ఇకపై రూపే కార్డుతోనే క్రయవిక్రయాలు
ఇకపై రూపే కార్డుతోనే క్రయవిక్రయాలు
Published Fri, Dec 2 2016 2:38 AM | Last Updated on Mon, Sep 4 2017 9:38 PM
విధివిధానాలు ప్రకటించిన మంత్రి హరీశ్‌రావు
అధీకృత ఖాతాదారుని వేలిముద్రలు సరిపోలితేనే కరెన్సీ బదిలీ
వృద్ధుల కోసం గ్రామ సమైక్య సంఘాల వద్ద నగదు, స్వైపింగ్ మిషన్
సాక్షి. సిద్దిపేట: ఇకపై రూపే కార్డుతోనే క్రయవిక్రయాలు జరుగుతాయని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రకటిం చారు. నగదురహిత లావా దేవీలను సిద్దిపేట నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రకటిం చిన నేపథ్యంలో గురువారం సిద్దిపేటలో మహిళా సమాఖ్యకు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా అధికారులు, బ్యాంకు అధికారులు, వివిధ గ్రామాల మహిళా సమాఖ్యలు ,ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి విధివిధానాలను ప్రకటించారు.
ఆధారు కార్డు ఆధారంగా 18 ఏళ్లు నిండిన వారికి బ్యాంకులో ఖాతాలు తెరిచి రూపే కార్డు ఇస్తారు. ప్రతి క్రయ విక్రయం ఈ కార్డు ద్వారానే జరుగు తుంది.
జన్‌ధన్ బ్యాంకు ఖాతాలతో పాటు, మహిళా సంఘాలు, పింఛనుదారులకు ప్రత్యేక స్వైపింగ్ మిషన్ రూపొందించారు.
వృద్ధాప్య పింఛన్‌దారులకు రూపే కార్డు అందజేస్తారు. వారి అవసరాలకు తగినట్టుగా డబ్బు వాడుకోవటం కోసం ప్రతి గ్రామ సమాఖ్య వద్ద స్వైపింగ్ మిషన్‌తో పాటు నగదు కూడా అందుబాటులో ఉంచుతారు. గ్రామ సమైఖ్య వద్ద రూ.200 నుంచి రూ.1000 లోపు ఎంతైనా తీసుకోవచ్చు.
స్వైపింగ్ మిషన్‌కు వేలిముద్రలు అందని వృద్ధులకు వెసులుబాటు కల్పించారు. అలాంటివాళ్లు బ్యాంకుల ద్వారా నేరుగా డబ్బు తీసుకోవచ్చు. లేదా తమకు నమ్మకస్తులు అనుకున్నవారికి ఆథరైజేషన్ ఇవ్వొచ్చు.
గ్రామంలోని ప్రతి బ్యాంకు వద్ద ఏటీఎంలు, ప్రతి గ్రామ సమాఖ్య, రేషన్ డీలర్, విత్తన డీలర్ వద్ద స్వైపింగ్ మిషన్ అందుబాటులో ఉంచుతారు.
ఖాతాలోంచి బదిలీ అయిన నగదు, మరో ఖాతాలో చేరిన నగదు సమాచారం ఎస్సె మ్మెస్ రూపంలో సెల్‌ఫోన్లకు వస్తుంది. ఇప్పటి వరకు ఇంగ్లిష్‌లోనే వస్తున్న ఈ సమాచారం గ్రామీణుల సౌకర్యార్ధం ఇక మీదట తెలుగులో వస్తుంది.
బంగారం జోలికోస్తే బాగుండదు
‘బంగారం ఎంత ఉందని నా మొగుడే లెక్క అడగలేదు.. మోదీ ఎం దుకు అడుగుతున్నడు’ అని సిద్దిపేట జిల్లా పాలమాకులకు చెందిన గంగవ్వ అడిగిన ప్రశ్న సభలో నవ్వులు పూయిం చింది. కిలోలకు కిలోల బంగారం ఉన్నోళ్ల దగ్గరకు పోయి ఏమైనా చేసుకొమ్మని సలహా ఇచ్చింది. ‘మా ఆడోళ్లకు బంగా రం అంటే ఇష్టం ఉంటది సారు. సాటు కో.. మాటుకో రూపాయి కూడబెట్టుకొని ఇంత బంగారం కొనుక్కుంటం. అవ్వగారోళ్లు ఇంత బంగారం పెడతరు. రశీదులు చూపించమంటే ఎక్కడి నుంచి తెస్తం. బంగారం జోలికి వస్తే మాత్రం ఢీ అంటే ఢీ. ఎంత లెకై కనా పోతం’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
Advertisement
Advertisement