Svaiping Mission
-
కరెన్సీ కష్టాలకు చెక్
స్వశక్తి మహిళా సంఘం ఆధ్వర్యంలో మినీ బ్యాంక్ ఏర్పాటు హుస్నాబాద్: నగదు కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్న వారి ఇబ్బందులను ఓ మహిళా సంఘం తీర్చి ఆదుకుంటోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం (ఎస్)లోని స్వశక్తి మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రాబ్యాంకు సహకారంతో మినీబ్యాంకు ఏర్పాటు చేశారు. శనివారం బ్యాంకులు బంధ్ కావడంతో గ్రామస్తులు నగదు కోసం ఇక్కడ బారులుదీరారు. స్వశక్తి మహిళలు పొదుపు, రుణాల చెల్లింపులను ఈ బ్యాంకు (స్వైపింగ్ మిషన్) ద్వారానే లావాదేవీలు నిర్వహిస్తున్నారు. గ్రామంలో ఏటీఎం కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ మినీబ్యాంకు ద్వారా రూ.2 వేలు నగదు చెల్లిస్తున్నారు. ఈ విధానం పెద్దనోట్ల రద్దుకు ముందే ఉందని.. అయితే, ఇప్పుడు అది గ్రామస్తులకు బాగా ఉపయోగపడుతోందని సంఘం సీఏ కనకతార తెలిపారు. -
జాడ లేని చిన్న నోటు
-
జాడ లేని చిన్న నోటు
- వచ్చిన కరెన్సీ రూ.15,902 కోట్లు... అందులో 95.84 శాతం పెద్ద నోట్లే - జనం జమ చేసింది రూ.55 వేల కోట్లు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో చిన్న నోట్ల కొరత రోజురోజుకు తీవ్రతరమవుతోంది. మార్కెట్లో నగదు కొరతకు తోడు కొత్తగా చలామణిలోకి వచ్చిన రూ.2,000 నోట్ల కారణంగా చిన్న నోట్లకు డిమాండ్ గణనీయంగా పెరగడం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం పదేపదే విజ్ఞప్తి చేసినా రిజర్వు బ్యాంక్ నుంచి సరిపడేంత నగదు రాలేదు. పైపెచ్చు వచ్చిన కొద్దిపాటి కరెన్సీలో చిన్న నోట్లు లేకపోవటం కొత్త సంక్షోభానికి దారితీస్తోంది. నవంబర్ 8న కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసిన నాటినుంచి మొదలుకుని శుక్రవారం వరకు తెలంగాణకు ఆర్బీఐ రూ.15,902 కోట్ల విలువైన కరెన్సీని పంపింది. ఇందులో అత్యధికం, అంటే రూ.15,241 కోట్ల మేరకు రెండు వేల రూపాయల నోట్లే వచ్చాయి. రూ.240 కోట్ల విలువైన కొత్త 500 నోట్లు, రూ.376 కోట్ల విలువైన వంద నోట్లు, రూ.22 కోట్ల విలువైన 50 రూపాయల నోటు, రూ.20 కోట్ల విలువైన 20 రూపాయల నోటు, రూ.2.19 కోట్ల విలువైన పది రూపాయల నోట్లు వచ్చాయి. అంటే వచ్చిన కరెన్సీలో ఏకంగా 95.84 శాతం పెద్ద నోట్లేనన్నమాట! 4.16 శాతమే చిన్న నోట్లు వచ్చాయి. దీంతో చిరు వ్యాపారులు, కార్మి కులు, కూలీలు, రైతులు, నిరుపేదలందరికీ నిత్యావస రంగా మారిన చిన్న నోట్లకు రాష్ట్రంలో తీవ్ర కొరత నెలకొంది. తెలంగాణలోని బ్యాంకులన్నింటా ఇప్పటి వరకు దాదాపు రూ.55 వేల కోట్ల నగదు జమైనట్లు ఆర్బీఐ వర్గాలు చెబుతున్నాయి. అందులో కనీసం మూడో వంతు నగదును కూడా మార్పిడి చేయకపోవడంతో ప్రజల ఇబ్బందులు యథాతథంగా కొనసాగుతున్నాయి. రెట్టింపైన డిజిటల్ లావాదేవీలు నగదు కొరత నేపథ్యంలో తెలంగాణ నగదురహిత లావాదేవీల బాట పట్టింది. ఇంటర్నెట్, ఆన్లైన్ లావాదేవీలు గతంతో పోలిస్తే రెట్టింపైనట్టు ప్రభుత్వం అంచనా వేసింది. అయితే మొత్తం లావాదేవీల్లో ఇవి ఇప్పటికీ పది శాతమే! మొబైల్ అప్లికేషన్లు, మొబైల్ ఆధారంగా లావాదేవీలు నిర్వహించే పేటీఎం యాప్ వాడకం బాగా పెరిగింది. దాని వినియోగదారుల సంఖ్య 14 లక్షల నుంచి 40 లక్షలకు చేరిందని పేటీఎం ప్రతినిధులు ఇటీవలæ ప్రభుత్వానికి నివేదించారు. మొబైల్ బ్యాంకింగ్, కార్డు ఆధారిత చెల్లింపులు, చెక్కు లావాదేవీలను పెంచే దిశగా ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది. స్వైపింగ్ మిషన్లకు గిరాకీ రాష్ట్రంలో స్వైపింగ్ మిషన్ల వాడకం బాగా పెరి గింది. అక్టోబర్ 30 నాటికి రాష్ట్రంలో 34,677 స్వైపింగ్ మిషన్లుండగా ఇప్పుడు 50,951కి పెరిగినట్లు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి తాజాగా ప్రభుత్వానికి నివేదించింది. దాదాపు 15 లక్షలకుపైగా యం త్రాలకు డిమాండ్ ఉన్నా ఇప్పటికిప్పుడు అవసరమై నన్ని సమకూర్చే పరిస్థితి లేదని బ్యాంకర్లు తేల్చి చెప్పారు. దేశమంతటా కలిపి కూడా ఏడాదికి 4 లక్ష లకు మించి స్వైపింగ్ మిషన్లను తయారీ చేసే పరిస్థితి లేదని తయారీ కంపెనీల ప్రతినిధులు ఇటీవలే వెల్లడించారు. మరోవైపు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు బ్యాంకర్ల సహకారంతో విస్తృత ప్రచారానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. -
ఇకపై రూపే కార్డుతోనే క్రయవిక్రయాలు
విధివిధానాలు ప్రకటించిన మంత్రి హరీశ్‌రావు అధీకృత ఖాతాదారుని వేలిముద్రలు సరిపోలితేనే కరెన్సీ బదిలీ వృద్ధుల కోసం గ్రామ సమైక్య సంఘాల వద్ద నగదు, స్వైపింగ్ మిషన్ సాక్షి. సిద్దిపేట: ఇకపై రూపే కార్డుతోనే క్రయవిక్రయాలు జరుగుతాయని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రకటిం చారు. నగదురహిత లావా దేవీలను సిద్దిపేట నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రకటిం చిన నేపథ్యంలో గురువారం సిద్దిపేటలో మహిళా సమాఖ్యకు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా అధికారులు, బ్యాంకు అధికారులు, వివిధ గ్రామాల మహిళా సమాఖ్యలు ,ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి విధివిధానాలను ప్రకటించారు. ఆధారు కార్డు ఆధారంగా 18 ఏళ్లు నిండిన వారికి బ్యాంకులో ఖాతాలు తెరిచి రూపే కార్డు ఇస్తారు. ప్రతి క్రయ విక్రయం ఈ కార్డు ద్వారానే జరుగు తుంది. జన్‌ధన్ బ్యాంకు ఖాతాలతో పాటు, మహిళా సంఘాలు, పింఛనుదారులకు ప్రత్యేక స్వైపింగ్ మిషన్ రూపొందించారు. వృద్ధాప్య పింఛన్‌దారులకు రూపే కార్డు అందజేస్తారు. వారి అవసరాలకు తగినట్టుగా డబ్బు వాడుకోవటం కోసం ప్రతి గ్రామ సమాఖ్య వద్ద స్వైపింగ్ మిషన్‌తో పాటు నగదు కూడా అందుబాటులో ఉంచుతారు. గ్రామ సమైఖ్య వద్ద రూ.200 నుంచి రూ.1000 లోపు ఎంతైనా తీసుకోవచ్చు. స్వైపింగ్ మిషన్‌కు వేలిముద్రలు అందని వృద్ధులకు వెసులుబాటు కల్పించారు. అలాంటివాళ్లు బ్యాంకుల ద్వారా నేరుగా డబ్బు తీసుకోవచ్చు. లేదా తమకు నమ్మకస్తులు అనుకున్నవారికి ఆథరైజేషన్ ఇవ్వొచ్చు. గ్రామంలోని ప్రతి బ్యాంకు వద్ద ఏటీఎంలు, ప్రతి గ్రామ సమాఖ్య, రేషన్ డీలర్, విత్తన డీలర్ వద్ద స్వైపింగ్ మిషన్ అందుబాటులో ఉంచుతారు. ఖాతాలోంచి బదిలీ అయిన నగదు, మరో ఖాతాలో చేరిన నగదు సమాచారం ఎస్సె మ్మెస్ రూపంలో సెల్ఫోన్లకు వస్తుంది. ఇప్పటి వరకు ఇంగ్లిష్‌లోనే వస్తున్న ఈ సమాచారం గ్రామీణుల సౌకర్యార్ధం ఇక మీదట తెలుగులో వస్తుంది. బంగారం జోలికోస్తే బాగుండదు ‘బంగారం ఎంత ఉందని నా మొగుడే లెక్క అడగలేదు.. మోదీ ఎం దుకు అడుగుతున్నడు’ అని సిద్దిపేట జిల్లా పాలమాకులకు చెందిన గంగవ్వ అడిగిన ప్రశ్న సభలో నవ్వులు పూయిం చింది. కిలోలకు కిలోల బంగారం ఉన్నోళ్ల దగ్గరకు పోయి ఏమైనా చేసుకొమ్మని సలహా ఇచ్చింది. ‘మా ఆడోళ్లకు బంగా రం అంటే ఇష్టం ఉంటది సారు. సాటు కో.. మాటుకో రూపాయి కూడబెట్టుకొని ఇంత బంగారం కొనుక్కుంటం. అవ్వగారోళ్లు ఇంత బంగారం పెడతరు. రశీదులు చూపించమంటే ఎక్కడి నుంచి తెస్తం. బంగారం జోలికి వస్తే మాత్రం ఢీ అంటే ఢీ. ఎంత లెకై కనా పోతం’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.