సుజుకి 'జిక్సర్' ఆ దేశానికి వెళ్తోంది!
సుజుకి 'జిక్సర్' ఆ దేశానికి వెళ్తోంది!
Published Thu, Jan 19 2017 6:06 PM | Last Updated on Tue, Sep 5 2017 1:37 AM
ఇండియాకు చెందిన సుజుకి మోటార్ కార్పొరేషన్ యూనిట్ సుజుకి మోటార్ సైకిల్ ప్రైవేట్ లిమిటెడ్, స్థానికంగా తయారుచేసిన జిక్సర్ బైక్ను తన స్వదేశానికి తరలిస్తోంది. భారత మార్కెట్లో తయారుచేసిన ఈ బైక్ను జపాన్ మార్కెట్కు ఎగుమతి చేస్తున్నట్టు సుజుకి మోటార్ సైకిల్ వెల్లడించింది. తమ మొదటి కన్సైన్మెంట్(ఒప్పందం) కింద ఇప్పటికే మేడిన్ ఇండియా జిక్సర్ మోటార్సైకిళ్లను ఇండియా నుంచి జపనీస్ మార్కెట్కు తరలించామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
లాటిన్ అమెరికా లాంటి ఇతర సరిహద్దు దేశాలకు జిక్సర్ బైక్ ను కంపెనీ ఎగుమతి చేస్తుందని సుజుకి మోటార్సైకిల్ మేనేజింగ్ డైరెక్టర్ సతోషి ఉచిడా తెలిపారు. జపనీస్ వినియోగదారుల నుంచి కూడా జిక్సర్కు మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 155 సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ విత్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్లు దీనిలో ఉన్నాయి. జపాన్కు ఎగుమతిచేస్తున్న జిక్సర్లో ప్యూయల్ ఇంజెక్షన్, రియర్ డిస్క్ బ్రేక్లు అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది.
Advertisement
Advertisement