కీచక అధికారి సస్పెన్షన్
గుంటూరు(పట్నంబజారు): జిల్లా పోలీసు కార్యాలయంలో మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడిన అధికారి కరీముల్లాను సస్పెండ్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయం మినిస్టిరీయల్ సిబ్బంది కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ మహిళను కరీముల్లా లైంగిక వేధింపులకు గురి చేశాడు. దీంతో ఈ నెల 6వ తేదీన ఆమె పోలీసు కార్యాలయంలో ఎలుకల మందు తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇదే విషయమై ఆమె నుంచి స్టేట్మెంట్ స్వీకరించిన నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు కరీముల్లాను సస్పెండ్ చేశారు.