Suvarna
-
డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు సువర్ణ ఎంపిక
శ్రీకాకుళం: వరుసగా రెండో ఏడాది కూడా పరపటి సువర్ణ గ్రూప్–1 పోస్టు కొట్టేశారు. 2022 గ్రూప్–1 పరీక్షల్లో సత్తా చాటి జిల్లా కేంద్రంలో జిల్లా వైద్యారో గ్య శాఖ కార్యాలయ పరిపాలనాధికారి (ఏఓ)గా బాధ్యత స్వీకరించి, శిక్షణలో ఉండగానే మళ్లీ తాజా గా ప్రకటించిన గ్రూప్–1 పరీక్షల్లో ఏకంగా డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు ఎంపికై రికార్డు సృష్టించారు. సంతబొమ్మాళి మండలం ఆకాశలక్కవరం గ్రామానికి చెందిన పరపటి ధర్మారావు కుమార్తె సువర్ణ ఉస్మానియా యూనివర్సిటీలో జాగ్రఫీలో పీజీ పూర్తి చేశా రు. అనంతరం సివిల్స్‌కు ప్రిపేర్ అవుతుండగా, 2022లో తొలి ప్రయత్నంలోనే గ్రూప్–1కు అర్హత సాధించారు. అనంతరం మళ్లీ తాజాగా డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. కలెక్టర్‌గా చూడాలన్నది నాన్న కల నన్ను కలెక్టర్‌గా చూడాలన్న నాన్న కల నెరవేర్చుతాను. ప్రస్తుతానికి రెండు సార్లు వరుసగా గ్రూప్–1 పోస్టులు సాధించాను. తాజాగా డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. సివిల్స్ ర్యాంకు సాధించడమే లక్ష్యంగా చదువుతాను. – సువర్ణ, గ్రూప్–1 విజేత -
వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు
నారాయణఖేడ్ : గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం కొనసాగిస్తున్న ఓ గృహంపై పోలీసులు దాడి చేసి నిందితులను అరెస్టు చేశారు. సీఐ ముని కథనం మేరకు.. గురువారం పట్టణ బైపాస్ రోడ్డులో గల వాటర్ ట్యాంకు వద్ద ఉన్న సువర్ణ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందని సమాచారం అందిందన్నారు. దీంతో దాడులు నిర్వహించి సువర్ణ, సత్యమ్మలతో పాటు బాధితులు రేణుక, రామవ్వ విటుడు సర్దార్ రవిలను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఖేడ్‌కు చెందిన సువర్ణ, సత్యమ్మలు ఇద్దరు కలిసి సువర్ణ గృహంలో వ్యభిచారం జరుపుతున్నారని విచారణలో వెల్లడైందన్నారు. ర్యాలమడుగుకు చెందిన రేణుక, రామవ్వలను వ్యభిచారంలోకి దింపారని, దాడులు సమయంలో ఇంట్లో రూ.5 వేల నగదు, 6 సెల్ఫోన్లు, కండోమ్ ప్యాకెట్లు, బీరు, కల్లు సీసాలు లభించగా వాటిని సీజ్ చేసినట్లు సీఐ వివరించారు. సువర్ణ, సత్యమ్మ, రవిలపై పిటా యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్టు తెలిపారు. రేణుక, రామవ్వలను సంగారెడ్డిలోని రెస్క్యూ హోంకు తరలిస్తామని తెలిపారు. ఖేడ్ సర్కిల్లో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే ప్రజలు వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. దాడుల్లో ఎస్ఐలు సునీల్, శ్రీనివాస్, పోలీసు సిబ్బంది ఉన్నారని సీఐ పేర్కొన్నారు. -
భార్య చేతిలో భర్త హత్య
ఆళ్లగడ్డ రూరల్: అహోబిలం అడవుల్లో దారుణం జరిగింది. ప్రియుడి మోజులో పడిన భార్య తాళి కట్టిన భర్తనే కడతేడ్చింది. వారం రోజుల తర్వాత ఈ విషయం బుధవారం వెలుగు చూడటంతో కలకలం రేపింది. చాకరాజువేముల గ్రామానికి చెందిన కంబయ్య(32) హత్య చేయబడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..దొర్నిపాడు మండలం చాకరాజువేముల గ్రామానికి చెందిన తంబయ్య(32)కు పదకొండేళ్ల క్రితం డబ్ల్యూ కొత్తపల్లె గ్రామానికి చెందిన సువర్ణతో వివాహం జరిగింది. దంపతులిద్దరు కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగించేవారు. వీరికి తొమ్మిది ఏళ్ల సుధారాణి, ఐదు సంవత్సరాల దస్తగిరమ్మ సంతానం. ఈనెల 16న తంబయ్యకు అరోగ్యం బాగాలేదని భార్య సువర్ణ ఆళ్లగడ్డకు తీసుకెళ్లి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించింది. ఆ తర్వాత సువర్ణ ఒంటరిగా రాత్రికి గ్రామానికి చేరుకుంది. నా కొడుకు ఎక్కడ అని అత్త ఈశ్వరమ్మ కోడలను ప్రశ్నించగా ఎక్కడికి వెళ్లాడో తనకు తెలియదు, ఇంతవరకు ఎదురుచూసి ఇంటికొచ్చానని సమాధానం చెప్పింది. రెండు రోజులైనా కొడుకు ఇంటికి రాకపోవడంతో తల్లి దండ్రులు చుట్టు పక్కల గ్రామాల్లో వెతికారు. అయినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఈ నెల 21న దొర్నిపాడు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసును ఆళ్లగడ్డ స్టేషన్‌కు బదిలి చేశారు. అయితే బుధవారం అహోబిలం అడవిలోని గండ్లేరు వాగులో గుర్తు తెలియన మృతదేహం ఉన్నట్లు పొలపర్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆళ్లగడ్డ సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్ఐలు రమేష్‌బాబు, నవీన్‌బాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మిస్సింగ్ కేసుగా నమోదైన తంబయ్య తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు తమ కుమారుడిగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. భార్యనే కడతేడ్చింది.. తంబయ్య కనిపించకపోవడంతో కేసు నమోదు చేసుకున్న ఆళ్లగడ్డ పోలీసులు భార్యపై అనుమానం వచ్చి ఆమె కాల్ డేటాను పరిశీలించగా నేరం అంగీకరించింది. సువర్ణకు కోటకందుకూరు గ్రామానికి చెందిన కిట్టు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. భర్తను అసుపత్రి తీసుకెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి ఆళ్లగడ్డకు బయలుదేరారు. ఆ తర్వాత భర్తకు నిద్రమాత్రలు మింగించి ప్రియుడు కిట్టుతో కలిసి అటోలో అహోబిలం అడవిలోని గండ్లేరు వాగులోనికి తీసుకెళ్లారు. నిద్ర మత్తులో ఉన్న తంబయ్యను బండరాయిలో మోది హతమార్చారు. తంబయ్యను హత్య చేసిన సువర్ణ, ఆమె ప్రియుడు కిట్టులను ఆళ్లగడ్డ పోలీసులు అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం.