ఆళ్లగడ్డ రూరల్: అహోబిలం అడవుల్లో దారుణం జరిగింది. ప్రియుడి మోజులో పడిన భార్య తాళి కట్టిన భర్తనే కడతేడ్చింది. వారం రోజుల తర్వాత ఈ విషయం బుధవారం వెలుగు చూడటంతో కలకలం రేపింది. చాకరాజువేముల గ్రామానికి చెందిన కంబయ్య(32) హత్య చేయబడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..దొర్నిపాడు మండలం చాకరాజువేముల గ్రామానికి చెందిన తంబయ్య(32)కు పదకొండేళ్ల క్రితం డబ్ల్యూ కొత్తపల్లె గ్రామానికి చెందిన సువర్ణతో వివాహం జరిగింది.
దంపతులిద్దరు కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగించేవారు. వీరికి తొమ్మిది ఏళ్ల సుధారాణి, ఐదు సంవత్సరాల దస్తగిరమ్మ సంతానం. ఈనెల 16న తంబయ్యకు అరోగ్యం బాగాలేదని భార్య సువర్ణ ఆళ్లగడ్డకు తీసుకెళ్లి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించింది. ఆ తర్వాత సువర్ణ ఒంటరిగా రాత్రికి గ్రామానికి చేరుకుంది. నా కొడుకు ఎక్కడ అని అత్త ఈశ్వరమ్మ కోడలను ప్రశ్నించగా ఎక్కడికి వెళ్లాడో తనకు తెలియదు, ఇంతవరకు ఎదురుచూసి ఇంటికొచ్చానని సమాధానం చెప్పింది. రెండు రోజులైనా కొడుకు ఇంటికి రాకపోవడంతో తల్లి దండ్రులు చుట్టు పక్కల గ్రామాల్లో వెతికారు. అయినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఈ నెల 21న దొర్నిపాడు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసును ఆళ్లగడ్డ స్టేషన్‌కు బదిలి చేశారు.
అయితే బుధవారం అహోబిలం అడవిలోని గండ్లేరు వాగులో గుర్తు తెలియన మృతదేహం ఉన్నట్లు పొలపర్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆళ్లగడ్డ సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్‌ఐలు రమేష్‌బాబు, నవీన్‌బాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మిస్సింగ్ కేసుగా నమోదైన తంబయ్య తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు తమ కుమారుడిగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
భార్యనే కడతేడ్చింది..
తంబయ్య కనిపించకపోవడంతో కేసు నమోదు చేసుకున్న ఆళ్లగడ్డ పోలీసులు భార్యపై అనుమానం వచ్చి ఆమె కాల్ డేటాను పరిశీలించగా నేరం అంగీకరించింది. సువర్ణకు కోటకందుకూరు గ్రామానికి చెందిన కిట్టు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. భర్తను అసుపత్రి తీసుకెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి ఆళ్లగడ్డకు బయలుదేరారు. ఆ తర్వాత భర్తకు నిద్రమాత్రలు మింగించి ప్రియుడు కిట్టుతో కలిసి అటోలో అహోబిలం అడవిలోని గండ్లేరు వాగులోనికి తీసుకెళ్లారు. నిద్ర మత్తులో ఉన్న తంబయ్యను బండరాయిలో మోది హతమార్చారు. తంబయ్యను హత్య చేసిన సువర్ణ, ఆమె ప్రియుడు కిట్టులను ఆళ్లగడ్డ పోలీసులు అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం.
భార్య చేతిలో భర్త హత్య
Published Thu, Jul 24 2014 12:33 AM | Last Updated on Sat, Sep 2 2017 10:45 AM
Advertisement
Advertisement