Rupe card
-
మోదీకి యూఏఈ అవార్డు
అబుధాబి/మనామా: భారత ప్రధాని మోదీ తన సోదరుడంటూ రెండు దేశాల సంబంధాల్లో సౌహార్థతను చాటిచెప్పారు యూఏఈ రాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్. యూఏఈలో మోదీ పర్యటనను పురస్కరించుకుని విడుదల చేసిన సందేశంలో ఆయన.. ‘మరోసారి రెండో సొంతింటికి వస్తున్నందుకు నా సోదరుడికి కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. ఆ తర్వాత మోదీకి రాజప్రసాదంలో ఆయన స్వాగతం పలికారు. ఇరువురు నేతలు వాణిజ్య, సాంస్కృతిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. ఈ సందర్భంగా మోదీని యూఏఈ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్’ పురస్కారంతో గౌరవించారు. 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఎన్నడూ లేనంత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేసిన మోదీ ని ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు యూఏఈ రాజు అల్ నహ్యాన్ ఏప్రిల్‌లో ప్రకటించిన విష యం తెలిసిందే. అనంతరం జరిగిన కార్యక్రమం లో ప్రధాని మోదీ భారతీయ ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానం రూపే కార్డును ప్రారంభించారు. దీనివల్ల ఏటా యూఏ ఈ సందర్శించే 30 లక్షల మంది భారతీయులకు లాభం కలగనుంది. కశ్మీర్ దేశ చోదకశక్తి రాజకీయ స్థిరత్వం, సానుకూల విధానాల కారణంగానే భారత్ పెట్టుబడిదారులను విశేషంగా ఆకర్షిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త చోదకశక్తిగా మారనున్న కశ్మీర్లో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని పేర్కొన్నా రు. అబుధాబిలో ప్రవాస భారతీయ పారిశ్రామిక వేత్తలతో జరిగిన సమావేశంలో మోదీ ప్రసంగించారు. ‘రాజకీయ స్థిరత్వం, అనుకూల విధానాల వల్లే పెట్టుబడిదారులు భారత్‌వైపు ఆకర్షితులవుతున్నారు. దేశంలో వృద్ధికి ప్రోత్సాహం, ఉద్యోగ కల్పన, ‘మేక్ ఇన్ ఇండియా’కు తోడ్పాటుకు అనుకూలంగా ప్రభుత్వం విధానాలను రూపొందిస్తోంది. వీటితోపాటు పెట్టుబడిదారులకు తగు ప్రతిç ఫలం కూడా దక్కేలా చూస్తోంది. అందుకే భారత్ లో ఉన్న విస్తృత అవకాశాలను అందిపుచ్చుకోండి’ అని కోరారు. ‘ఎన్నో ఏళ్లుగా వెనుకబాటుకు గురైన జమ్మూకశ్మీర్‌లో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలున్నాయి. అక్కడి యువతకు ఉపాధి కల్పించేందుకు, అభివృద్ధికి అనుకూల వాతావరణం కల్పించాం. భారత్ అభివృద్ధికి కశ్మీర్ ప్రాంతం చోదకశక్తిగా మారనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా మారేందుకు కూడా జమ్ము, కశ్మీ ర్, లదాఖ్‌లకు ఎన్నో అవకాశాలున్నాయి. అక్కడి కి రావాలని ఆహ్వానిస్తున్నా’ అని మోదీ పేర్కొన్నా రు. ఖలీజ్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ‘కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370తో కొందరు మాత్రమే లాభపడ్డారు. అక్కడి యువతపై తీవ్రవాద భావాలను నూరిపోశారు. ఉగ్రవాదం, హింసాత్మక చర్యలకు పాల్పడేలా తయారు చేశారు.’ అని తెలిపారు. ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు మేం తీసుకున్న చర్యలకు యూఏ ఈ ప్రభుత్వం మద్దతు ప్రకటించిందన్నారు . బహ్రెయిన్ చేరుకున్న మోదీ శుక్రవారం యూఏఈ చేరుకున్న ప్రధాని మోదీ అక్కడి పర్యటన ముగించుకుని శనివారం సాయం త్రం బహ్రెయిన్ చేరుకున్నారు. రాజప్రసాదంలో రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా మోదీకి ఘనస్వాగతం పలికారు. ప్రధానమంత్రి ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్‌తో భేటీ అయి ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై మోదీ చర్చలు జరిపారు. అంతరిక్ష విజ్ఞానం, సౌరశక్తి, సాంస్కృతిక సంబంధాలపై రెండు దేశాలు పలు ఎంవోయూలపై సంతకాలు చేశాయి. ఇస్రోతో బహ్రెయిన్ నేషనల్ స్పేస్ సైన్స్ ఏజెన్సీ పరస్పర సహకారం వీటిల్లో ఒకటి. కాగా, భారత ప్రధాని ఒకరు బహ్రెయిన్ దేశంలో పర్యటించడం ఇదే ప్రథమం. ఆదివారం ఆయన గల్ఫ్ ప్రాంతంలోనే అతిపురాతన శ్రీనాథ్జీ ఆలయ పునర్నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. అనంతరం మోదీ ఇక్కడి నుంచి తిరిగి ఫ్రాన్సు రాజధాని పారిస్‌లో జరిగే జీ–7 సమ్మిట్‌లో పాల్గొనేందుకు వెళ్లనున్నారు. -
రూపే కార్డుకు నోట్ల రద్దు బూస్ట్
ముంబై: పెద్ద నోట్ల రద్దుతో డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నాయి. నవంబర్ 8న డీమోనిటైజేషన్ ప్రకటన తర్వాత నుంచి పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్)ల వద్ద రూపే కార్డు వినియోగం ఏకంగా ఏడు రెట్లు పెరిగింది. రోజువారీ లావాదేవీల సంఖ్య 21 లక్షలకు చేరింది. ఇదే దూకుడు కొనసాగిస్తూ వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి రోజువారీ లావాదేవీల సంఖ్యను 50 లక్షలకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు రూపే కార్డు నిర్వహణ సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) ఎండీ ఏపీ హోతా తెలిపారు. డీమోనిటైజేషన్‌కి ముందు పీవోఎస్ల వద్ద, ఈ–కామర్స్ కొనుగోళ్లలో రూపే కార్డు ద్వారా లావాదేవీలు రోజుకు సుమారు 3 లక్షలు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం 21 లక్షలకు ఎగిశాయని ఆయన వివరించారు. ఒకవేళ డీమోనిటైజేషన్ గానీ జరగకపోయి ఉంటే ఈ పరిమాణాన్ని సాధించడానికి మరింతగా శ్రమ పడాల్సి వచ్చేదని పేర్కొన్నారు. మరోవైపు, తమ ప్లాట్‌ఫాంపై యూఎస్ఎస్డీ (అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా) ఆధారిత మొబైల్ బ్యాంకింగ్ సేవల లావాదేవీలు రోజుకు 1.5 లక్షల నుంచి సుమారు 6 లక్షలకు పెరిగాయని హోతా వివరించారు. అత్యాధునికమైన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా లావాదేవీలు రోజుకు 35,000 నుంచి 70,000కు పెరిగాయని, ఏప్రిల్‌లో ప్రవేశపెట్టినప్పట్నుంచీ ఇప్పటిదాకా 33 బ్యాంకులు ఈ ప్లాట్‌ఫాంలో భాగమయ్యాయని ఆయన పేర్కొన్నారు. మార్కెట్ పరిధి చాలా విస్తృతమైనదని, యూపీఐతో ఈ–వాలెట్లకు వచ్చిన నష్టమేమీ లేదని హోతా చెప్పారు. ఎన్పీసీఐ ఇప్పటిదాకా 31.70 కోట్ల మేర రూపే కార్డులు జారీ చేసింది. ఇందులో జన్‌ధన్ ఖాతాదారులకు జారీ చేసినవి సుమారు 20.5 కోట్ల కార్డులు ఉన్నాయి. -
ఇకపై రూపే కార్డుతోనే క్రయవిక్రయాలు
విధివిధానాలు ప్రకటించిన మంత్రి హరీశ్‌రావు అధీకృత ఖాతాదారుని వేలిముద్రలు సరిపోలితేనే కరెన్సీ బదిలీ వృద్ధుల కోసం గ్రామ సమైక్య సంఘాల వద్ద నగదు, స్వైపింగ్ మిషన్ సాక్షి. సిద్దిపేట: ఇకపై రూపే కార్డుతోనే క్రయవిక్రయాలు జరుగుతాయని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రకటిం చారు. నగదురహిత లావా దేవీలను సిద్దిపేట నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రకటిం చిన నేపథ్యంలో గురువారం సిద్దిపేటలో మహిళా సమాఖ్యకు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా అధికారులు, బ్యాంకు అధికారులు, వివిధ గ్రామాల మహిళా సమాఖ్యలు ,ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి విధివిధానాలను ప్రకటించారు. ఆధారు కార్డు ఆధారంగా 18 ఏళ్లు నిండిన వారికి బ్యాంకులో ఖాతాలు తెరిచి రూపే కార్డు ఇస్తారు. ప్రతి క్రయ విక్రయం ఈ కార్డు ద్వారానే జరుగు తుంది. జన్‌ధన్ బ్యాంకు ఖాతాలతో పాటు, మహిళా సంఘాలు, పింఛనుదారులకు ప్రత్యేక స్వైపింగ్ మిషన్ రూపొందించారు. వృద్ధాప్య పింఛన్‌దారులకు రూపే కార్డు అందజేస్తారు. వారి అవసరాలకు తగినట్టుగా డబ్బు వాడుకోవటం కోసం ప్రతి గ్రామ సమాఖ్య వద్ద స్వైపింగ్ మిషన్‌తో పాటు నగదు కూడా అందుబాటులో ఉంచుతారు. గ్రామ సమైఖ్య వద్ద రూ.200 నుంచి రూ.1000 లోపు ఎంతైనా తీసుకోవచ్చు. స్వైపింగ్ మిషన్‌కు వేలిముద్రలు అందని వృద్ధులకు వెసులుబాటు కల్పించారు. అలాంటివాళ్లు బ్యాంకుల ద్వారా నేరుగా డబ్బు తీసుకోవచ్చు. లేదా తమకు నమ్మకస్తులు అనుకున్నవారికి ఆథరైజేషన్ ఇవ్వొచ్చు. గ్రామంలోని ప్రతి బ్యాంకు వద్ద ఏటీఎంలు, ప్రతి గ్రామ సమాఖ్య, రేషన్ డీలర్, విత్తన డీలర్ వద్ద స్వైపింగ్ మిషన్ అందుబాటులో ఉంచుతారు. ఖాతాలోంచి బదిలీ అయిన నగదు, మరో ఖాతాలో చేరిన నగదు సమాచారం ఎస్సె మ్మెస్ రూపంలో సెల్ఫోన్లకు వస్తుంది. ఇప్పటి వరకు ఇంగ్లిష్‌లోనే వస్తున్న ఈ సమాచారం గ్రామీణుల సౌకర్యార్ధం ఇక మీదట తెలుగులో వస్తుంది. బంగారం జోలికోస్తే బాగుండదు ‘బంగారం ఎంత ఉందని నా మొగుడే లెక్క అడగలేదు.. మోదీ ఎం దుకు అడుగుతున్నడు’ అని సిద్దిపేట జిల్లా పాలమాకులకు చెందిన గంగవ్వ అడిగిన ప్రశ్న సభలో నవ్వులు పూయిం చింది. కిలోలకు కిలోల బంగారం ఉన్నోళ్ల దగ్గరకు పోయి ఏమైనా చేసుకొమ్మని సలహా ఇచ్చింది. ‘మా ఆడోళ్లకు బంగా రం అంటే ఇష్టం ఉంటది సారు. సాటు కో.. మాటుకో రూపాయి కూడబెట్టుకొని ఇంత బంగారం కొనుక్కుంటం. అవ్వగారోళ్లు ఇంత బంగారం పెడతరు. రశీదులు చూపించమంటే ఎక్కడి నుంచి తెస్తం. బంగారం జోలికి వస్తే మాత్రం ఢీ అంటే ఢీ. ఎంత లెకై కనా పోతం’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. -
‘స్మార్ట్’గా లబ్ధి
⇒ ఇక అన్ని పథకాలూ ఆన్లైన్లోనే ⇒ రేషన్‌కు రూపే కార్డు ద్వారా చెల్లింపులు ⇒ ఆధార్’తో సంక్షేమ పథకాల అనుసంధానం ⇒ పారదర్శకతే లక్ష్యంగా వినూత్న కార్యక్రమం సాక్షి, రంగారెడ్డి జిల్లా: సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టబోతోంది. పారదర్శకతతోపాటు అర్హులకు మరింత వేగంగా లబ్ధి చేకూర్చేలా ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ క్రమంలో అన్ని సంక్షేమ పథకాలకు ఆధార్ వివరాలను జతచేయనున్నారు. ఆసరా పథకం ద్వారా అందించే పింఛన్లు మొదలు.. గ్యాస్ సిలిండర్ రాయితీ, విద్యార్థుల ఉపకారవేతనాలు, ఉపాధి హామీ కూలీ డబ్బులు, రేషన్ సరుకులు తదితర అన్ని పథకాలకు ఈ పద్ధతినే అనుసరించాలని భావిస్తోంది. ఈ క్రమంలో ప్రయోగాత్మకంగా రేషన్ పంపిణీలో దీన్ని అమలు చేసేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు మొదలుపెట్టింది. వివరాలన్నీ క్రోడీకరిస్తూ.. పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు ప్రస్తుతం మ్యాన్యువల్ పద్ధతిలో ఫలాలు అందిస్తున్నా రు. కొత్త విధానంతో మ్యాన్యువల్ పద్ధతికి చెల్లుచీటీ ఇవ్వడంతోపాటు అన్నింటా ఆన్లైన్ పద్ధతిని అనుసరించనున్నారు. ఇందుకు లబ్ధిదారుల ఆధార్ సంఖ్యను ఖచ్చితంగా నమోదు చేయనున్నారు. ఈ క్రమంలో బోగస్‌ను అరికట్టడంతోపాటు లబ్ధిదారుడికి త్వరితంగా ఫలా ల్ని అందించవచ్చ. ఈ నేపథ్యం లో జిల్లాలో సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిపొందుతున్నవారి ఆధార్ వివరాలను వేరువేరుగా సేకరిస్తున్నారు. జిల్లాలో ఈ ప్రక్రియ దాదాపు పూర్తి చేసినప్పటికీ.. పొరపాట్లకు తావులేకుండా మరోమారు పరిశీలించి ఖరారు చేస్తున్నారు. ‘రూపే’ రేషన్ ఆహార భద్రత పథకానికి సంబంధించి ప్రస్తుతం ఎఫ్ఎస్ (ఫుడ్ సెక్యూరిటీ) కార్డుల ద్వారా సరుకులు పంపిణీ చేస్తున్నారు. లబ్ధిదారులు రేషన్ డీలరుకు డబ్బులు చెల్లించి సరుకులు తీసుకుంటున్నారు. ఈ పద్ధతిలో అక్రమాలు జరిగే అవకాశం లేకపోలేదు. ఈ పరిస్థితిని అధిగమించి అర్హులకు మాత్రమే రేషన్ సరుకులు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో ఆన్లైన్ పద్ధతిలో సరుకులు తీసుకునే విధానాన్ని ప్రవేశపెట్టబోతోంది. లబ్ధిదారులు న గదును నేరుగా డీలరుకు చెల్లించకుండా బయోమెట్రిక్ పద్ధతిలో చెల్లింపులు చేసిన తర్వాతే సరుకులు అందించే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ‘జన్‌ధన్‌యోజన’ ద్వారా మెజారిటీ ప్రజలు బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఈ క్రమంలో బ్యాంకులో నగదును సదరు డెబిట్ కార్డు(రూపే) ద్వారా ఎలక్ట్రానిక్ పద్ధతిలో డీలరుకు చెల్లించి సరుకులు పొందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రూపే కార్డుల ద్వారా చెల్లింపులు స్వీకరించడం, నగదును జమచేసేందుకు ప్రత్యేకంగా ఒక వ్యాపార ప్రతినిధిని ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తారు. ఈ పద్ధతి దేశంలోనే తొలిసారిగా జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. -
జనధన కింద 10 కోట్ల ఖాతాలు
నెల రోజుల ముందుగానే లక్ష్యాన్ని సాధించిన బ్యాంకులు 7.28 రుపే కార్డుల జారీ న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి జన ధన యోజన (పీఎంజేడీవై) కింద 10 కోట్ల ఖాతాలు తెరవాలంటూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని నెల రోజుల ముందుగానే బ్యాంకులు అధిగమించాయి. డిసెంబర్ 26 నాటికి మొత్తం 10.08 కోట్ల ఖాతాలు తెరిచినట్లు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. వాస్తవానికి ఈ లక్ష్యాన్ని జనవరి 26 నాటికల్లా సాధించాలని కేంద్రం నిర్దేశించింది. డిసెంబర్ 22 నాటికి 7.28 కోట్ల రుపే కార్డులు జారీ అయ్యాయి. మిగతా వాటిని జనవరి 15 లోగా జారీ చేస్తామని పీఎంజేడీవై మిషన్ డెరైక్టర్ అనురాగ్ జైన్‌తో జరిగిన భేటీలో బ్యాంకులు తెలిపాయి. ఖాతాదారులందరికీ పాస్బుక్ల జారీ కూడా ఆలోగా పూర్తి చేయాలని జైన్ ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల అధిపతులు, ఐబీఏ, ఎన్పీసీఐ, యూఐడీఏఐ ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. మరోవైపు, జీవిత బీమా క్లెయిములను వేగవంతంగా సెటిల్ చేసే అంశాన్ని కూడా ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు. క్లెయిమ్ ఫారంలను తమ వెబ్సైట్లలో ఉంచాల్సిందిగా బ్యాంకులు, ఎల్ఐసీకి కేంద్రం సూచించింది. క్లెయిమ్ దాఖలైన 15 రోజుల్లోగా సెటిల్ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పరిష్కార ప్రక్రియ 30 రోజులు దాటకూడదని ఎల్ఐసీని ఆదేశించింది. డిసెంబర్ ఆఖరు నాటికల్లా సర్వే పనులు మొత్తం పూర్తి కాగలవని బ్యాంకులు తెలిపాయి. ఆ తర్వాత ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ జరిపి, ఇంకా మిగిలిపోయిన వారి ఖాతాలను తెరవడం చేపడతారు. అందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు బ్యాంకులు 1.23 లక్షల సబ్ సర్వీస్ ఏరియాల్లో బ్యాంక్ ‘మిత్ర’ డివైజ్‌లను ఏర్పాటు చేశాయి. మరో 6.031 ఎస్‌ఎస్‌ఏల్లో ఏర్పాటు చేయాల్సి ఉంది. జనవరి 15 లోగా ఇది పూర్తి చేయాలని, వివరాలను తమ వెబ్సైట్లలోనూ పొందుపర్చాలని బ్యాంకులకు ప్రభుత్వం సూచించింది.