ఈసీఐఎల్ ఉద్యోగి భార్య ఆత్మహత్య
ఈసీఐఎల్ సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి భార్య ఆత్మహత్యకు పాల్పడింది. పవన్‌కుమార్ ఈసీఐల్ ఉద్యోగం చేస్తూ కుషాయిగూడ డీఐ కాలనీలో భార్య శ్వేతాశర్మతో కలసి నివాసం ఉంటున్నారు. కాగా, పవన్‌కమార్, అతని భార్య శ్వేతాశర్మ(27) మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శ్వేతాశర్మ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా సోమవారం ఉదయం గుర్తించారు. వీరు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందినవారు. పోలీసులు కేసు నమోదు చేశారు.