SUZUKI GIXXER
-
సుజుకి జిక్సెర్ కొత్త బైక్..
సాక్షి, న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థ సుజుకి మోటార్ కార్పొరేషన్ శుక్రవారం సరికొత్త సుజుకి జిక్సెర్‌ను లాంచ్ చేసింది. 155 సీసీ ఇంజీన్, ఏబీఎస్ టెక్నాలజీతో ఈ బైక్‌ను ఆవిష్కరించింది. దీని ధరను రూ .1 లక్ష (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించింది. కొత్త సుజుకి జిక్సెర్‌లో 155 సిసి, ఫోర్-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్షన్, ఎస్ఈపీ, టెక్నాలజీతో ఎయిర్-కూల్డ్ ఇంజిన్ లాంటివి స్పెషల్ ఫీచర్లుగా ఉన్నాయి. షార్ప్ స్టైలింగ్ లో క్రచ్‌డ్ సిల్హౌట్ తో వస్తుంది. రూపొందించిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, విలక్షణమైన ఫ్రంట్ అండ్ రియర్ కాంబినేషన్ ఎల్ఇడి హెడ్లైట్లను ప్రత్యేకంగా అమర్చింది. కొత్త సుజుకి జిక్సెర్ మూడు రంగులలో లభించనుంది. సుజుకి మోటార్ సైకిల్ ఇండియా బలమైన వేగంతో వృద్ధి చెందుతోంది, ప్రధానంగా తాజా సుజుకి జిక్సెర్ మోటారు సైక్లింగ్ అభిమానులను ఆహ్లాదపరుస్తుందనీ, కొత్త ఉత్సాహాన్ని, విశ్వాసాన్నిస్తుందని తాము నమ్ముతున్నామని సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ దేవాషిష్ హండా అన్నారు. -
సుజుకి 'జిక్సర్' ఆ దేశానికి వెళ్తోంది!
ఇండియాకు చెందిన సుజుకి మోటార్ కార్పొరేషన్ యూనిట్ సుజుకి మోటార్ సైకిల్ ప్రైవేట్ లిమిటెడ్, స్థానికంగా తయారుచేసిన జిక్సర్ బైక్‌ను తన స్వదేశానికి తరలిస్తోంది. భారత మార్కెట్లో తయారుచేసిన ఈ బైక్‌ను జపాన్ మార్కెట్‌కు ఎగుమతి చేస్తున్నట్టు సుజుకి మోటార్ సైకిల్ వెల్లడించింది. తమ మొదటి కన్సైన్మెంట్(ఒప్పందం) కింద ఇప్పటికే మేడిన్ ఇండియా జిక్సర్ మోటార్‌సైకిళ్లను ఇండియా నుంచి జపనీస్ మార్కెట్‌కు తరలించామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. లాటిన్ అమెరికా లాంటి ఇతర సరిహద్దు దేశాలకు జిక్సర్ బైక్ ను కంపెనీ ఎగుమతి చేస్తుందని సుజుకి మోటార్‌సైకిల్ మేనేజింగ్ డైరెక్టర్ సతోషి ఉచిడా తెలిపారు. జపనీస్ వినియోగదారుల నుంచి కూడా జిక్సర్కు మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 155 సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ విత్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్‌లు దీనిలో ఉన్నాయి. జపాన్‌కు ఎగుమతిచేస్తున్న జిక్సర్‌లో ప్యూయల్ ఇంజెక్షన్, రియర్ డిస్క్ బ్రేక్‌లు అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది.