జికా వైరస్ నిర్ధారణకు 2 కేంద్రాల గుర్తింపు
సాక్షి, అమరావతి: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జికా వైరస్ నిర్ధారణకు ప్రత్యేక ల్యాబొరేటరీల ఏర్పాటుకు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుమతించింది. జికా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అప్ర మత్తంగా ఉండాలని ఈ మేరకు కేంద్ర అధి కారులు ఆదేశాలు జారీచేశారు.
దేశం మొత్తం మీద 25 ల్యాబొరేటరీలను గుర్తించగా అందులో ఆంధ్రప్రదేశ్‌లో శ్రీ వెంకటేశ్వరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎస్వీఎంసీ-తిరుపతి), తెలంగాణలో గాంధీ మెడికల్ కాలేజ్ (జీఎంసీ-సికింద్రాబాద్)లను గుర్తించారు. ఈ రెండు సెంటర్లలో జికా వైరస్‌కు సంబంధించిన కేసులను నిర్ధారిస్తే కేంద్రానికి తెలియ జేయాలని పేర్కొన్నారు.