిర్యాదు మేరకు.. పులిచర్ల మండలం మంగళంపేటకు చెందిన అహ్మద్‌బాషా, అస్రిఫిన్ కుమారుడు ఎస్.అక్బర్(30). ఎలక్రికల్ ఇంజినీరింగ్ చదివాడు. సీసీ కెమెరాల సర్వీసింగ్, సేల్స్ చేసేవాడు. ఐదేళ్లక్రితం పీలేరుకు చెందిన సయ్యద్ బాషా, ప్యారిజాన్ దంపతుల కుమార్తె హసీనాను వివాహం చేసుకున్నాడు. వీరికి సొహైల్ అనే మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. హసీనాకు అత్తామామలతో పడేదికాదు.
వేరు కాపురం పెట్టాలని భర్తను టార్చర్ పెట్టేది. అక్బర్ అత్తామామలు సైతం అల్లుడిని పలుమార్లు తిట్టారు. ఇలా ఐదేళ్లలో పలుపర్యాయాలు గొడవపడి విడాకుల వరకు వెళ్లారు. ఆపై మూడు నెలలుగా మదనపల్లె ప్యారానగర్‌లో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. అయినా హసీనాలో మార్పు రాలేదు. భర్తను తరచూ వేధించడం, తల్లిదండ్రులతో మాట్లాడనీయకుండా చేయడం వంటిది చేసేది. దీంతో జీవితంపై విరక్తి చెందిన అక్బర్ బుధవారం రాత్రి భార్యతో గొడవపడి ఇంట్లోంచి వెళ్లిపోయాడు.
అర్ధరాత్రి సమయంలో సీటీఎం రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. తన భార్య టార్చర్‌చేస్తుండడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్‌నోట్ రాశాడు. కుమారుడు సొహైల్‌ను క్షమించమని, ఐలవ్‌యూ, ఐమిస్‌యూ రాఅని, తన మృతదేహాన్ని తల్లిదండ్రులకు మాత్రమే అప్పగించాలని సూచించాడు. రాత్రి 2గంటల ప్రాంతంలో సీటీఎం స్టేషన్‌కు కూతవేటు దూరంలో పట్టాలపై పడుకున్నాడు.
రైలు అతనిమీద వెళ్లడంతో శరీరం రెండు ముక్కలైంది. ఉదయాన్నే స్థానికులు గమనించి రైల్వేసిబ్బందికి తెలియజేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదుచేశారు. మృతదేహం సమీపంలో పడిన సెల్‌ఫోన్ ఆధారంగా మొదట బంధువులకు సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న మృతుడి తల్లిదండ్రులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలిపించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.