SV Sateesh kumar reddy
-
‘జబర్దస్త్ స్కిట్లు.. బాబు, పవన్ వెకిలి నవ్వులు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అసెంబ్లీ సమావేశాల ముగింపు సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వెటకారంగా నిర్వహించారని.. కేవలం మాజీ సీఎం వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా, వెటకారంగా నిర్వహించారు అనేది ప్రజలందరూ చూశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సతీష్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన కడప వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జబర్దస్త్ కార్యక్రమంలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారంటూ దుయ్యబట్టారు.‘‘జీవితంలో ఎప్పుడు నవ్వని చంద్రబాబు వెకిలి నవ్వులు నవ్వారు. కనీస సంస్కారం లేకుండా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు వెకిలి నవ్వులు ఎందుకు?. కేవలం జగన్‌ను హేళన చేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారా?. ఇవన్నీ మానుకుంటే చంద్రబాబుకు బాగుంటుంది. సిగ్గు లేకుండా, హుందాతనం లేకుండా ప్రవర్తించిన గ్రీష్మ అనే మహిళకు ఏ విధంగా ఎమ్మెల్సీ ఇచ్చావో స్పష్టం చేయాలి. టీడీపీలో ఎంతో మంది సీనియర్లు, నాయకులను కాదని రౌడీలకు పదవులా?’’ అంటూ సతీష్‌రెడ్డి నిలదీశారు.‘‘పులివెందుల నియోజకవర్గం నుంచి పవన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. హత్య సినిమాపై ట్రోల్ చేశారనే ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చిన సినిమాలోని సన్నివేశాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అదుపులోకి తీసుకుంటారా?. వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ ఫిర్యాదు చేస్తే పోలిసులు స్పందించడం దారుణం. టీడీపీ, జనసేన నాయకులకు సిగ్గు లేదు. వైఎస్సార్సీపీ నాయకులు హుందాతనంతో ప్రవర్తిస్తారు. సనాతన ధర్మం గురించి పవన్ కల్యాణ్ మాట్లాడటం సిగ్గుచేటు. ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు, పవన్ కల్యాణ్ అపహస్యం చేశారు’’అని సతీష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఆదుకోకుండా శాపనార్థాలా?
ఏపీ శాసన మండలిలో పలువురు సభ్యులు ధ్వజం సాక్షి, హైదరాబాద్: ప్రకృతి కోపగిస్తే ఆదుకోవాల్సిన ప్రభుత్వం రైతాంగాన్ని శాపనార్ధాలు పెడితే ఎలా అని ఏపీ శాసనమండలిలో పలువురు సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తారు. ఏపీలో నెలకొన్న కరువు పరిస్థితిపై శాసన మండలిలో శుక్రవారం స్వల్పకాలిక చర్చ జరిగింది. మండలిలో చర్చ ప్రారంభమైనా ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖను పర్యవేక్షిస్తున్న ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, అధికారులు సభలో లేకపోవటంపై మండలి వైస్ చైర్మన్ ఎస్.వి.సతీష్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్య క్తం చేశారు. ఆయన సూచనతో పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ వెంటనే అధికారులను రప్పించి చర్చను కొనసాగించారు. బ్యాంకు రుణాలు చెల్లించొద్దంటూ పదేపదే ప్రకటనలు చేసి ప్రభుత్వం రైతులను మోసం చేసిందని కాంగ్రెస్ పక్ష నేత సి.రామచంద్రయ్య పేర్కొన్నారు. పంటలు పండక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం కనీసం వాటిని నమోదు చేయడానికి కూడా ఇష్టపడటం లేదన్నారు. అనంతపురం జిల్లా రైతులను ఆదుకునేందుకు బీమా విధానంలో మార్పులు తేవాలని టీడీపీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కోరారు. ఆధార్ కార్డులు లేని వారికి ప్రభుత్వం ఉచిత విద్యుత్ కట్ చేస్తే రైతు ఆత్మహత్యలు మరింత పెరిగే ప్రమాదముందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు బ్యాంకు ల్లో అప్పులు కూడా పుట్టడం లేదన్నారు. ఉపాధి హామీ పని దినాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని వామపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ ఆరోపించారు. తాగునీటి కోసం చిత్తూరు జిల్లాలో నిర్మించ తలపెట్టిన కండలేరు ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని కాంగ్రెస్ సభ్యుడు రెడ్డెపరెడ్డి డిమాండ్ చేశారు.